Andy murry
-
ఫెన్సర్ భవానీ దేవికి క్రీడా శాఖ చేయూత
ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొన్న తొలి భారతీయ ఫెన్సింగ్ క్రీడాకారిణిగా గుర్తింపు పొందిన భవానీ దేవి (తమిళనాడు) వచ్చే ఏడాది నాలుగు అంతర్జాతీయ టోర్నమెంట్లలో బరిలోకి దిగనుంది. ఈ టోర్నీలలో పాల్గొనేందుకు భవానీ దేవికి రూ. 8 లక్షల 16 వేలు కేంద్ర క్రీడా శాఖ మంజూరు చేసింది. జార్జియాలో వచ్చే జనవరి 14 నుంచి 16 వరకు జరిగే ప్రపంచకప్ టోర్నీతో భవానీ దేవి సీజన్ మొదలవుతుంది. ఆ తర్వాత బల్గేరియాలో, గ్రీస్‌లో, బెల్జియంలో జరిగే ప్రపంచకప్ టోర్నీలలోనూ ఆమె పోటీపడుతుంది. వైల్డ్ కార్డుతో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో... మెల్బోర్న్లో వచ్చే ఏడాది జనవరి 17 నుంచి 30 వరకు జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో ఐదుసార్లు రన్నరప్ ఆండీ ముర్రే (బ్రిటన్) వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బరిలోకి దిగనున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ముర్రే చివరిసారిగా 2019లో ఆడాడు. అనంతరం తుంటి గాయంతో బాధపడ్డాడు. గాయం నుంచి కోలుకొని ఈ ఏడాది జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడాల్సి ఉండగా... కరోనా బారిన పడటంతో బరిలోకి దిగలేదు. చదవండి: Harbhajan Singh: ఆడతాడు... తిడతాడు... కొడతాడు! అది భజ్జీ స్పెషల్.. -
ఫెడరర్ x ముర్రే
నేడు పురుషుల సెమీస్ ఎనిమిదోసారి వింబుల్డన్ టైటిల్ కోసం బరిలోకి దిగిన స్విస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ సెమీస్ పోరుకు సిద్ధమయ్యాడు. శుక్రవారం జరిగే మ్యాచ్‌లో బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రేతో అమీతుమీ తేల్చుకోనున్నాడు. ముఖాముఖి రికార్డులో రెండోసీడ్ ఫెడరర్ 12-11 ఆధిక్యంలో ఉన్నా.. ఈ మ్యాచ్‌లో ముర్రేకు స్థానికుల మద్దతు లభించడం కలిసొచ్చే అంశం. రెండో సెమీస్‌లో డిఫెండింగ్ చాంపియన్, టాప్‌సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)... రిచర్డ్ గాస్కెట్ (ఫ్రాన్స్)తో తలపడనున్నాడు. బుధవారం అర్ధరాత్రి జరిగిన క్వార్టర్ఫైనల్లో గాస్కెట్ 6-4, 4-6, 3-6, 6-4, 11-9తో నాలుగోసీడ్ స్టాన్ వావ్రింకా (స్విట్జర్లాండ్)పై అనూహ్యంగా నెగ్గాడు. సా. గం. 5.30 నుంచి స్టార్ స్పోర్ట్స్-2లో ప్రత్యక్ష ప్రసారం