Marriage matches
-
అమెరికా సంబంధం అని పెళ్లిచేశారు..నెల తిరిగేసరికి విడాకుల నోటీస్
జానకి, రమేష్‌లకు సునీత ఒక్కగానొక్క కూతురు. ఆమె ఇంజినీరింగ్ పూర్తిచేసి ఉద్యోగంలో చేరగానే తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. తమ కూతురు ఇంజినీర్ కాబట్టి ఇంజినీర్ సంబంధాలకే ప్రాధాన్యం ఇచ్చారు. అందులోనూ విదేశీ సంబంధమైతే మంచిదనుకున్నారు. తనకు విదేశాలకు వెళ్లడం ఇష్టంలేదని, ఇక్కడే తల్లిదండ్రులకు దగ్గరగా ఉండటమే ఇష్టమని సునీత చెప్పినా పట్టించుకోలేదు. తమ కులం వాడు, శాకాహారి, సిగరెట్, మద్యం తాగనివాడు అయ్యుండాలని విపరీతంగా వెదికారు. చివరకు అన్నీ కుదిరిన అమెరికా సంబంధం దొరికింది. అక్కడున్న స్నేహితులతో అతని గురించి ఎంక్వయిరీ చేయించారు. అన్నీ బాగున్నాయని తెలుసుకున్నాక సంబంధం ఫిక్స్ చేశారు. వరుడి తల్లిదండ్రుల కోరిక మేరకు పెళ్లి ఆర్భాటంగా చేశారు. వాళ్లు కోరిన కట్నకానుకలన్నీ సమర్పించారు. పెళ్లయిన 15 రోజులకే కూతుర్ని ఆనందంగా అమెరికా పంపించారు. అమెరికా వెళ్లిన కొత్తల్లో సునీత కాపురం పిక్నిక్స్, పార్టీలు, సైట్ సీయింగ్లతో సంతోషంగా సాగింది. మూడునెలల తర్వాత ఫ్రెండ్స్‌తో పార్టీ అని వెళ్లిన సునీల్ తాగి వచ్చాడు. అదేమిటని అడిగితే ‘ఫ్రెండ్స్ బలవంతం చేశార’ని చెప్పాడు. ఆ తర్వాత వారం ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లినప్పుడు మళ్లీ తాగడంతో పాటు మాంసాహారం కూడా తిన్నాడు. అది చూసి సునీత షాకయ్యింది. అదేమిటని నిలదీస్తే ‘‘పెళ్లికి ముందు సవాలక్ష చెప్తాం, అలాగని అన్నిటికీ మడి కట్టుకుని కూర్చుంటామా? అమెరికాలో ఉన్నప్పుడు అమెరికన్లాగే ఉండాలి’’ అని దురుసుగా సమాధానం ఇచ్చాడు. వీటన్నింటికీ మించి మహిళలపట్ల ఏమాత్రం గౌరవం లేకుండా మాట్లాడటం, ఆర్థిక క్రమశిక్షణ లేకుండా అప్పులు చేయడం, ఎడాపెడా అబద్ధాలు చెప్పడం, అడిగితే చేయి చేసుకోవడం సునీతను కలచివేసింది. ‘‘నువ్వో పల్లెటూరి బైతువి, నిన్ను చేసుకోవడం నా ఖర్మ’’ అంటూ రోజూ తిట్టేవాడు. ఇవన్నీ భరించలేక సునీత డిప్రెషన్‌కి లోనయ్యింది. సునీల్ ఆమెను ఇండియాకు తీసుకొచ్చి వాళ్లమ్మ వాళ్లింట్లో దింపేసి అమెరికా వెళ్లిపోయాడు. అప్పుడుగాని జానకి, రమేష్‌లకు అసలు విషయం తెలియలేదు. వాళ్లు ఫోన్లో అడిగితే... ‘‘సైకలాజికల్ ప్రాబ్లమ్ ఉన్నదాన్ని నాకు కట్టబెట్టి అన్యాయం చేశారు. మీ అమ్మాయి నాకు అక్కర్లేదు. విడాకులు ఇచ్చేస్తున్నా’’ అని చెప్పి, నెల తిరిగేసరికి విడాకుల నోటీస్ కూడా పంపాడు. దాంతో సునీత మరింత డిప్రెషన్‌కి లోనయ్యింది. ఆ నేపథ్యంలో ఆమెను కౌన్సెలింగ్‌కి తీసుకొచ్చారు. వివాహం అనేది జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటన. ఇందులో స్త్రీ, పురుషులకు వేర్వేరు శారీరక, మానసిక, లైంగిక అవసరాలు ఉంటాయి. ప్రేమ వివాహమైనా, తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధమైనా భాగస్వాములు ఒకరితో ఒకరు ఎలా ఉంటారో ఊహించడం కష్టం. చాలామంది తల్లిదండ్రులు ఇవేవీ గుర్తించకుండా జానకి, రమేష్‌లు చేసిన తప్పే చేస్తుంటారు. పెళ్లికి కులం, గోత్రం, జాతకాలు కలిస్తే చాలనుకుంటారు. మంచి జాబ్ ఉంటే భేషనుకుంటారు. కానీ పెళ్లి చేసుకోబోయే వారిద్దరి ఇష్టాయిష్టాలు, మనసులు, మనస్తత్వాలు, అలవాట్లు కలవాలని ఆలోచించరు. ప్రయత్నించినా సునీల్ లాంటి వారు నెగెటివ్ పాయింట్స్ దాచి పాజిటివ్స్‌ను మాత్రమే ముందుంచుతారు. ఈ సమస్యకు పరిష్కారమే ప్రి–మేరిటల్ కౌన్సెలింగ్. ప్రీ–మేరిటల్ కౌన్సెలింగ్‌లో ఏం జరుగుతుంది? ప్రీ–మేరిటల్ కౌన్సెలింగ్ అనేది జంటలను మానసికంగా వివాహానికి సిద్ధం చేయడానికి సహాయపడే చికిత్స. వారిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని జీవితాంతం ఆరోగ్యకరమైన సంబంధాన్ని కలిగి ఉండగలరని నిర్ధారించుకోవడానికి సహాయపడుతుంది. కౌన్సెలింగ్ సమయంలో ఒకరికొకరు వారి వైవాహిక సంబంధాన్ని గురించి వారి దృక్కోణాలను అంచనా వేయడానికి రాతపూర్వకంగా సమాధానం ఇవ్వడానికి విడివిడిగా ప్రశ్నలు అడుగుతారు.ఫైనాన్స్, కమ్యూనికేషన్, నమ్మకాలు, విలువలు, ఆప్యాయత, సెక్స్, పిల్లలు, తల్లిదండ్రుల బాధ్యత, కుటుంబ బాంధవ్యాలు, బాధ్యతలు, డెసిషన్ మేకింగ్, యాంగర్ మేనేజ్మెంట్, జెండర్ ఈక్వాలిటీ, లైఫ్ స్టైల్, వైవాహిక జీవితంలో ఒత్తిళ్లు, వాటిని ఎదుర్కొనే విధానంలాంటి వివిధ అంశాల గురించి చర్చిస్తారు. ప్రి–మేరిటల్ కౌన్సెలింగ్ వల్ల ఉపయోగాలు ►వివాహ ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి కాబోయే వధూవరులను సిద్ధం చేస్తుంది. ► తమను తాము మార్చుకునే మనస్తత్వాన్ని పెంపొందించుకోవడానికి, భాగస్వాములతో సర్దుబాటు చేసుకోవడానికి సహాయపడుతుంది. ► వధువు లేదా వరుడు మానసికంగా వివాహానికి సిద్ధమైనట్టయితే.. తగిన భాగస్వామిని ఎంపిక చేసుకోవడానికి సరైన దారి చూపుతుంది. ► వ్యక్తిగత యోగ్యతలను అంచనావేయడానికి బదులుగా భాగస్వాముల మధ్య అనుకూలతను అంచనా వేసుకోగలరు. ► జంట మధ్య సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. ► భాగస్వాముల మధ్య కమ్యూనికేషన్లను మెరుగుపరచడానికి, వివాహానికి వాస్తవిక లక్ష్యాలను నిర్దేశించడానికి సహాయపడుతుంది. ► సంఘర్షణ–పరిష్కార నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి సహాయపడుతుంది. -సైకాలజిస్ట్ విశేష్ psy.vishesh@gmail.com -
సుడిగాలి సుధీర్ పెళ్లి.. యువతి ఎవరంటే..!
ఓ కామెడీ షోతో పాపులర్ అయిన సుడిగాలి సుధీర్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు.సుధీర్ పెళ్లిపై అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే సుధీర్ మాత్రం యాంకర్, నటి రష్మీ పై మనసు పారేసుకున్నాడని అందుకే పెళ్లిని వాయిదా వేస్తున్నాడనే వార్తలు చాలా కాలంగా నెట్టింట షికారు చేస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా సుధీర్ పెళ్లిపై అతడి స్నేహితులు ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను మాత్రం కాస్త సీరియస్ గానే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. (చదవండి: ఏమిచ్చి ఋణం తీర్చుకోగలను.. సాయితేజ్ ఎమోషనల్ ట్వీట్) తన వయస్సు ఇప్పటికే 34 ఏళ్ళు దాటిపోవడంతో వెంటనే సుధీర్ పెళ్లి సంబంధాల వేటలో పడిపోయినట్టు తెలిసింది. తాజాగా తమ ఫ్యామిలీకి చెందిన అత్యంత సన్నిహితుల ద్వారా ఓ సంబంధం కుదిరినట్లు తెలుస్తోంది. ఆ సంబంధం సుధీర్‌కు బాగా నచ్చి ఓకే కూడా చెప్పేసినట్లు కొన్ని వార్తలు ప్రచారమవుతున్నాయి. ఇక అమ్మాయి కూడా సుధీర్ సొంత జిల్లాకు చెందిన యువతే అని తెలుస్తోంది. అయితే దీనిపై సుధీర్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
‘మోదీకి పెళ్లి సంబంధం చూస్తాను’
వాషింగ్టన్ : మోదీజీ గనక పెళ్లికి ఒప్పుకుంటే ఆయన కోసం వధువును చూస్తాను అంటున్నారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. వినడానికే కాస్తా గందరగోళంగా ఉన్నా ఈ విషయం మాత్రం వాస్తవమంటుంది విదేశి మీడియా. భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీకి ఎప్పుడో వివాహం అయ్యింది. కానీ ప్రస్తుతం ఆయన ఒంటరిగా ఉంటున్నారు. అలాంటిది మోదీకి ట్రంప్ పెళ్లి సంబంధాలు చూడటం ఏంటి అనుకుంటున్నారా..? అవును గతేడాది భారత్ - అమెరికా అధ్యక్షుల సమావేశం సందర్భంగా ట్రంప్ ‘ఆయన(మోదీ) ఒప్పుకుంటే నేను ఆయన కోసం పెళ్లిళ్ల పేరయ్య అవతారం ఎత్తుతాను’ అంటూ చతుర్లాడరంట. ఈ విషయాలన్నింటిని ప్రముఖ అమెరికా మీడియా సంస్థ ‘పొలిటికో’ వెలువరించింది. ట్రంప్ విదేశీ నేతల సమావేశాల సందర్భంగా మర్చిపోయిన మర్యాదల గురించి ‘దౌత్య సమావేశాలు - తప్పిదాలు’ పేరటి పొలిటికో ఓ కథనాన్ని వెలువరించింది. దీనిలో విదేశీ నేతలతో సమావేశం సందర్భగా ట్రంప్ టెంపరితనంగా ప్రవర్తించిన సన్నివేశాలను, టెలిఫోన్ మర్యాదలు మర్చిపోయిన సందర్భాలను, ఇతర దేశాల పేర్లను తప్పుగా ఉచ్చరించిన సందర్భాల గురించి తెలియజేసింది. ఈ కథనంలో ట్రంప్‌కు దక్షిణాసియా దేశాల గురించి ఎటువంటి వివరాలు తెలియవని పొలిటొకో పేర్కోంది. గతేడాది భారత్ సమావేశం సందర్భంగా ట్రంప్ దక్షిణాసియా మ్యాప్‌ను తొలిసారిగా పరిశీలించారంట. ఆ సందర్భంగా ఆయన నేపాల్, భూటన్ వంటి దేశాల పేర్లను ‘నిపుల్’, ‘బుట్టోన్’గా పలికాడని పొలిటికో పేర్కొంది. అంతేకాకా ట్రంప్ ఈ దేశాలన్నింటిని ఇండియాలో భాగమేనని అనుకున్నారంటా. ఆ సమయంలోనే మోదీ గురించి ప్రస్తావన రాగా ప్రస్తుతం మోదీ తన భార్యతో కలిసి ఉండటం లేదు. అందువల్ల ఈ సమావేశానికి ఆయన ఒంటరిగా వస్తున్నారని వైట్ హౌస్ అధికారులు తెలిపారంట. అందుకు ట్రంప్ ‘అలా అయితే మోదీ కోసం నేను సంబంధం చూస్తాన’ని జోక్ చేశారంట. సమావేశానికి హాజరయిన పేర్లు చెప్పడానికి ఇష్టపడని ఇద్దరు అధికారులు ఈ విషయాల గురించి తమతో చెప్పినట్లు పొలిటికా ప్రకటించింది. -
పెళ్లి సంబంధాలు కుదరడం లేదని..
- సాప్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్య బంజారాహిల్స్: ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడం, తల్లిదండ్రులు వేరే సంబంధాలు చూస్తున్నా కుదరకపోవడం తో మనస్తాపం చెంది ఓ సాఫ్ట్వేర్ ఇంజి నీర్ ఆత్మహత్య చేసుకుంది. జూబ్లీహిల్స్ పోలీసు ల కథనం ప్రకారం... యూసుఫ్‌గూడ పోలీస్‌లైన్స్‌లో నివసించే ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ కూతురు అన్నపురెడ్డి శ్రీలక్ష్మి(23) బీటెక్ పూర్తి చేసి ఇటీవలే ఓ సాఫ్ట్వేర్ సంస్థలో చేరింది. ఈమె ఒక యువకుడిని ప్రేమించింది. అతడు పెళ్లికి నిరాకరించడంతో కొంతకాలంగా మనోవేదనకు గురవుతోంది. అంతేకాకుండా తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నా కుదురడంలేదు. ఈ నేపథ్యంలోనే శ్రీలక్ష్మి బాత్రూమ్లో చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లి సంబంధం కుదరడం లేదని.. వ్యక్తి ఆత్మహత్య
నల్గొండ: పెళ్లి సంబంధం కుదరడం లేదని ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది. దేవరకొండ పట్టణానికి చెందిన కిరాణ వ్యాపారి శీలా యాదయ్యకు నలుగురు కుమారులు. అందులో మూడో కుమారుడైన శీలా రాజు (32)కు చాలా కాలంగా పెళ్లి సంబంధాలు చూస్తున్నా ఎక్కడా కుదరడం లేదు. దీంతో తనకు ఇక పెళ్లి కాదని మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి ఇంట్లో అందరూ పడుకున్న సమయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటలకు తాళలేక కేకలు వేయడంతో గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శరీరం తీవ్రంగా కాలిపోవడంతో వైద్యులు హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని సూచించారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా రాజు అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. కేసు దర్యాప్తులో ఉంది.