'యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు'
న్యూఢిల్లీ : విజయనగరం జిల్లా రైలు ప్రమాదఘటనలో సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన చేపడుతున్నట్లు రైల్వే పీఆర్ఓ అనిల్ సక్సేనా తెలిపారు. ఆదివారం ఉదయం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపడుతున్నామన్నారు.
రైల్వే మంత్రి సురేష్ ప్రభు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారన్నారు. రైలులోని మిగతా బోగీలను మరో ఇంజన్‌తో నడిపించేందుకు చర్యలు చేపట్టమన్నారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రధాన కేంద్రం భువనేశ్వర్‌తో పాటు విశాఖపట్నం నుంచి సహాయక సిబ్బంది ఘటనా స్థలంలో సేవలందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
రైల్వే ప్రమాద ఘటనపై హెల్ప్ లైన్ నంబర్ల వివరాలు
విశాఖపట్నం కంట్రోల్ రూమ్ : 1072, 0891-2748641
విశాఖపట్నం రైల్వే స్టేషన్ : 83003,83005,83006, 0891-2746344, 0891-2746330
విజయనగరం : 83331,83332,83333,83334, 08922-221202
రాయ్‌గఢ్ : 85744,85755,85777,85788, 06856-223400, 223500
సెల్ : 09439741181, 09439741071, 07681878777, 07326812986.