
భారత షూటర్ అంజుమ్ మౌడ్గిల్
మెక్సికోలోని గ్వాడలహారాలో జరుగుతున్న ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్‌లో భారత షూటర్ అంజుమ్ మౌడ్గిల్ రజత పతకం సొంతం చేసుకుంది. మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్‌లో అంజుమ్ 454.2 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఈ పోటీల్లో భారత్‌కు ఇదే తొలి రజత పతకం.
రుజియో పెయ్ (చైనా, 455.4 పాయింట్లు), తింగ్‌సున్ (చైనా 442.2 పాయింట్లు) వరుసగా స్వర్ణం, కాంస్యం దక్కించుకున్నారు. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో పదిహేనేళ్ల అనీశ్ భన్వాలా ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. మరో భారత షూటర్ నీరజ్ కుమార్‌కు 13వ స్థానం దక్కింది.