నగరంలో కార్డన్ సెర్చ్
హైదరాబాద్ : డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు సౌత్ జోన్ పరిధిలో ఆదివారం ఉదయం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని హుక్కా సెంటర్లు, హార్స్ రైడింగ్ సెంటర్లు, రిసార్ట్స్పై దాడులు చేశారు. ఈ దాడుల్లో 250మంది యువకులను అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. 11 గుర్రాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడినవారిలో చాలామంది ఇంజనీరింగ్ విద్యార్థులున్నారు. హుక్కా సెంటర్లలో పట్టుబడిన యువకులకు ఆదివారం కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు.
అలాగే సైబరాబాద్ అదనపు డీజీపీ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు రాయదుర్గం అంజయ్య నగర్లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో 20మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు చూపించని 40 బైక్లు, 7 ఆటోలు, 5 పెద్ద సిలిండర్లు, 9 చిన్న సిలిండర్లు, విద్యుత్ వైర్లు, టపాసులు స్వాధీనం చేసుకున్నారు.