‘హ్యాంగోవర్‌గా ఉంది’ అని మత్తు మత్తుగా అనగానే కుప్పలు తెప్పలుగా సలహాలు వచ్చిపడతాయి.
‘హ్యాంగోవర్‌గా ఉంది’ అని మత్తు మత్తుగా అనగానే కుప్పలు తెప్పలుగా సలహాలు వచ్చిపడతాయి. ఆధునిక వైద్యం పుణ్యమా అని పరిష్కార మార్గాలు కూడా ఎన్నో దొరుకుతాయి. కానీ, 1,900ల సంవత్సరాల క్రితమే ఈజిప్ట్‌లో హ్యాంగోవర్‌ను దించే పరిష్కారాలు లోకానికి తెలియజేశారు వైద్యులు. మందు ఎక్కువై శిరోభారానికి గురి కావడం, ఆకలిగా అనిపించకపోవడం, కళ్లు తిరగడం... మొదలైన సమస్యలకు పరిష్కార మార్గాలు, మందులకు సంబంధించి గ్రీకులో రాయబడిన ఆధారాలను కైరోలో కనుగొన్నారు.
‘‘హ్యాంగోవర్‌ను తగ్గించడానికి రకరకాల పరిష్కార మార్గాలు ఆరోజుల్లోనే కనుక్కోవడం ఆశ్చర్యం కలిగించే విషయం’’ అంటున్నాడు యూనివర్శిటీ కాలేజీ ఆఫ్ లండన్‌కు చెందిన చరిత్రకారుడు ప్రొఫెసర్ వివియన్ నటన్. వాడిపోయిన గులాబీలు, వాననీటితో కూడా హ్యాంగోవర్‌ను ఎలా తగ్గించవచ్చో వైద్యులు సూచించారు.