ఆదివారం టీఎస్, ఏపీ సెట్ పరీక్ష
హైదరాబాద్: తెలంగాణ, ఏపీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సెట్) ఆది వారం జరగనుంది. ఇందుకోసం రెండు రాష్ట్రాల్లో 218 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. జంటనగరా ల్లో 51 పరీక్షా కేంద్రాలున్నట్లు శుక్రవారం సభ్య కార్యదర్శి ప్రొ.రాజేశ్వర్రెడ్డి తెలిపారు. ఉదయం 9.30 నిమిషాలకు పరీక్ష ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు.