Anjilamma
-
ఆటో బోల్తా.. 10 మందికి గాయాలు
మహబూబ్నగర్: సంతకు వెళ్లి వస్తున్న ఆటో బోల్తాపడి 10 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం జిల్లాలోని కొస్గి మండలంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. వివరాలు.. వివరాలు దౌల్తాబాద్ మండలం యాంకి, గోకఫసల్వాద్, దేశాయపల్లి, లక్ష్మీపల్లి గ్రామాలకు చెందిన 14 మంది కోస్గి వారంతపు సంతకు వచ్చి ఏపీ 22వై 2883 నెంబరు గల యాంకి గ్రామానికి చెందిన ఆటోలో వారి వారి స్వగ్రామాలకు బయలుదేరారు. ఈ క్రమంలో పట్టణ శివారులోని మైసమ్మ ఆలయం దగ్గర ఆటో ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా కొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న పకీరమ్మ, అంజిలమ్మ, నర్సమ్మ, అనసూజ, చెన్నమ్మ, భీమమ్మ, సుజాతతోపాటు ఆటో డ్రైవర్ మౌలానాకు గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉన్న భీమప్ప, కాశమ్మలను 108లో జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. -
తల్లికి ‘మహమ్మారి’ సోకిందని..
బాబును బావిలోపడేసిన అమ్మమ్మ, పెద్దమ్మ గండేడ్: తల్లికి ప్రాణాంతకమైన వ్యాధి సోకిందనే అనుమానంతో ఓ పసికందును అయినవారే చం పేందుకు యత్నించారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా గండేడ్ మండల పరిధిలోని రంగారెడ్డిపల్లి సమీపంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. దోమ మండలం దాదాపూర్ వాసి వడ్డె అంజిలమ్మకు సంతానం లేకపోవడం తో తన చెల్లెలి ఇద్దరు కూతుళ్లను పెంచుకుంది. వారిలో చిన్న కూతురుకు కుల్కచర్ల మండలం కల్మన్కల్వ గ్రామానికి చెందిన ఓ యువకుడితో పెళ్లి చేసి ఇల్లరికం తెచ్చుకుంది. వీరంతా నగరంలోని బోరబండకు వలస వెళ్లారు. ఇటీవల ఆ యువకుడు భార్య ను వదిలేసి స్వగ్రామానికి వెళ్లిపోయాడు. గర్భం తో ఉన్న ఆమె నాలుగు రోజుల క్రితం నగరంలోని ఓ ఆస్పత్రిలో బాబుకు జన్మనిచ్చింది. తల్లికి ప్రాణాంతకవ్యాధి ఉండడంతో బిడ్డకు పాలు ఇవ్వలేదు. దీంతో కుటుంబీకులంతా చర్చించుకొని పసికందును చంపేయాలని నిర్ణయించుకున్నారు. అమ్మమ్మ అంజిలమ్మ, పెద్దమ్మ రత్నమ్మలు బాబుని తీసుకొని మంగళవారం గండేడ్ మండలం రంగారెడ్డిపల్లి శివారులో ఓ నీళ్లులేని బావిలో పడేసి వెళ్తుండగా స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. శిశువును ఐసీడీఎస్ అధికారి దివ్య సహాయంతో 108 వాహనంలోఆసుపత్రికి తరలించారు.