aniversery
-
‘మంత్రి వ్యాఖ్యలపై నేను మాట్లాడను’
సాక్షి, విజయవాడ : డబ్బులు తీసుకోవడం మాత్రమే అవినీతి కాదని, ఇవ్వడం కూడా అవినీతేనని ఏసీబీ డీజీ విశ్వజిత్ కుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక కానూరు సిద్దార్ధ కాలేజీలో నిర్వహించిన విజిలెన్స్ వారోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వజిత్ మాట్లాడుతూ.. ‘మానసిక ఆలోచనలు, చేసే పనిలో నిబద్ధత, నీతి లేకపోవడం కూడా అవినీతే. ఈ రోజుల్లో చాలా మంది తమ పనులు తొందరగా పూర్తవ్వాలని లంచాలు ఇస్తున్నారు. మరోవైపు సమాజంలో స్వప్రయోజనాలు పెరిగిపోయాయి. దీని వల్ల వ్యవస్థలో అవినీతి పెరిగిపోయింది. క్యాన్సర్ లాంటి అవినీతిని ప్రోత్సహించడం మంచి పద్ధతి కాదు. దీనిపై విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించాలి. ప్రజలు లంచాలు ఇవ్వడం ఎప్పడైతే మానుకుంటారో అప్పుడు అవినీతి అంతమవుతుంది. రాష్ట్రంలో అవినీతి రహిత పాలన ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పం. అవినీతికి పాల్పడే అధికారులను ఉపేక్షించే ప్రసక్తే లేద’ని పేర్కొన్నారు. విశాఖ ఘటనపై మాట్లాడుతూ.. మధురవాడలో ఏసీబీ అధికారులపై వచ్చిన ఆరోపణలపై ఏసీబీ జాయింట్ డైరెక్టర్ మోహన్‌రావు విచారణ చేస్తున్నారు. ఆయన ఇచ్చే నివేదిక ఆధారంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై చర్య తీసుకుంటాం. మంత్రి చేసిన వ్యాఖ్యలపై నేను మాట్లాడనంటూ ముగించారు. -
శ్రీరామ సాగరానికి 56ఏళ్లు
బాల్కొండ: ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని, కల్పతరువు అయిన శ్రీరాంసాగర్ నేటితో 56ఏళ్లు పూర్తి చేసుకుంది. అభివృద్ధిలో, ఆయకట్టుకు సాగు నీరు అందించడంలో కొచెం మోదం.. కొంచెం ఖేదం మిగిలిందని చెప్పవచ్చు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కొంత మేరా కృషి చేస్తుంది. కాని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేయడం లేదు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి పునాది రాయి పడి 56 వసంతాలు పూర్తవుతున్న, తెలంగాణ రాష్ట్రానికి గుండె కాయాల ఉన్నప్పటికి పూర్తి స్థాయిలో అభివృద్ధి నోచు కోవడం లేదు. ప్రాజెక్ట్‌లో నీటి కొరత ఉండకుండా పూర్వవైభవం తీసుకురావడానికి ప్రభుత్వం పునరుజ్జీవన పథకం ప్రవేశపెట్టింది. నిర్మాణం జరిగిందిలా.. ఎస్సారెస్పీని మూడు ప్రయోజనాలు ఆశించి నిర్మించారు. 18 లక్షల ఎకరాలకు సాగునీరు. 36 మెగావాట్ల విద్యుతుత్పత్తి, చేపల పెంపకం అనే ఆశయాలతో 112 టీఎంసీల నీటి సామర్థ్యంతో 1091 అడుగుల నీటిమట్టంతో 175చదరపు మైళ్ల విస్తీర్ణంతో గోదావరి జన్మస్థానానికి 326 మైళ్ల దూరంలో సముద్ర మట్టానికి ప్లస్ 980 అడుగుల ఎత్తులో, జాతీయ రహదారి 44పై ఉన్న సోన్ వంతెన ఎగువ భాగం మూడు మైళ్ల దూరంలో ఆదిలాబాద్, నిజామాబాద్ సరిహద్దు ప్రాంతంలో నిర్మించారు. వరద నీరు తాకిడిని తట్టుకునే సువిశాలమైన బండ రాయిని ఎంచుకుని 140 అడుగుల ఎత్తుతో 3,143 అడుగుల పొడువుతో రాతి కట్టడం, 125 అడుగుల ఎత్తుతో 44,750 అడుగుల మట్టి కట్టడంతో మొత్తం 47,893 అడుగుల డ్యాం నిర్మాణం చేపట్టారు. అలాగే 2,510 అడుగుల పొడువు జలదారితో 35,425 చదరపు మైళ్ల క్యాచ్మెంట్ ఏరియాతో 16లక్షల క్యూసెక్కుల వరద నీటిని తట్టుకునేలా ప్రాజెక్ట్ డ్యాం డిజైన్ చేసి 50 అడుగుల వెడల్పు, 33 అడుగుల ఎత్తుతో మొత్తం 42 వరద గేట్లను నిర్మించారు. ప్రాజెక్ట్ నుంచి పూడిక పోయోందుకు ఆరు రివర్స్ స్లూయిస్ గేట్లు నిర్మించారు. ఇలా ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ప్రాజెక్ట్‌కు ప్రధాన సమస్యలు ఇప్పటికి పరిష్కరానికి నోచుకోవడం లేదు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ భద్రత గాలిలో దీపంలా ఉంది. భద్రత కోసం ఏళ్ల తరబడి ప్రతిపాదనలు పెట్టినప్పటికీ ఇప్పటికీ మోక్షం కలగడం లేదు. అంతే కాకుండా ఎస్సారెస్పీలో పదవి విరమణలే తప్ప నూతనంగా అధికారుల నియామకం లేదు. దీంతో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. కాలువల మరమ్మత్తులకు నిధులు మంజూరు అవుతున్న పనుల్లో మాత్రం నాణ్యత తూచ్ ఉండటంతో కాలువల మరమ్మతు ఎప్పటికి సమస్యగానే మిగిలిపోతుంది. అశలన్నీ కాళేశ్వరంపైనే.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి వరద కాలువ ద్వార రివర్స్ పంపంగ్ చేసి 60 టీఎంసీల నీటిని నింపుటకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. దీంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటి పై ఆధార పడకుండా సంవత్సరం పొడువున నిండుకుండలా ఏర్పడే అవకాశం ఏర్పడింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు కాళేశ్వరం నుంచి రోజుకు ఒక టీఎంసీ చొప్పున 60 టీఎంసీల నీటిని వరద కాలువ ద్వారా రివర్స్ పంపింగ్ చేపట్టి ప్రాజెక్ట్‌కు తరలిస్తారు. పునరుజ్జీవన పథకం పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ నెలాఖరు వరకు కాళేశ్వరం నీళ్లు ఎస్సారెస్పీకి చేరుతాయని పాలకులు ప్రకటిస్తున్నారు. -
ఏ కవి అయినా సత్యాన్ని చెప్పాలి
తెలుగు సాహిత్యపీఠం డీన్ ఎండ్లూరి ‘ప్రజా పత్రిక’ 90వ వార్షికోత్సవం రాజమహేంద్రవరం కల్చరల్ : మను ధర్మం ఒకటి, మానవ ధర్మం మరొకటి, ఆర్షధర్మం ఒకటి, జనధర్మం మరొకటి, ప్రతిభాపాటవాలు, సాహితీప్రాభవాలు ఏ ఒక్కరి సొత్తూ కాదని తెలుగు విశ్వ విద్యాలయం బొమ్మూరు సాహిత్యపీఠం డీ¯ŒS ఆచార్య ఎండ్లూరి సుధాకర్ అన్నారు. శనివారం ప్రకాష్‌నగర్ ధర్మంచర కమ్యూనిటీ హాలులో జరిగిన ప్రజాపత్రిక 90వ వార్షికోత్సవ సభకు ఆయన అధ్యక్షత వహించారు. ప్రతి కవీ దేశకాల ధర్మాలను గుర్తించాలని, వాల్మీకి నుంచి నానీలు రా సే కవుల వరకు తమ కాలధర్మానికి కట్టుబడి ఉన్నారని అన్నారు. కవి ఏ సామాజిక వర్గానికి చెందిన వాడయినా నిజం చెప్పగలిగి ఉండాలన్నారు. ఆధునిక కాలంలో జీవిస్తున్న వారందరూ ఆధునికులు కారని, మూడు వందల సంవత్సరాలకు మునుపు జీవించిన వేమన ఆధునిక కవి కాకపోడని విశ్లేషించారు. కాగా పలువురు మాట్లాడుతూ సుదీర్ఘ చరిత్ర కలిగిన ప్రజాపత్రికను నిర్విఘ్నంగా నిర్వహిస్తున్న దేవీ సుదర్శ¯ŒS దంపతుల్ని అభినందించారు. అలరించిన కవి సమ్మేళనం ఈ సందర్భంగా జరిగిన కవి సమ్మేళనంలో విభిన్న అంశాలపై పలువురు కవులు వినిపించిన స్వీయ కవితలు అలరించాయి. ‘కాషాయం రంగు ఒకరిది, ఆకుపచ్చది మరొకరిది అయితే..మరి మువ్వన్నెల జండా ఎవరిది?’ (మహమ్మద్ ఖాదర్‌ఖా¯ŒS), ‘ర్యాగింగు, యాసిడ్ రాక్షస దాడులు, వరకట్న దహనాల వధలు మెండు’(బి.వి.రమాదేవి), ‘అమ్మవారిగ ప్రణతులందుకుంటున్న అతివ– గడప దాటాలంటే భయపడుతోంది’ (మల్లెమొగ్గల గోపాలరావు), ‘అక్షరమ్ము జ్ఞానభిక్షిడు జగతిని– అక్షరమ్మె వెలుగిడు అవనినెల్ల’(డాక్టర్ బి.వి.ఎస్.మూర్తి) అంటూ స్వీయకవితలను వినిపించారు. డాక్టర్ డి.నీలకంఠరావు, డాక్టర్ ఎస్.వి.రాఘవేంద్రరావు,యార్లగడ్డ మోహనరావు, అయ్యగారి వెంకటరామయ్య, జోస్యుల రామచంద్రశర్మ, మహీధర రామశాస్త్రి తదితరులు స్వీయకవితలు, పద్యాలు వినిపించారు. పద్మశ్రీ హల్దర్ నాగ్, రాయగడ రచయితల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఆనందరావు పట్నాయక్ , రావణ శర్మ, సత్తి భాస్కరరెడ్డి, డోలేంద్రప్రసాద్, డాక్టర్ పి.జె.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. పత్రిక గౌరవ సంపాదకుడు సుదర్శ¯ŒS దంపతులు అతిథులను సాదరంగా ఆహ్వానించారు. -
రేపు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం
గుంటూరు వెస్ట్ : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 9వ తేదీన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి నారాయణుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని రెవెన్యూ కల్యాణ మండపంలో నిర్వహించే వేడుకలకు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి హాజరవుతున్నారని పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ గిరిజన సంఘాల నాయకులు, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు పాల్గొని వేడుకలను జయప్రదం చేయాలని కోరారు. -
విద్య కాషాయీకరణ
ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు వలి ఉల్లాఖాద్రి గుంటూరు వెస్ట్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి విద్య కాషాయీకరణ వేగవంతమైందని ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు వలి ఉల్లాఖాద్రి తెలిపారు. ఏఐఎస్ఎఫ్ 80వ వార్షికోత్సవం శనివారం గుంటూరులో జరిగింది. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి లాడ్జిసెంటర్‌లోని మహిమా గార్డెన్స్ వరకు ఏఐఎస్ఎఫ్ నాయకులు, కార్యకర్తలు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం నిర్వహించిన బహిరంగసభలో వలి ఉల్లాఖాద్రి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన నాటి నుంచి విద్యారంగంలో తీసుకువస్తున్న మార్పులతో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. హర్యానా రాష్ట్రంలో దొంగబాబా చర్రితను పాఠ్యాంశాల్లో చేర్చడాన్ని ఖండించారు. విశ్వవిద్యాలయాలకు ఆర్ఎస్ఎస్ వ్యక్తులను వీసీలుగా నియమిస్తూ విద్యావ్యవస్థను మత పరం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. విద్యార్థి సంఘ నాయకులను దేశద్రోహులుగా చిత్రీకరిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. దేశంలో సుమారు లక్ష పాఠశాలలను మూసివేయించిన ఘనత మోడీ ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన విమర్శించారు. విద్యా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి.. పద్మశ్రీ అవార్డు గ్రహీత కొలకలూరి ఇనాక్ మాట్లాడుతూ దేశంలో కలుషితమైన రాజకీయాల నుంచి ప్రజలను విముక్తి చేసే సత్తా విద్యార్థులకే ఉందన్నారు. పాలకులు అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను విద్యార్థులు ఐక్యంగా తిప్పికొట్టాలని కోరారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను పాలకులు విస్మరించి, యువతకు అన్యాయం చేశారని విమర్శించారు. కార్యక్రమంలో ఏఎన్‌యూ మాజీ వైస్ చాన్సలర్ వియన్నారావు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విశ్వనాథ్, రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సుబ్బారావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు బయ్యన్న, ప్రజానాట్య మండలి జాతీయ కార్యదర్శి పులి సాంబశివరావు, రాష్ట్ర అధ్యక్షుడు గని, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కె.రామయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. తీర్మానాలు.. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ల మూసివేతను ఉపసంహరించుకోవాలని, విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని, ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, తక్షణమే ఏపీకి హోదా ప్రకటించాలని తదితర తీర్మానాలను సభలో ఆమోదించారు.