Andrology Counseling
-
వొంపువల్ల ఇబ్బంది ఉండదు
యాండ్రాలజీ కౌన్సెలింగ్ నా వయుస్సు 45 ఏళ్లు. నాకు 24 ఏళ్ల క్రితం పెళ్లరుు్యంది. అప్పటినుంచి నేను సెక్స్‌లో ఎలాంటి అవాంతరాలు లేకుండా పాల్గొంటున్నాను. అరుుతే నాకు ఒక ఏడాది క్రితం అంగం ఎడవువైపునకు 45 డిగ్రీలు ఒంపు తిరిగింది. ఈ వంకర సెక్స్‌లో పాల్గొన్నప్పుడు వూత్రమే ఉంటోంది. ప్రస్తుతానికి దీనిల్ల సెక్స్‌కు ఎలాంటి అవరోధం లేకపోరుునా భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులు జరిగే అవకాశం ఉందా? ఈ వంకరకు కారణం ఏమిటి? - గంగారాం, రేపల్లె అంగం వంకరగా ఉండటం కొంతవరకు సాధారణం. దీనివల్ల సెక్స్‌లో పాల్గొనడానికి సమస్య లేకపోతే అంగం కొంత వంకరగా ఉన్నా నష్టం ఏమీ లేదు. మీరు చెప్పిన విధంగా ఈ సమస్య ఒక సంవత్సరం నుంచే ఉంటే కొన్నిసార్లు పెరోనిస్ డిసీజ్ (అంగం మీద ఒకవైపు ఉన్న లోచర్మం గట్టిపడి ఎలాస్టిక్ స్వభావం తగ్గడం) వల్ల కావచ్చు. యుూరాలజిస్ట్ పురుషాంగాన్ని పరీక్షిస్తే దీన్ని కనుక్కుంటారు. ఇలాంటి సమస్య వల్ల మీకు ఎలాంటి సమస్య లేకపోతే ఈ వంకరకు చికిత్స అవసరమే లేదు. పెరోనిస్ డిసీజ్‌తో సెక్స్ సావుర్థ్యానికి లోపం ఉండదు. ఒకవేళ చికిత్స తీసుకోవాలనుకున్నా యుూరాలజిస్ట్ ద్వారా పొందవచ్చు. నా వయస్సు 28 ఏళ్లు. నాకు ఎడమవైపున ఉన్న వృషణం కుడివైపు దానికంటే కొంచెం కిందికి జారినట్లుగా ఉంటుంది. దాంతో నా పురుషాంగం కొంచెం ఎడమవైపునకు వంగినట్లుగా ఉంది. దాంతో అంగం స్తంభించినప్పుడల్లా నా పురుషాంగం ఎడమవైపునకు ఒంగుతోంది. ఇలా ఉంటే నేను పెళ్లి చేసుకొని సెక్స్‌లో పాల్గొంటే ఇబ్బందులు వస్తాయా? దీనికి చికిత్స ఉంటుందా? - సీహెచ్.ఆర్.కె., మధిర సాధారణంగా ఎడమవైపున ఉండే వృషణం కుడివైపు కంటే కొంచెం కిందికే ఉంటుంది. ఇలా వృషణాలు సమానమైన లెవెల్లో లేకపోవడం చాలా సాధారణం. అంగం కూడా కొంచెం ఎడమవైపునకో, కుడివైపునకో పక్కకు తిరిగి ఉండటం కూడా సహజమే. అంగం ఇలా పక్కకో తిరిగి ఉండటానికీ, వృషణాల లెవెల్ సమానంగా లేకపోవడానికీ సంబంధం లేదు. మీకు సెక్స్ కోరికలు మామూలుగానే కలుగుతూ, అంగస్తంభన నార్మల్‌గా ఉంటే, వృషణాల్లో నొప్పి లేకపోతే నిర్భయంగా పెళ్లిచేసుకోవచ్చు. ఇది మీ దాంపత్య సుఖానికి ఏ విధంగానూ అడ్డు కాదు. డాక్టర్ వి. చంద్రమోహన్ యూరో సర్జన్ అండ్ యాండ్రాలజిస్ట్, ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్బి, హైదరాబాద్ -
యాండ్రాలజీ కౌన్సెలింగ్
నాకు 55 ఏళ్లు. ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్ అయ్యిందని ఏడాది క్రితం టీయూఆర్‌పీ అనే ఆపరేషన్ చేశారు. అప్పట్నుంచి అంగస్తంభనలు లేవు. ఈ ఆపరేషన్ వల్ల అంగస్తంభనలు తగ్గుతాయా? ముందు ముందు ఇది క్యాన్సర్‌కు దారి తీస్తుందా? పీఎస్ఏ పరీక్ష చేయించాలా? దీనివల్ల ప్రయోజనం ఏమిటి? - ఏ.కె.ఆర్., చెన్నై టీయూఆర్‌పీ అంటే... ట్రాన్స్ యురెథ్రల్ రిసెక్షన్ ఆఫ్ ప్రోస్టేట్. ఈ సర్జరీలో ఎండోస్కోపీ ప్రక్రియ ద్వారా పెరిగిన ప్రోస్టేట్ను తీసివేసి మూత్రం రావడానికి గల అడ్డును తొలగిస్తారు. ఇది 50 ఏళ్లు పైబడ్డ వాళ్లలో చాలా సాధారణంగా నిర్వహించే సర్జరీ. దీనికీ అంగస్తంభనలకు సంబంధం లేదు. అంతకుమునుపు ఉన్నట్లే సర్జరీ తర్వాత కూడా అంగస్తంభనలు ఉంటాయి. కాకపోతే 50 ఏళ్ల పైబడ్డవారిలో సాధారణంగా కనిపించే బీపీ, షుగర్ వంటి వాటి వల్లనో లేదా ఫిజికల్ ఫిట్నెస్ లేకపోవడం వల్లనో మీకు అంగస్తంభనలు తగ్గి ఉండవచ్చు. సాధారణంగా 50 ఏళ్లు పైబడ్డ వారు ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ (పీఎస్ఏ) పరీక్ష రెండేళ్లకు ఓసారి చేయించుకోవడం మంచిది. టీయూఆర్‌పీ సర్జరీ తర్వాత కూడా పీఎస్ఏ పరీక్ష తరచూ చేయించాలి. ఈ పరీక్ష చేయించడం ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్‌ను ముందే గుర్తిస్తే పూర్తిగా నయమయ్యేలా చికిత్స తీసుకోడానికి అవకాశం ఉంది. నా వయస్సు 25 ఏళ్లు. నా పురుషాంగం లోపల అంటే ముందుచర్మం వెనక్కిలాగితే బయటకు కనిపించే ప్రాంతంలో చిన్న చిన్న బుడిపెలు ఉన్నాయి. ఇవి రావడం ప్రమాదమా? చికిత్స అవసరమా? వివరించండి. - సీ.ఆర్.ఆర్., విశాఖపట్నం అంగం ముందు భాగం (గ్లాన్స్) మీద చిన్న చిన్న బుడిపెలు ఉండటం చాలా సాధారణం. ముఖం మీద మొటిమల్లాగే వీటిల్లోంచి కూడా స్రావాలు తయారవుతూ ఉంటాయి. కొందరికి చుట్టూరా తెల్లగా బుడిపెలు బుడిపెలుగా సాధారణంగా కంటే పెద్దగా కూడా ఉండవచ్చు. గట్టిగా నొక్కితే తెల్లటి స్రావం కూడా వస్తుంది. ఇవన్నీ మామూలుగా ఉండేవే. చాలామంది వీటిని ఇన్ఫెక్షన్ అనుకుంటారు. నొప్పి, మంట, దురద లేకుంటే ఈ చిన్న బుడిపెల గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. డాక్టర్ వి. చంద్రమోహన్ యూరో సర్జన్ అండ్ యాండ్రాలజిస్ట్, ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్, కె.పి.హెచ్.బి, హైదరాబాద్ -
యాండ్రాలజీ కౌన్సెలింగ్
నా వయస్సు 29 ఏళ్లు. నేను మూడేళ్ల క్రితం ఓ మహిళతో శారీరకంగా కలిశాను. ఆమెకు హెచ్ఐవీ ఉందేమోననే అనుమానంతో ఆమెకు హెచ్ఐవీ పరీక్ష చేయించాను. వెస్ట్రన్బ్లాట్ పరీక్ష కూడా చేయించాను. అన్ని రిపోర్టులూ నెగెటివ్ వచ్చాయి. ఆ మహిళకూ, నా భార్యకు కూడా పరీక్షలు చేయించాను. ఇద్దరికీ నెగెటివ్ వచ్చింది. అయితే విండో పిరియడ్ అని ఒకటి ఉంటుందని, ఆ సమయంలో వ్యాధి ఉన్నా బయటపడదని స్నేహితులు అంటున్నారు. ఈ విండో పిరియడ్ అంటే ఏమిటి? ఎన్నాళ్లుంటుంది? వివరించండి. - పి.వి.ఆర్., రాజమండ్రి వివాహేతర సంబంధాలు ఉన్నప్పుడు హెచ్ఐవీ వస్తుం దేమో అని భయం ఉంటుంది. దానికి ప్రధాన కారణం... కండోమ్ లేకుండా సెక్స్‌లో పాల్గొనడం. కండోమ్ వాడితే ఈ సమస్యను చాలా సులువుగా ఎదుర్కోవచ్చు. కండోమ్ వాడకుండా సెక్స్‌లో పాల్గొంటే హెచ్ఐవీ, హెపటైటిస్ లాంటి ఇన్ఫెక్షన్స్ సోకే ప్రమాదం ఉంది. ఆ వైరస్ల విండో పిరియడ్ కొన్ని వారాల నుంచి ఆరు నెలల వరకు ఉంటుంది. ఇక విండో పీరియడ్ అంటే ఏమిటనే విషయానికి వస్తే - ఏదైనా వైరస్‌ను వాటి యాంటీబాడీస్ ద్వారా గుర్తిస్తాం. ఓ వైరస్ శరీరంలోకి ప్రవేశించినప్పుడు వాటి యాంటీబాడీస్ ఉత్పత్తి కావడానికి కొంత సమయం పడుతుంది. ఆ వ్యవధినే విండో పీరియడ్ అంటాం. ఈ విండో పీరియడ్‌లో యాంటీబాడీస్ ఉండవు. అయితే శరీరంలో వైరస్ మాత్రం ఉంటుంది. అలాంటప్పుడు ఆ వైరస్ ఉన్నవాళ్లతో సెక్స్‌లో పాల్గొంటే (యాంటీబాడీస్ పరీక్షలో హెచ్ఐవీ టెస్ట్ నెగెటివ్ అని వచ్చినా) ఆ వైరస్ సోకే ప్రమాదం ఉంది. అందువల్ల ఆర్నెల్ల తర్వాత ఇద్దరికీ హెచ్ఐవీ పరీక్షలో నెగెటివ్ వస్తే దాదాపు వ్యాధి లేనట్లే అనుకోవచ్చు. ఇక కండోమ్ కంటే కూడా ఎలాంటి వివాహేతర సంబంధాలు లేకపోవడమే ముఖ్యం. అదే అన్నిటికంటే సురక్షితం. డాక్టర్ వి. చంద్రమోహన్ యూరో సర్జన్ అండ్ యాండ్రాలజిస్ట్, ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్, కె.పి.హెచ్.బి, హైదరాబాద్