anjaneyulu died
-
బావను హత్య చేసిన బావమరిది
నల్గొండ : బావమరిది చేతిలో బావ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన పెద్దఅడిశర్లపల్లి మండలంలో శనివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుర్రంపోడు మండలం మొసంగి గ్రామానికి చెందిన మిడసనమెట్ల సాయన్న తన కూతురు పారిజాతను నాగర్‌కర్నూల్ జిల్లా పదర మండలం మారడుగుల గ్రామానికి చెందిన అంజనేయులుకి (35)ఇచ్చి వివాహం చేశాడు. వివాహ సమయంలో తనకున్న రెండు ఎకరాల్లో కూతురికి ఎకరం భూమి ఇచ్చాడు. అంజనేయులు తన భార్య పారిజాతతో కలిసి హైదరాబాద్‌లో పేయింటింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా, కొడుకు వెంకటయ్య మద్యం తాగి వ్యసనాలకు అలవాటు పడుతున్నాడని ఉన్న ఇంకో ఎకరం భూమి సాయన్న తన పేరిటే ఉంచుకున్నా డు. ట్రాక్టర్ నడుపుకుంటూ పెద్దఅడిశర్లపల్లి మండలం అంగడిపేట ఎక్స్ రోడ్డు వద్ద ఉంటున్న సాయ న్న కుమారుడు వెంకటయ్య తన చెల్లెలికి భూమి ఇవ్వడం ఇష్టంలేక బావపై కక్ష పెంచుకున్నాడు. నాలుగు రోజుల క్రితం పిలిపించుకుని.. వెంకటయ్య నాలుగు రోజుల క్రితం అంజనేయులును అంగడిపేటకు రప్పించుకున్నాడు. పూటుగా మద్యం తాపించి శుక్రవారం సుత్తెతో మోది అంజనేయులును హత్య చేశాడు. అనంతరం అంజనేయుల మృతదేహాన్ని బస్తాలో కట్టి శుక్రవారం రాత్రి అంగడిపేట సమీపంలోని ఏఎమ్మార్పీ కాలువ పక్కన వేశాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. దేవరకొండ డీఎస్పీ నాగేశ్వర్రావు, కొండమల్లేపల్లి సీఐ శ్రీనివాస్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని దేవరకొండ ఆస్పత్రికి తరలించారు. అంజనేయులు భార్య పారిజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రంజిత్‌రెడ్డి తెలిపారు. సుత్తెతో తలపై మోది ఘాతుకం భూమి ఇవ్వడం ఇష్టం లేకనే దారుణం పెద్దఅడిశర్లపల్లి మండలం అంగడిపేట ఎక్స్ రోడ్డు వద్ద ఘటన -
రోడ్డు ప్రమాదంలో ‘సాక్షి’ సబ్ఎడిటర్ మృతి
అల్గునూర్ (కరీంనగర్): కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సాక్షి సబ్ ఎడిటర్ శ్రీమూర్తి ఆంజనేయులు (38) మృతిచెందారు. తిమ్మాపూర్ మండల కేంద్రంలోని సాక్షి యూనిట్ కార్యాలయంలో విధులు ముగించుకొని శుక్రవారం అర్ధరాత్రి స్వగ్రామం చిగురుమామిడి మండలం సుందరగిరి వెళ్తున్నారు. అదే మండలం కొత్తపల్లి శివారులోని పెట్రోలు బంక్ వద్ద ఒక వ్యక్తిని తప్పించబోయి అదుపు తప్పి కింద పడటంతో ఆంజనేయులు తీవ్రగాయాల పాలయ్యారు. 108 వాహనంలో కరీంనగర్ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందారు. ఆంజనేయులుకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. స్వగ్రామం సుందరగిరిలో అంత్యక్రియలు ఆంజనేయులు స్వగ్రామం చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, జర్నలిస్టులు, వివిధ పార్టీల నేతలు, ప్రజాప్రతినిధుల అశ్రునయనాల మధ్య ఆంజనేయులు అం త్యక్రియలు శనివారం సాయంత్రం ముగిశాయి. ఉదయం నుంచి ఆంజనేయులు మరణవార్త విన్న స్నేహితులు, బంధువులు, ఆయా పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు , అధికారులు గ్రామానికి చేరుకున్నారు. ఆయన పార్థివ దేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కాగా, ఆంజనేయులు ప్రజాశక్తి దినపత్రికలో 2003 నుంచి 2008 సబ్ఎడిటర్గా పనిచేశారు. 2008 నుంచి ఇప్పటి వరకు సబ్ఎడిటర్ హోదాలో జగిత్యాలకు డెస్క్ ఇన్‌చార్జీగా పని చేస్తున్నారు. -
ఆర్టీసీ డ్రైవర్ మృతికి సిబ్బంది శ్రద్ధాంజలి
అనంతపురం(హిందూపురం): హిందూపూర్‌లో గురువారం చనిపోయిన ఆర్టీసీ డ్రైవర్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ హిందూపూర్ డిపో సిబ్బంది భావపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఓ ప్రయాణికుడికి, ఆర్టీసీ డ్రైవర్ ఆంజనేయులుకు మధ్య గొడవ చినికి చినికి పెద్దదై చంపుకొనే వరకు వెళ్లిన సంగతి తెల్సిందే. బస్సు డ్రైవర్‌కు ప్రయాణీకుడికి మధ్య ఘర్షణ చోటుచేసుకొని డ్రైవర్ మృతి చెందాడు. గురువారం ఉదయం మద్యం మత్తులో నారాయణప్ప అనే ప్రయాణీకుడు డ్రైవర్ ఆంజనేయులుతో గొడవపడ్డాడు. అనంతరం ఇరువరు ఘర్షణకు దిగగా నారాయణప్ప చేసిన దాడిలో డ్రైవర్ ఆంజనేయులు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో పోలీసులు నారాయణప్పను అదుపులోకి తీసుకున్న విషయం విదితమే.