
పాంచె వెడ్రా బీచ్ (అమెరికా): భారత గోల్ఫర్ అనిర్బన్ లాహిరి ప్రైజ్‌మనీ విషయంలో అరుదైన ఘనత సాధించాడు. ప్రతిష్టాత్మక గోల్ఫ్ టోర్నీ ‘ప్లేయర్స్ చాంపియన్‌షిప్’లో అతను రన్నరప్‌గా నిలిచాడు. ఒక్క షాట్ తేడాతో అతను విజేతగా నిలిచే అవకాశాన్ని కోల్పోగా... ఆస్ట్రేలియాకు చెందిన కామెరాన్ స్మిత్ టైటిల్ సాధించాడు.
రన్నరప్‌గా నిలవడం ద్వారా లాహిరికి 2.18 మిలియన్ డాలర్లు (సుమారు రూ.16.66 కోట్లు) బహుమతిగా లభించాయి. భారత క్రీడల చరిత్రలో ఏ క్రీడాంశంలోనైనా వ్యక్తిగత విభాగంలో ఒక ఆటగాడు సాధించిన అత్యధిక బహుమతి మొత్తం ఇదే కావడం విశేషం. గతంలో విశ్వనాథన్ ఆనంద్ ప్రపంచ విజేతగా నిలిచిన రెండు సందర్భాల్లో 1.68 మిలియన్ డాలర్లు, 1.53 మిలియన్ డాలర్లు చొప్పున అందుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment