పెళ్లి సంబంధాలు కుదరడం లేదని.. | Software engineer commits suicide | Sakshi
Sakshi News home page

పెళ్లి సంబంధాలు కుదరడం లేదని..

Published Wed, Feb 24 2016 9:15 AM | Last Updated on Sun, Sep 3 2017 6:20 PM

శ్రీలక్ష్మి మృతదేహం

శ్రీలక్ష్మి మృతదేహం

- సాప్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్య

బంజారాహిల్స్: ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడం, తల్లిదండ్రులు వేరే సంబంధాలు చూస్తున్నా కుదరకపోవడం తో మనస్తాపం చెంది ఓ సాఫ్ట్‌వేర్ ఇంజి నీర్ ఆత్మహత్య చేసుకుంది.  జూబ్లీహిల్స్ పోలీసు ల కథనం ప్రకారం... యూసుఫ్‌గూడ పోలీస్‌లైన్స్‌లో నివసించే ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ కూతురు అన్నపురెడ్డి శ్రీలక్ష్మి(23) బీటెక్ పూర్తి చేసి ఇటీవలే ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో చేరింది. ఈమె ఒక యువకుడిని ప్రేమించింది. 

అతడు పెళ్లికి నిరాకరించడంతో కొంతకాలంగా మనోవేదనకు గురవుతోంది. అంతేకాకుండా తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నా కుదురడంలేదు. ఈ నేపథ్యంలోనే శ్రీలక్ష్మి బాత్‌రూమ్‌లో చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.  తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement