Animal Ambulance
-
వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవలు ప్రారంభించిన సీఎం జగన్ (ఫొటోలు)
-
ఏపీలో వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవలు ప్రారంభం
సాక్షి, అమరావతి: పశుపోషకుల ఇంటిముంగిటే మూగజీవాలకు మెరుగైన వైద్యసేవలందించే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైఎస్సార్ సంచార పశు ఆరోగ్యసేవలు నేటి (గురువారం) నుంచి అందుబాటులోకి వచ్చాయి. సుమారు రూ.278 కోట్ల వ్యయంతో మొత్తం 340 పశువుల అంబులెన్స్‌లు ఏర్పాటు చేస్తుండగా.. తొలిదశలో రూ.143 కోట్లతో సిద్ధం చేసిన 175 అంబులెన్స్‌లను తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు డాక్టర్ వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య వాహనాల్లో ఉన్న సదుపాయాలను సీఎం జగన్ అడిగి తెలుసుకున్నారు. మలిదశలో రూ.135 కోట్లతో 165 అంబులెన్స్‌లను ఏర్పాటు చేస్తారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు చొప్పున 108 అంబులెన్స్ సేవల తరహాలోనే అత్యాధునిక సౌకర్యాలతో ఈ అంబులెన్స్‌లను తీసుకొస్తున్నారు. వీటి నిర్వహణ ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుంది. అంబులెన్స్ సేవల కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబరు 1962 ఏర్పాటు చేశారు. ఫోన్ చేసి పశువు అనారోగ్య సమస్య వివరిస్తే చాలు.. అంబులెన్స్‌లో రైతు ముంగిటకు వెళ్లి వైద్యసేవలందిస్తారు. అవసరమైతే పశువును దగ్గరలోని ఏరియా పశువైద్యశాలకు లేదా వెటర్నరీ పాలీక్లినిక్‌కు తరలించి మెరుగైన వైద్యసేవలందించి తిరిగి ఆ పశువును సురక్షితంగా రైతు ఇంటికి ఉచితంగా చేరుస్తారు. ప్రస్తుతం ఈ అంబులెన్స్‌లు విజయవాడ నున్న సమీపంలోని ముస్తాబాద శివారు ప్రాంతంలో బారులు తీరి ఉన్నాయి. అంబులెన్స్‌లో సౌకర్యాలు.. ► ఒక పశువైద్యుడు, వెటర్నరీ డిప్లొమా చేసిన సహాయకుడు, డ్రైవర్ కమ్ అటెండర్ ఉంటారు. ► 20 రకాల పేడ సంబంధిత పరీక్షలు, 15 రకాల రక్తపరీక్షలు చేసేందుకు మైక్రోస్కోప్‌తో కూడిన చిన్న ప్రయోగశాల. ► అన్ని రకాల వ్యాక్సిన్లు, మందులతోపాటు పశువును వాహనంలోకి ఎక్కించేందుకు హైడ్రాలిక్ సౌకర్యం ► ప్రాథమిక వైద్యసేవలతో పాటు సన్నజీవాలు, పెంపుడు జంతువులు, పక్షులకు సర్జరీలు చేసేందుకు ఏర్పాట్లు ► అవసరమైతే హైడ్రాలిక్ లిఫ్ట్ సౌకర్యంతో పశువును వాహనంలోకి ఎక్కించి శస్త్రచికిత్స చేసే సౌలభ్యం. -
‘అంబా’లెన్స్..!
♦ పశు అంబులెన్స్‌ల కేటాయింపు ఇలా.. ♦ ఖమ్మం జిల్లా ,ఖమ్మం, సత్తుపల్లి, మధిర, వైరా, పాలేరు ♦ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ♦ కొత్తగూడెం, ఇల్లెందు, భద్రాచలం, పినపాక, అశ్వారావుపేట పాల్వంచరూరల్ : మనుషులకు అత్యవసర సేవలు అందాలంటే..108కు ఫోన్ చేస్తే ప్రభుత్వ అంబులెన్స్ కుయ్..కుయ్‌మంటూ వస్తుంది. అదే తరహాలో పశువులకు సత్వర వైద్యసేవలు అందించాలనే ఉద్దేశంతో 1962నంబర్‌కు ఫోన్ చేస్తే సంచార వైద్యశాల గ్రామాలకు రానుంది. అందులోని పశువైద్యసిబ్బంది పశువులు, గొర్రెలు, మేకలకు చికిత్స చేసి, రైతులు, పెంపకందారులకు మందులు ఇచ్చి వెళతారు. ఈ సంచార వైద్యశాల(అంబులెన్స్) వాహనాలు త్వరలోనే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చేరనున్నాయి. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో పశువులకు మైరుగైన వైద్యం అందించడమే వీటి లక్ష్యం. నియోజకవర్గానికి ఒకటి చొప్పున రెండు జిల్లాల పరిధిలో 10 వాహనాలు రానున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ పశువుల అంబులెన్స్ వాహనాన్ని పరిశీలించి, 1962 నంబర్‌కు ఫోన్ చేసి..కాల్ సెంటర్ పనితీరును ప్రశంసించడంతో..సంచార వైద్యసేవలపై రైతుల్లో ఆసక్తి నెలకొంది. రెండు జిల్లాలో పశుసంపద ఇలా.. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో మొత్తం 80 పశువైద్యశాలలు, 44 గ్రామీణ వైద్యశాలలు, 30 ప్రాథమిక వైద్యశాలలు, 6 గ్రేడ్–1 స్ధాయి పశువైద్యశాలలు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 14,67,126 పశువులు ఉన్నాయి. గేదెలు 1,92,376, గొర్రెలు 1,04,288, మేకలు 2,25,171, కోళ్లు 7,12,546 ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో తెల్లపశువులు మొత్తం 1,44,710, గేదెలు 3,58,251, గొర్రెలు 3,12,607, మేకలు 1,60,276 ఉన్నా యి. వీటికి ఏదైనా జబ్బు సోకినా, అత్యవసర వైద్యం కావాల్సి వచ్చినా..1962కు ఫోన్ చేస్తే పశువైద్యసేవల అంబులెన్స్ ఆ ఊరికి రానుంది. రైతులకు ఎంతో మేలు.. పశు సంచార వైద్యానికి కొత్తగా వాహనాలను కేటాయించడం ఎంతో సంతోషం. పశువైద్యానికి అవసరమైన మందులు అందుబాటులో ఉంటాయి. రైతులు ఫోన్ చేయగానే వారి ఊరికి పోయి..పశువైద్య సిబ్బంది మూగ జీవాలకు చికిత్స అందిస్తారు. పశువుల ఆస్పత్రికి తీసుకొచ్చే స్థితిలో లేని వారికి ఇది ఆర్థిక వెసులుబాటు కల్పిస్తుంది. మారుమూల ప్రాంతాల్లో కూడా పశువైద్యసేవలు అందనున్నాయి. పశువుల వద్దకే వైద్యం రావడం మంచి పరిణామం. –డాక్టర్ వేణుగోపాల్‌రావు, జిల్లా పశు సంవర్థకశాఖ అధికారి, భద్రాద్రి కొత్తగూడెం