Andromida solar
-
ఆండ్రోమెడాలో వెలుగుల పున్నమి
సువిశాల విశ్వంలో ఎన్నెన్నో నక్షత్ర మండలాలు (గెలాక్సీలు)న్నాయి. మన నక్షత్ర మండలాన్ని పాలపుంత (మిల్కీవే) అంటారన్నది తెలిసిందే. మనకు సమీపంలో ఉన్న అతిపెద్ద నక్షత్ర మండలం ఆండ్రోమెడా. ఈ గెలాక్సీలో అరుదైన దృశ్యాన్ని బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (ఐఐఏ) బృందం కెమెరాలో బంధించింది. గెలాక్సీలోని నక్షత్రాలపై ఉన్నట్టుండి పేలుడు సంభవించి భిన్న రంగులతో కూడిన అత్యధిక కాంతి వెలువడడాన్ని నోహ్‌వై అంటారు. ఆండ్రోమెడా నక్షత్ర మండలంలో ఇలాంటి నోహ్‌వై నుంచి పరారుణ ఉద్గారాలను తొలిసారిగా గుర్తించారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన ఆస్ట్రోశాట్ ఉపగ్రహంపై అమర్చిన అ్రల్టావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ (యూవీఐటీ) ద్వారా ఈ ఉద్గారాలను చిత్రీకరించారు. నోహ్‌వై సాధారణంగా బైనరీ నక్షత్ర వ్యవస్థలో సంభవిస్తూ ఉంటుంది. భూమి పరిమాణంలో ఉన్న మరుగుజ్జు నక్షత్రం మరో నక్షత్రానికి సమీపంలో పరిభ్రమిస్తున్నప్పుడు ఈ పరిణామాన్ని చూడొచ్చు. ఒక నక్షత్రం తన గురుత్వాకర్షణ శక్తితో మరో నక్షత్రంలోని పదార్థాన్ని ఆకర్షిస్తే శక్తివంతమైన థర్మోన్యూక్లియర్ రియాక్షన్ జరుగుతుంది. దాంతో హఠాత్తుగా మిరుమిట్లు గొలిపే వెలుగుతో నక్షత్రంపై పేలుడు సంభవిస్తుంది. ఆండ్రోమెడా గెలాక్సీలో నోహ్‌వై నుంచి 42 దాకా అ్రల్టావైలెట్ ఉద్గారాలను గుర్తించడం విశేషం. వీటిపై మరింత అధ్యయనం చేస్తున్నారు. ఈ వివరాలను అస్ట్రో ఫిజికల్ జర్నల్‌లో ప్రచురించారు. నక్షత్ర మండలాల గురించి తెలుసుకోవడానికి ఈ సమాచారం తోడ్పడుతుందని భావిస్తున్నారు. నోహ్‌వై రహస్యాలను ఛేదించడానికి భవిష్యత్తులో అ్రల్టావైలెట్, ఎక్స్–రే మిషన్లలో పరిశోధనలకు సైతం ఉపయోగపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సూసైడ్‌నోట్ కలకలం
వాడపల్లి వంతెనపై పోలీసులకు లేఖ, బైక్, ఫోన్ లభ్యం కృష్ణానదిలో గాలింపు చర్యలు మిస్సింగ్ కేసు నమోదు వాడపల్లి(దామరచర్ల) మండల పరిధిలోని వాడపల్లి వంతెనపై లభించిన ఓ సూసైడ్‌నోట్ తీవ్ర కలకలం రేపింది. వివరాలు..వాడపల్లి ఎస్సై వీరరాఘవులు బుధవారం ఉందయం పెట్రోలింగ్‌లో భా గంగా వంతెనపైకి వెళ్లగా బైక్, సూసైడ్‌నోట్ రాసిన కాపీ, స్విచ్ ఆఫ్ చేసిన మొబైల్ లభించాయి. లేఖలోని వివ రాలు ఇలా ఉన్నాయి.. ‘‘నాపేరు ధీరావత్ సుధాకర్, మాది దామరచర్ల మం డలం వీర్లపాలెం గ్రామం. అండ్రోమిడా సోలార్ ఇన్వర్టర్ కంపెనీలో మిర్యాలగూడ ఏరియాకు డీలర్‌గా పనిచేస్తున్నా. కంపెనీలో పనిచేస్తున్న నల్లగొండకు చెందిన వెంకట్‌రెడ్డి, విశాఖపట్టణానికి చెంది న రంఘనాథ్‌లు నాకు రూ.90 వేలు ఇవ్వాలి. వారిని సంప్రదిస్తే సాకులు చెబుతున్నారే తప్ప డబ్బులు ఇవ్వడం లేదు. ఆర్థిక ఇబ్బందులతో న దిలో దూకుతున్నా.. నా ఆత్మహత్యకు కారణం వారిద్దరే’’ అని రాసి ఉంది. దీంతో ఎస్ఐ వెంట నే ఘటన స్థలంలో లభించిన ఫోన్ ఆధారంగా సుధాకర్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అతడి గురించి ఆరా తీశాడు. మంగళవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని అతడి భార్య అర్పిత పోలీసులకు తెలిపింది. కాగా,సుధాకర్ బలవన్మరణానికి పాల్పడి ఉంటాడనే అనుమానంతో పోలీసులు నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. సుధాకర్ భార్య ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.