Anil Ambani Group company
-
టాటా కెమికల్స్- ఆర్‌క్యాపిటల్ జోరు
ముంబై, సాక్షి: కోవిడ్-19కు వ్యాక్సిన్లు, క్యూ2లో జీడీపీ పురోగతి నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు జోరు చూపుతున్నాయి. సరికొత్త గరిష్టాల రికార్డులతో ప్రారంభమై హుషారుగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో సానుకూల వార్తల కారణంగా డైవర్సిఫైడ్ కంపెనీ టాటా కెమికల్స్, ఫైనాన్షియల్ రంగ కంపెనీ రిలయన్స్ క్యాపిటల్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి భారీ లాభాలో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. టాటా కెమికల్స్ గ్రూప్ కంపెనీ టాటా కెమికల్స్‌లో ప్రమోటర్లు టాటా సన్స్ తాజాగా వాటాను పెంచుకున్నారు. ఓపెన్ మార్కెట్ ద్వారా 1.8 మిలియన్ టాటా కెమికల్స్ షేర్లను టాటా సన్స్ కొనుగోలు చేసినట్లు ఎన్ఎస్ఈ బల్క్ డేటా వెల్లడించింది. కంపెనీ ఈక్విటీ 0.71 శాతం వాటాకు సమానమైన వీటిని షేరుకి రూ. 420.92 ధరలో సొంతం చేసుకుంది. ఇందుకు రూ. 76 కోట్లు వెచ్చించింది. ఈ నేపథ్యంలో టాటా కెమికల్స్ షేరు తొలుత ఎన్ఎస్ఈలో 8 శాతంపైగా దూసుకెళ్లింది. రూ. 465కు చేరింది. ప్రస్తుతం 6.7 శాతం లాభంతో రూ. 456 వద్ద ట్రేడవుతోంది. గత నెల రోజుల్లో ఈ కౌంటర్ 42 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! రిలయన్స్ క్యాపిటల్ అనిల్ అంబానీ గ్రూప్ ఎన్బీఎఫ్సీ.. రిలయన్స్ క్యాపిటల్‌ను కొనుగోలు చేసేందుకు విదేశీ పీఈ సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. వీటిలో ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీ(ఏఆర్సీ)లు సైతం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. రుణ చెల్లింపులలో విఫలంకావడం ద్వారా రుణ పరిష్కార(రిజల్యూషన్) స్థితికి చేరిన రిలయన్స్ క్యాపిటల్ కొనుగోలుకి బ్లాక్‌స్టోన్ గ్రూప్, ఓక్టీ క్యాపిటల్, కేకేఆర్, బెయిన్ క్యాపిటల్, జేసీ ఫ్లవర్ తదితర పలు కంపెనీలు ఆసక్తిని వ్యక్తం చేస్తూ ఈవోఐను దాఖలు చేసినట్లు తెలుస్తోంది. రిలయన్స్ క్యాపిటల్ ఆస్తుల విక్రయానికి(మానిటైజేషన్) డిబెంచర్ హోల్డర్స్ కమిటీతోపాటు.. డిబెంచర్ ట్రస్టీ విస్ట్రా ఐటీసీఎల్ ఇండియా సన్నాహాలు చేస్తున్న విషయం విదితమే. వీటికి కంపెనీ రుణాలలో 93 శాతం వరకూ వాటా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రిలయన్స్ క్యాపిటల్ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. కొనేవాళ్లు అధికంకాగా.. అమ్మేవాళ్లు కరువకావడంతో రూ. 9.50 వద్ద ఫ్రీజయ్యింది. -
అధికారంలోకి వస్తే రఫేల్‌పై విచారణ : రాహుల్
సాక్షి, న్యూఢిల్లీ : 2019 సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే రఫేల్ ఒప్పందంపై విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షిస్తుందని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. రఫేల్‌పై చర్చకు ప్రభుత్వం బదులిచ్చే క్రమంలో శుక్రవారం పార్లమెంట్ వెలుపల రాహుల్ మీడియాతో మాట్లాడుతూ రఫేల్‌పై చర్చ అంటే ప్రధాని నరేంద్ర మోదీ పారిపోతున్నారని దుయ్యబట్టారు. ఈ ఒప్పందంపై రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆయన పలు ప్రశ్నలు సంధించారు. రఫేల్‌పై విచారణ అవసరం లేదని సుప్రీం కోర్టు ఎక్కడా చెప్పలేదని, దీనిపై విచారణకు ఆదేశించే పరిధి న్యాయస్ధానానికి లేదని మాత్రమే సర్వోన్నత న్యాయస్ధానం పేర్కొందని రాహుల్ అన్నారు. రఫేల్‌పై తాము లేవనెత్తిన అంశాలన్నింటికీ రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ బదులివ్వాలని రాహుల్ డిమాండ్ చేశారు. మరోవైపు రఫేల్ ఒప్పందంపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సభను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఆరోపించారు. అంబానీకి ఆ కాంట్రాక్టు ఎవరిచ్చారు.. అనిల్ అంబానీ సంస్థకు రఫేల్ ఒప్పందంలో భాగస్వామ్యం కల్పించింది ఎవరని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. లోక్‌సభలో నిర్మలా సీతారామన్ ప్రసంగానికి అడ్డుతగిలిన రాహుల్ ఒప్పందానికి సంబంధించి పలు అంశాలను లేవనెత్తారు. రఫేల్ డీల్ అంతా ప్రధాని నరేంద్ర మోదీ కనుసన్నల్లో జరిగిందని అన్నారు. అనిల్ అంబానీ కంపెనీకి రఫేల్ ఒప్పందంలో భాగస్వామిగా చేర్చాలని ప్రధాని మోదీ సూచించారని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలాండ్ వెల్లడించారన్నారు. -
రిలయన్స్ పవర్ చేతికి జేపీ గ్రూప్ జల విద్యుత్ ప్లాంట్లు
న్యూఢిల్లీ: జైప్రకాష్ అసోసియేట్స్‌కు చెందిన మూడు జల విద్యుత్ ప్రాజెక్ట్‌లను అనిల్ అంబానీ గ్రూప్ సంస్థ రిలయన్స్ పవర్ సొంతం చేసుకోనుంది. ఈమేరకు జేపీ గ్రూప్‌తో ప్రాథమిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు రిలయన్స్ పవర్ తెలిపింది. దీనిలో భాగంగా అనుబంధ సంస్థ రిలయన్స్ క్లీన్జెన్(ఆర్సీఎల్) ద్వారా జేపీ గ్రూప్ అనుబంధ కంపెనీ జైప్రకాష్ పవర్ వెంచర్స్(జేపీవీఎల్)తో ప్రత్యేక అవగాహన ఒప్పం దంపై సంతకాలు చేసినట్లు పేర్కొంది. తద్వారా జేపీవీఎల్‌కు చెందిన జలవిద్యుత్ పోర్ట్‌ఫోలియోలో 100% వాటాను కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. సుమారు 1,800 మెగావాట్ల నిర్వహణ సామర్థ్యం (ప్రైవేటు రంగంలో దేశంలోనే అత్యధికం) కలిగిన 3 జల విద్యుత్ ప్లాంట్లను జేపీవీఎల్ కలిగి ఉంది. వీటి ఆస్తుల విలువ రూ.10,000 కోట్లుగా అంచనా.