Anesthetic
-
మత్తు మందుకు గురైన బాధితులకు పరామర్శ
ఎంజీఎం (వరంగల్) : సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో మత్తుమందుకు గురై సృహ కోల్పోయిన బాధితులను రైల్వే ఎస్పీ అశోక్‌కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని మెరుగైనా వైద్యచికిత్సలు అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శనివారం రాత్రి 10 గంటలకు సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్ యశ్వంత్ పూర్ టూ న్యూఢిల్లీ వెళ్తుండగా ఆరుగురు రైలు ఎక్కారన్నారు. రైలు గంట ప్రయాణించిన తరువాత రైళ్లో ఇంకొందరు ఎక్కారు. వీరు ప్రయాణికులతో పరిచయం ఏర్పర్చుకుని సమోస, మజా, బిస్కెట్స్ తినిపించారు. వాటిని తినగానే ఆరుగురు వ్యక్తులు సృహ కోల్పోయినట్లు తెలిపారు. దాదాపు అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చినా వారు లేవకపోవడంతో తోటి ప్రయాణికులు మనించి రైల్వే కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు. స్పందించిన రైల్వే కంట్రోల్ రూమ్ ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు కాజీపేట స్టేషన్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. వెంటనే ఇక్కడి ఇన్స్పెక్టర్, వైద్యులు అప్రమత్తమై అంబులెన్స్‌లో ఎంజీఎంకు తరలించారు. వీరిలో ఐదుగురి పరిస్థితి బాగానే ఉందని, ఒక్క ప్రయాణికుడు మాత్రం సృహాలోకి రాలేదని తెలిపారు. -
ఆ......రోజుల్లోనే!
‘హ్యాంగోవర్గా ఉంది’ అని మత్తు మత్తుగా అనగానే కుప్పలు తెప్పలుగా సలహాలు వచ్చిపడతాయి. ఆధునిక వైద్యం పుణ్యమా అని పరిష్కార మార్గాలు కూడా ఎన్నో దొరుకుతాయి. కానీ, 1,900ల సంవత్సరాల క్రితమే ఈజిప్ట్‌లో హ్యాంగోవర్‌ను దించే పరిష్కారాలు లోకానికి తెలియజేశారు వైద్యులు. మందు ఎక్కువై శిరోభారానికి గురి కావడం, ఆకలిగా అనిపించకపోవడం, కళ్లు తిరగడం... మొదలైన సమస్యలకు పరిష్కార మార్గాలు, మందులకు సంబంధించి గ్రీకులో రాయబడిన ఆధారాలను కైరోలో కనుగొన్నారు. ‘‘హ్యాంగోవర్‌ను తగ్గించడానికి రకరకాల పరిష్కార మార్గాలు ఆరోజుల్లోనే కనుక్కోవడం ఆశ్చర్యం కలిగించే విషయం’’ అంటున్నాడు యూనివర్శిటీ కాలేజీ ఆఫ్ లండన్‌కు చెందిన చరిత్రకారుడు ప్రొఫెసర్ వివియన్ నటన్. వాడిపోయిన గులాబీలు, వాననీటితో కూడా హ్యాంగోవర్‌ను ఎలా తగ్గించవచ్చో వైద్యులు సూచించారు.