నేడు పురుషుల సెమీస్
ఎనిమిదోసారి వింబుల్డన్ టైటిల్ కోసం బరిలోకి దిగిన స్విస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ సెమీస్ పోరుకు సిద్ధమయ్యాడు. శుక్రవారం జరిగే మ్యాచ్‌లో బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రేతో అమీతుమీ తేల్చుకోనున్నాడు. ముఖాముఖి రికార్డులో రెండోసీడ్ ఫెడరర్ 12-11 ఆధిక్యంలో ఉన్నా.. ఈ మ్యాచ్‌లో ముర్రేకు స్థానికుల మద్దతు లభించడం కలిసొచ్చే అంశం.
రెండో సెమీస్‌లో డిఫెండింగ్ చాంపియన్, టాప్‌సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)... రిచర్డ్ గాస్కెట్ (ఫ్రాన్స్)తో తలపడనున్నాడు. బుధవారం అర్ధరాత్రి జరిగిన క్వార్టర్‌ఫైనల్లో గాస్కెట్ 6-4, 4-6, 3-6, 6-4, 11-9తో నాలుగోసీడ్ స్టాన్ వావ్రింకా (స్విట్జర్లాండ్)పై అనూహ్యంగా నెగ్గాడు.
సా. గం. 5.30 నుంచి
స్టార్ స్పోర్ట్స్-2లో ప్రత్యక్ష ప్రసారం
ఫెడరర్ x ముర్రే
Published Fri, Jul 10 2015 12:57 AM | Last Updated on Sun, Sep 3 2017 5:11 AM
Advertisement
Advertisement