ప్రపంచ గోల్ఫ్ క్రీడలో ప్రతిష్టాత్మక టోర్నీగా పేరున్న ‘మాస్టర్స్’ ఈవెంట్‌లో తొలిసారి ఆసియా ప్లేయర్ చాంపియన్‌గా నిలిచాడు. అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో జరిగిన ఈ టోర్నీలో జపాన్ గోల్ఫర్, 29 ఏళ్ల హిడెకి మత్సుయామ టైటిల్ సాధించాడు. నిర్ణీత నాలుగు రౌండ్‌ల తర్వాత మత్సుయామ 278 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. విజేతగా నిలిచిన మత్సుయామకి 20,70,000 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ.15 కోట్ల 54 లక్షలు)తోపాటు గ్రీన్ జాకెట్‌ను అందజేశారు.
భారత్ అజేయంగా...
బ్యూనస్ ఎయిర్స్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) ప్రొ లీగ్‌లో భాగంగా అర్జెంటీనాతో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ భారత్ గెలిచింది. రియో ఒలింపిక్స్ చాంపియన్ అర్జెంటీనాతో జరిగిన తొలి పోరులో ‘షూటౌట్’లో నెగ్గిన భారత్... రెండో మ్యాచ్‌లో 3–0తో ఘన విజయం సాధించింది. భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్ (11వ నిమిషంలో), లలిత్ ఉపాధ్యాయ్ (25వ నిమిషంలో), మన్‌దీప్ సింగ్ (58వ నిమిషంలో) చెరో గోల్ సాధించి జట్టుకు విజయాన్ని ఖాయం చేశారు. తొమ్మిది జట్ల మధ్య జరుగుతున్న ప్రొ లీగ్‌లో తాజా విజయంతో భారత్ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియాను దాటేసి 15 పాయింట్లతో నాలుగో స్థానానికి ఎగబాకింది.
Comments
Please login to add a commentAdd a comment