ఆటో బోల్తా.. 10 మందికి గాయాలు | 10 people injured, Auto turns | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా.. 10 మందికి గాయాలు

Published Sun, Jun 14 2015 8:48 PM | Last Updated on Sat, Mar 9 2019 4:28 PM

10 people injured, Auto turns

మహబూబ్‌నగర్: సంతకు వెళ్లి వస్తున్న ఆటో బోల్తాపడి 10 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం జిల్లాలోని కొస్గి మండలంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. వివరాలు.. వివరాలు దౌల్తాబాద్ మండలం యాంకి, గోకఫసల్‌వాద్, దేశాయపల్లి, లక్ష్మీపల్లి గ్రామాలకు చెందిన 14 మంది కోస్గి వారంతపు సంతకు వచ్చి ఏపీ 22వై 2883 నెంబరు గల యాంకి గ్రామానికి చెందిన ఆటోలో వారి వారి స్వగ్రామాలకు బయలుదేరారు.

ఈ క్రమంలో పట్టణ శివారులోని మైసమ్మ ఆలయం దగ్గర ఆటో ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా కొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న పకీరమ్మ, అంజిలమ్మ, నర్సమ్మ, అనసూజ, చెన్నమ్మ, భీమమ్మ, సుజాతతోపాటు ఆటో డ్రైవర్ మౌలానాకు గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉన్న భీమప్ప, కాశమ్మలను 108లో జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement