Angoor
-
‘కచ్చా బాదం’ మరువక ముందే ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న మరో సాంగ్
సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత మారుమూల గ్రామంలో జరిగిన సంఘటన కూడా సెకన్ల వ్యవధిలో ప్రపంచం నలుమూలలా విస్తరిస్తోంది. తమ టాలెంట్‌తో కొందరు రాత్రికి రాత్రే స్టార్స్ అయిపోతున్నారు. పాటలు, డ్యాన్స్, రీల్స్ ఇంటర్నెట్లో వైరల్ అవ్వడంతో పాపులారిటీ తెచ్చుకుంటారు. కొన్నిరోజుల వరకు వీరు సోషల్ మీడియాను షేక్ చేస్తుంటారు. బచ్‌పన్‌కా ప్యార్ బుడ్డోడు, కచ్చా బాదమ్ అంకుల్ వీరంతా అలా ఫేమస్ అయిన వారే... తాజాగా కచ్చా బాదమ్ పాట మరవక ముందే మరో పాట నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. రోడ్డుపై బండి మీద ద్రాక్ష పండ్లను అమ్ముతున్న వ్యక్తి పాడిన పాట ప్రస్తుతం నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఇందులో ఓ వృద్ధుడు బండి మీద జామపండ్లు, ద్రాక్షను అమ్ముతూ పాట పాడుతూ కనిపిస్తున్నాడు. చేతిలో టీ కప్పు పట్టుకుని, 15 రూపాయల కే 12 అంగూర్లు తీసుకోండి అంటూ ఓ పాటను అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇన్‌స్టాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటికే 2.5మిలియన్ల మంది వీక్షించారు. 109వేల లైక్స్ వచ్చాయి. కావాలంటే దీన్ని మీరూ చూసేయండి. చదవండి: సీఆర్పీఎఫ్ బంకర్‌పై మహిళ బాంబు దాడి.. వీడియో వైరల్ View this post on Instagram A post shared by ★彡[ꜱᴀʟɪᴍ ɪɴᴀʏᴀᴛ]彡★ (@saaliminayat) -
నవ్వించడానికి రెడీ
రణ్వీర్ సింగ్ ప్రేక్షకులను నవ్వించాలనుకున్నారు. అందుకే దర్శకుడు రోహిత్ శెట్టితో కలిశారు. ఇప్పుడు రణ్వీర్తో కలసి ప్రేక్షకులను నవ్వించడానికి పూజా హెగ్డే, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా రెడీ అయ్యారని సమాచారం. అసలు విషయంలోకి వస్తే.. ‘అంగూర్’ (1982) చిత్రాన్ని రీమేక్ చేయాలనుకున్నారు రోహిత్ శెట్టి. హీరోగా రణ్వీర్ సింగ్‌ని ఎంపిక చేసి, అధికారికంగా ప్రకటించారు కూడా. రణ్‌వీర్‌ది డబుల్ రోల్. తన సరసన ఇద్దరు కథానాయికలు ఉంటారు. ఆ పాత్రలను పూజా హెగ్డే, జాక్వెలిన్ చేయబోతున్నారని బాలీవుడ్ టాక్. ఇది వినోద ప్రధానంగా సాగే సినిమా. ఆరంభం నుంచి చివరి వరకూ ఫుల్ కామెడీ ఉంటుంది. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్‌ని ప్రారంభించాలనుకుంటున్నారు. -
‘అంగూర్’ సినిమా అలా పుట్టింది!
కొంతమంది దర్శకులు, హీరోల మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. ఆ విషయంలో దర్శకుడు గుల్జార్, హీరో సంజీవ్ కుమార్లది పర్ఫెక్ట్ కాంబినేషన్. ‘పరిచయ్’, ‘కోషిష్’, ‘మౌసమ్’, ‘ఆంధీ’ సినిమాలు చూస్తే వాళ్ల క్లోజ్‌నెస్ ఎంతలా వర్కవుట్ అయ్యిందో అర్థమవుతుంది. బేసికల్‌గా వాళ్లిద్దరూ చాలా మంచి స్నేహితులు. రెగ్యులర్‌గా కలుసుకుంటుంటారు. అప్పుడు ఆల్కహాల్‌తో పాటు ఆలోచనలను కూడా షేర్ చేసుకునేవాళ్లు. సంజీవ్‌కుమార్ గుజరాతి. సో.. వాళ్లింట్లో మందు, నాన్‌వెజ్ బ్యాన్ కాబట్టి గుల్జార్ ఇంట్లోనే సిట్టింగ్స్ ఉండేవట. ఆ సిట్టింగ్స్‌లో హేమామాలినీ మీదున్న తన మనసు దగ్గర్నుంచి గుల్జార్ సినిమాల్లోని తన క్యారెక్టర్స్దాకా అన్నిటినీ గుల్జార్‌తో షేర్ చేసుకునేవారట సంజీవ్‌కుమార్. ‘మౌసమ్’ సినిమా సెట్స్ మీదున్నప్పుడే ఇలాంటి సిట్టింగ్‌లో ఒకసారి.. ‘అన్నీ వయసు మళ్లిన పాత్రలే ఇచ్చి ముప్పై ఏళ్లకే నన్ను అరవై ఏళ్ల వాడిని చేస్తున్నావ్! నీ సినిమాల్లో నాకు యంగ్ హీరో రోల్సే ఉండవా’ అని వాపోయారు సంజీవ్. ఆ మాట గుల్జార్ మనసులో బాగా నాటుకుపోయింది. సంజీవ్ కోరినట్టుగా ఆయనకు యంగ్ హీరో రోల్ ఇవ్వడానికి గుల్జార్‌కి ఆరేళ్లు పట్టింది. ఆ సినిమా 1982లో వచ్చిన ‘అంగూర్’! సాధారణంగా గుల్జార్.. స్క్రిప్ట్ డిమాండ్‌ను ఫాలో అయ్యి ఆర్టిస్టులను ఎంపిక చేసేవారు. కానీ ఆప్తమిత్రుడి కోసం మాత్రం హీరోను దృష్టిలో పెట్టుకొని ‘అంగూర్’ స్క్రిప్ట్ రాసుకున్నారు. ఆ కామెడీ మూవీ బంపర్ హిట్ అయింది. కామెడీ జానర్లో బాలీవుడ్లో ‘అంగూర్’ని మించిన సినిమా లేదు ఇప్పటికీ.