పెళ్లి సంబంధాలు కుదరడం లేదని..
- సాప్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్య
బంజారాహిల్స్: ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడం, తల్లిదండ్రులు వేరే సంబంధాలు చూస్తున్నా కుదరకపోవడం తో మనస్తాపం చెంది ఓ సాఫ్ట్వేర్ ఇంజి నీర్ ఆత్మహత్య చేసుకుంది. జూబ్లీహిల్స్ పోలీసు ల కథనం ప్రకారం... యూసుఫ్‌గూడ పోలీస్‌లైన్స్‌లో నివసించే ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ కూతురు అన్నపురెడ్డి శ్రీలక్ష్మి(23) బీటెక్ పూర్తి చేసి ఇటీవలే ఓ సాఫ్ట్వేర్ సంస్థలో చేరింది. ఈమె ఒక యువకుడిని ప్రేమించింది.
అతడు పెళ్లికి నిరాకరించడంతో కొంతకాలంగా మనోవేదనకు గురవుతోంది. అంతేకాకుండా తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నా కుదురడంలేదు. ఈ నేపథ్యంలోనే శ్రీలక్ష్మి బాత్రూమ్లో చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.