ankurarpanam
-
మహాజాతరకు నేడు అంకురార్పణ
ములుగు: రెండేళ్లకోసారి ములుగు జిల్లా మేడారంలో జరిగే సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు బుధవారం అంకురార్పణ జరగనుంది. జాతరలో తొలి ఘట్టం(గుడిమెలిగె)తో మొదలు కానుంది. కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయం, మేడారంలోని సమ్మక్క ఆలయాల్లో పూజారులు గుడిమెలిగె పండుగ నిర్వహించనున్నారు. సమ్మక్క–సారలమ్మ ఆలయా ల్లో కాక వంశీయులు, సిద్దబో యిన వంశీయులు తెచ్చిన గడ్డి తో పైకప్పుగా అలంకరిస్తారు. ఆలయంలోని బూజు దులిపి అమ్మవార్లకు దీపం పెడతారు. ఈ దీపాలు రెండేళ్ల తర్వాత వచ్చే మహాజాతర వరకు వెలు గుతూనే ఉంటాయి. కాగా, మేడారం జాతరలో 4 బుధవారాలకు ప్రాముఖ్యత ఉంటుంది. తొలి బుధవారం (ఈ నెల 22) గుడిమెలిగె, రెండో బుధవారం (29న) మండమెలిగె పూజలు జరుగుతాయి. మూడో బుధవా రం (ఫిబ్రవరి 5) మహాజాతర ప్రారంభమవుతుంది. నాలుగో బుధవారం (12) తిరుగువారం జాతరతో మహాజాతర ఘట్టం ముగుస్తుంది. జాతర క్రమం ఇలా.. ఫిబ్రవరి 5న ఉదయం సమ్మక్క సారలమ్మ ఆలయాల్లో పూజారు లు ముగ్గులు వేసి అలంకరిస్తారు. అమ్మవార్లకు పసుపు, కుంకుమ, చీర, సారెలు సమర్పిస్తారు. మహబూబాబాద్ జిల్లా గంగా రం మండలం పూనుగొండ్ల నుం చి పెనక వంశీయులు పగిడిద్ద రాజును, ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి దబ్బగట్ల వంశీయుల ఆధ్వర్యంలో వడ్డె పోదెం బాబు గోవిందరాజులును తీసుకొచ్చి అమ్మవార్ల పక్కన ఉన్న గద్దెలపై ప్రతిష్టిస్తారు. సాయంత్రానికి ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని కన్నెపల్లి నుంచి కాక వంశీయులు భారీ భద్రత మధ్య సారలమ్మను జంపన్న వాగును దాటుకుంటూ తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్టించడంతో జాతర ప్రారంభమవుతుంది. ప్రధాన ఘట్టాలు ఫిబ్రవరి 6: చిలుకలగుట్ట నుంచి సాయంత్రం సమ్మక్క తల్లిని ప్రభుత్వ లాంఛనాల మధ్య తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్టిస్తారు. ఫిబ్రవరి 7: సమ్మక్క–సారలమ్మలతో పాటు పగిడిద్ద రాజులు, గోవిందరాజులు గద్దెలపై ఉంటారు. దీంతో కోటి మందికి పైగా భక్తులు తల్లులను దర్శించుకుని మొక్కులు చెల్లిస్తారు. ఫిబ్రవరి 8: అమ్మవార్లు తిరుగు ప్రయాణంగా వన ప్రవేశం చేయడంతో జాతర ముగిసినట్లవుతుంది. -
వైభవంగా నృసింహుని అంకురార్పణ
- భారీగా తరలివచ్చిన భక్తులు - నేడు కల్యాణోత్సవం - ముమ్మరంగా ఏర్పాట్లు కదిరి : ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు మంగళవారం రాత్రి ఆలయ ప్రాంగణంలో వైభవంగా అంకురార్పణ చేశారు. పక్షం రోజుల పాటు జరగనున్న బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు అష్టదిక్పాలకులను ఆహ్వానించేందుకు నిర్వహించినదే ఈ అంకురార్పణ ఘట్టమని ఆలయ ప్ర«ధాన అర్చకులు నరసింహాచార్యులు, పార్థసారథి ఆచార్యులు పేర్కొన్నారు. మంగళ వాయిద్యాల మధ్య రాత్రి 9 గంటల ప్రాంతంలో నరసింహుడు ఆలయానికి నైరుతి దిశలో ఉన్న మండపాన్ని చేరుకున్నారు. నిర్ణీత పునీత ప్రదేశంలో ‘భూమిపూజ’తో మట్టిని సేకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. యాగశాలలో ఆ మట్టితో నింపిన 9 పాలికల్లో నవధాన్యాలతో అంకురార్పణ గావించారు. ఈ నవధాన్యాలు దిన దినాభివృద్ధి చెందేలా అర్చకులు బ్రహ్మోత్సవాలు పూర్తయ్యే వరకూ ప్రతిరోజూ నీరు పోసి పచ్చగా మొలకెత్తేలా చూస్తారు. ఏ ధాన్యం బాగా మొలకెత్తుతుందో ఆ పంట ఈ యేడు బాగా పండుతుందనేది భక్తుల నమ్మకం. ఉత్సవాలను నలుదిక్కులా చాటడానికి బుధవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో ఉన్న ప్రధాన «ధ్వజ స్తంభానికి గరుడ దండాన్ని «ధ్వజారోహణం గావిస్తారు. దీన్ని బ్రహ్మోత్సవాలు పూర్తయ్యేరోజు అంటే తీర్థవాది రోజు శ్రీవారి చక్రస్నానం అనంతరం అవరోహణం గావించి ఉత్సవాలకు ముగింపు పలుకుతారు. నారసింహుడు సైతం ఈ పక్షం రోజుల పాటు యాగశాలలోనే గడిపి, ఇక్కడి నుండే తన భక్తులకు దర్శనభాగ్యం కల్గిస్తారు. బెంగళూరుకు చెందిన కేఎన్ నాగేశ్వర్రావు కుటుంబీకులు శ్రీవారి అంకురార్పణానికి ఉభయదారులుగా వ్యవహరించినట్లు ఆలయ కమిటీ చైర్మన్ పచ్చిపులుసు నరేంద్రబాబు, ఆలయ సహాయ కమిషనర్ దొడ్డా వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, మోటారు వాహనాల తనిఖీ అధికారి చిర్రారెడ్డి శేషాద్రిరెడ్డి, పాలక మండలి సభ్యులు ఇద్దే రఘునాథరెడ్డి, మోపూరిశెట్టి చంద్రశేఖర్, తేపల్లి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కాటమరాయుడి కల్యాణం చూతము రారండి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్న శ్రీవారి కల్యాణోత్సవం బుధవారం రాత్రి అత్యంత వైభవంగా జరుగనుంది. ఇందుకోసం పాలక మండలితో పాటు ఆలయ, పోలీసు అధికారులు భారీ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి కల్యాణవేదిక 6 అడుగుల ఎత్తులో వేదిక సిద్ధం చేస్తున్నారు. వేదికపై కేవలం అర్చకులు మాత్రమే కూర్చునే విధంగా నిర్ణయం తీసుకున్నారు. రాత్రి 8.30 గంటలకు వేదికౖపైకి.. యాగశాల నుంచి నవ వధువులుగా అలంకృతులై శ్రీదేవి, భూదేవిలతో పాటు వరుడు ఖాద్రీ లక్ష్మీ నరసింహుడు బుధవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో పల్లకీలో ఆలయ ప్రాంగణలో ఉన్న కల్యాణ మండపం చేరుకుంటారు. తూర్పు గోపురం గుండా.. ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. భక్తులు ఆలయంలోకి తూర్పు రాజగోపురం గుండా ప్రవేశించి, పశ్చిమ గోపురం గుండా వెలుపలకు వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు. -
వెంకన్న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నేడు
– రేపు సాయంత్రం ధ్వజారోహణం, రాత్రి పెద్ద శేషవాహనం, సీఎం పట్టువస్త్రాలు సమర్పణ – సర్వం సిద్ధం చేసిన టీటీడీ – ఉత్సవాల్లో 3500 వేల మంది సిబ్బందితో బందోబస్తు సాక్షి,తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆదివారం అంకురార్పణ జరగనుంది. శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనుడు. శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను విష్వక్సేనుడు పర్యవేక్షించే కార్యక్రమమే అంకురార్పణ. వైఖానస ఆగమమోక్తంగా ఈ వేడుక నిర్వహించి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టడం సంప్రదాయం. ఇందులో భాగంగా నేటి సాయంకాల వేళలో విష్వక్సేనుడు నిర్ణీత పునీత ప్రదేశంలో ‘భూమి పూజ’(మత్సంగ్రహణం)తో మట్టిని సేకరించి ఛత్రచామర మంగళవాద్యాలతో ఊరేగుతూ తిరిగి ఆలయంలోనికి చేరుకుంటారు. యాగశాలలో ఆ మట్టితో నింపిన తొమ్మిది పాళికలలో(కుండలు)– శాలి, వ్రహి,యవ, ముద్గ, మాష, ప్రియంగు మొదలగు నవ ధాన్యాలతో అంకురార్పణం (బీజావాపం) చేస్తారు. ఈ కార్యక్రమానికంతా సోముడు (చంద్రుడు) అధిపతి. శుక్లపక్ష చంద్రునిలా పాళికల్లోని నవ ధాన్యాలు దిన దినాభివృద్ధి చెందేలా అర్చకులు ప్రార్థిస్తారు. నిత్యం నీరుపోసి పచ్చగా మొలకెత్తేలా జాగ్రత్త పడతారు. రేపు ధ్వజారోహణం, పెద్ద శేషవాహన సేవ శ్రీవారి బ్రహ్మోత్సవాలకు బుధవారం ధ్వజారోహణం నిర్వహించనున్నారు. సాయంత్రం 6.15 నుండి 6.30 గంటల్లోపు మీన లగ్నంలో ఈ పవిత్ర కార్యక్రమాన్ని నిర్వహించి బ్రహ్మోత్సవాలను ఆరంభిస్తారు. అనంతరం రాత్రి 9 గంటలకు పెద్ద శేషవాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప దర్శనమివ్వనున్నారు. ఇందులో భాగంగా టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు, సీవీఎస్వో జి.శ్రీనివాస్ సర్వం సిద్దం సిద్దం చేశారు. బ్రహ్మోత్సవాల్లో మొత్తం 3500 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు సిద్దం చేశారు. అనంతపురం రేంజ్ డీఐజీ జె.ప్రభాకరరావు, తిరుపతి అర్బన్‌జిల్లా జయలక్ష్మి తిరుమలలోనే ఉంటూ ఉత్సవాల భద్రతను పర్యవేక్షిస్తున్నారు. రేపు శ్రీవారికి సీఎం చంద్రబాబు పట్టువస్త్రాల సమర్పణ బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబునాయుడు సోమవారం శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. రాత్రి 7.30 నుండి 8 గంటల మధ్య బేడి ఆంజనేయస్వామి ఆలయం నుంచి పట్టువస్త్రాలను శ్రీవారి ఆలయానికి తీసుకెళ్లి సమర్పించి స్వామిని దర్శించుకుంటారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు దంపతులు పెద్ద శేషవాహనసేవలో ఉత్సవమూర్తిని దర్శించుకోనున్నారు.