Anirban Lahiri
-
భారత క్రీడల చరిత్రలోనే అత్యధిక ప్రైజ్‌మనీ కొట్టేశాడు..
పాంచె వెడ్రా బీచ్ (అమెరికా): భారత గోల్ఫర్ అనిర్బన్ లాహిరి ప్రైజ్‌మనీ విషయంలో అరుదైన ఘనత సాధించాడు. ప్రతిష్టాత్మక గోల్ఫ్ టోర్నీ ‘ప్లేయర్స్ చాంపియన్‌షిప్’లో అతను రన్నరప్‌గా నిలిచాడు. ఒక్క షాట్ తేడాతో అతను విజేతగా నిలిచే అవకాశాన్ని కోల్పోగా... ఆస్ట్రేలియాకు చెందిన కామెరాన్ స్మిత్ టైటిల్ సాధించాడు. రన్నరప్‌గా నిలవడం ద్వారా లాహిరికి 2.18 మిలియన్ డాలర్లు (సుమారు రూ.16.66 కోట్లు) బహుమతిగా లభించాయి. భారత క్రీడల చరిత్రలో ఏ క్రీడాంశంలోనైనా వ్యక్తిగత విభాగంలో ఒక ఆటగాడు సాధించిన అత్యధిక బహుమతి మొత్తం ఇదే కావడం విశేషం. గతంలో విశ్వనాథన్ ఆనంద్ ప్రపంచ విజేతగా నిలిచిన రెండు సందర్భాల్లో 1.68 మిలియన్ డాలర్లు, 1.53 మిలియన్ డాలర్లు చొప్పున అందుకున్నాడు. చదవండి: (India vs England: ప్రతీకారానికి సమయం!) -
'భారత గోల్ఫ్‌పై ప్రభావం చూపే అవకాశం'
ట్రూన్: దాదాపు శతాబ్దం తరువాత ఒలింపిక్స్‌లో గోల్ఫ్ ను ప్రవేశపెట్టడంతో పలువురు దిగ్గజ ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు. భారత్ నుంచి పురుషుల విభాగంలో ఇద్దరు గోల్ఫ్ కు ప్రాతినిథ్యం వహిస్తుండగా, మహిళల ఈవెంట్ నుంచి ఒక అథ్లెట్ మాత్రమే బరిలోకి దిగుతుంది. అయితే దీనిపై భారత ప్రధాన గోల్ఫర్ అనిర్బాన్ లహిరి హర్షం వ్యక్తం చేశాడు. రియో ఒలింపిక్స్ లో భారత తరపున పతకం సాధిస్తే అది కచ్చితంగా దేశంలో ఉన్న గోల్ఫ్ క్రీడపై ప్రభావం చూపుతుందన్నాడు. 'నేను పతకంతో తిరిగి భారత్ కు రావాలనుకుంటున్నా. పతకం కోసం తీవ్రంగా పోరాడతాం. పురుషుల విభాగంలో నాతో పాటు చవ్రారాసియా కూడా బాగానే రాణిస్తున్నాడు. ఒకవేళ మేము మెరుగ్గా రాణించి ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తే మాత్రం అది భారత్‌లోని గోల్ఫ్‌పై ప్రభావం చూపుతుంది 'అని అనిర్బానీ అభిప్రాయపడ్డాడు. 1904లో ఒలింపిక్స్‌లో గోల్ఫ్‌ను చివరిసారి ప్రవేపెట్టారు. ఆ తరువాత ఒలింపిక్స్‌లో గోల్ఫ్ క్రీడ అనేది లేకుండా పోయింది. అయితే 112 సంవత్సరాల తరువాత గోల్ఫ్‌ను ఒలింపిక్స్‌లో పెట్టారు. ఆసియా నుంచి 16 మంది గోల్ఫర్లు ఒలింపిక్స్ కు సిద్ధమవుతుండగా, భారత్ నుంచి ముగ్గురికి అవకాశం దక్కడం విశేషం. భారత నుంచి మహిళల విభాగంలో అదితి అశోక్ పాల్గొంటుంది. అయితే జికా వైరస్ కారణంగా వరల్డ్ నంబర్ వన్ గోల్ఫర్ జాసన్ డే, వరల్డ్ నంబర్ టూ గోల్ఫర్ జోర్డాన్ స్పెత్లు రియో ఒలింపిక్స్ నుంచి వైదొలిగారు. -
వరల్డ్ క్లాస్ గోల్ఫర్గా అనిర్బాన్ లాహిరి
-
అనిర్బన్ లాహిరి కొత్త చరిత్ర
కోహ్లర్ (విస్కాన్సిన్): భారత గోల్ఫ్ చరిత్రలో అనిర్బన్ లాహిరి కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. ప్రతిష్టాత్మక పీజీఏ చాంపియన్‌షిప్‌లో సంయుక్తంగా ఐదో స్థానంలో నిలిచి సత్తా చాటుకున్నాడు. ఓ మేజర్ టోర్నీలో భారత గోల్ఫర్స్ నుంచి ఈస్థాయి ప్రదర్శన ఇప్పటిదాకా లేదు. ఈ రాణింపుతో అతను ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 15 స్థానాలు మెరుగుపరుచుకుని 38వ ర్యాంకుకు చేరాడు. గతంలో 2013 బ్రిటిష్ ఓపెన్‌లో శివ్ కపూర్ తొమ్మిదో స్థానంలో నిలవడమే అత్యుత్తమం. ఇంతకుముందు మూడు వారాల వ్యవధిలోనే మలేసియా ఓపెన్, హీరో ఇండియన్ ఓపెన్‌ను గెలిచిన 28 ఏళ్ల లాహిరి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుత ప్రదర్శనతో ఆత్మవిశ్వాసం పెరిగిందని, ఎలాంటి ప్రత్యర్థికైనా గట్టి పోటీనివ్వగల ధీమా కలిగిందని లాహిరి తెలిపాడు.