Anjum Farvez
-
ప్రపంచకప్ షూటింగ్లో అంజుమ్‌కు రజతం
మెక్సికోలోని గ్వాడలహారాలో జరుగుతున్న ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత షూటర్ అంజుమ్ మౌడ్గిల్ రజత పతకం సొంతం చేసుకుంది. మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్లో అంజుమ్ 454.2 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఈ పోటీల్లో భారత్‌కు ఇదే తొలి రజత పతకం. రుజియో పెయ్ (చైనా, 455.4 పాయింట్లు), తింగ్సున్ (చైనా 442.2 పాయింట్లు) వరుసగా స్వర్ణం, కాంస్యం దక్కించుకున్నారు. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో పదిహేనేళ్ల అనీశ్ భన్వాలా ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. మరో భారత షూటర్ నీరజ్ కుమార్‌కు 13వ స్థానం దక్కింది. -
నారాయణపూర్ నీటిపై కర్ణాటకతో చర్చలు
సాక్షి, హైదరాబాద్: ఎగువ నారాయణపూర్ నుంచి దిగువ నాగార్జునసాగర్‌కు నీటి విడుదలపై కర్ణాటకతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు కొనసాగిస్తోంది. గురు వారం సైతం సాగర్ సీఈ సునీల్ బెంగళూరులో కృష్ణా భాగ్య జల నిగమ్ ఏండీ అంజూమ్ ఫర్వేజ్‌తో చర్చలు జరిపారు. హైదరాబాద్ ప్రజలకు, నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు తాగునీటి కోసం 15 టీఎంసీలు మేర నీటిని విడుదల చేయాలని కోరారు. అయితే శుక్రవారం కృష్ణా భాగ్య జల నిగమ్ బోర్డు సమావేశం జరుగనుండటంతో అక్కడే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని కర్ణాటక ప్రభుత్వ వర్గాలు చెప్పినట్లుగా సమాచారం.