‘మోదీకి పెళ్లి సంబంధం చూస్తాను’ | Trump Joked He Could Play Matchmaker For PM Modi | Sakshi
Sakshi News home page

‘మోదీకి పెళ్లి సంబంధం చూస్తాను’

Published Tue, Aug 14 2018 9:08 AM | Last Updated on Sat, Aug 25 2018 7:52 PM

Trump Joked He Could Play Matchmaker For PM Modi - Sakshi

భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, అమెరికా ఫస్ట్‌ లేడి మెలానియా ట్రంప్‌(ఫైల్‌ ఫోటో)

వాషింగ్టన్‌ : మోదీజీ గనక పెళ్లికి ఒప్పుకుంటే ఆయన కోసం వధువును చూస్తాను అంటున్నారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌. వినడానికే కాస్తా గందరగోళంగా ఉన్నా ఈ విషయం మాత్రం వాస్తవమంటుంది విదేశి మీడియా. భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీకి ఎప్పుడో వివాహం అయ్యింది. కానీ ప్రస్తుతం ఆయన ఒంటరిగా ఉంటున్నారు. అలాంటిది మోదీకి ట్రంప్‌ పెళ్లి సంబంధాలు చూడటం ఏంటి అనుకుంటున్నారా..? అవును గతేడాది భారత్‌ - అమెరికా అధ్యక్షుల సమావేశం సందర్భంగా ట్రంప్‌ ‘ఆయన(మోదీ) ఒప్పుకుంటే నేను ఆయన కోసం పెళ్లిళ్ల పేరయ్య అవతారం ఎత్తుతాను’ అంటూ చతుర్లాడరంట. ఈ విషయాలన్నింటిని ప్రముఖ అమెరికా మీడియా సంస్థ ‘పొలిటికో’ వెలువరించింది.

ట్రంప్‌ విదేశీ నేతల సమావేశాల సందర్భంగా మర్చిపోయిన మర్యాదల గురించి ‘దౌత్య సమావేశాలు - తప్పిదాలు’ పేరటి పొలిటికో ఓ కథనాన్ని వెలువరించింది. దీనిలో విదేశీ నేతలతో సమావేశం సందర్భగా ట్రంప్‌ టెంపరితనంగా ప్రవర్తించిన సన్నివేశాలను, టెలిఫోన్‌ మర్యాదలు మర్చిపోయిన సందర్భాలను, ఇతర దేశాల పేర్లను తప్పుగా ఉచ్చరించిన సందర్భాల గురించి తెలియజేసింది. ఈ కథనంలో ట్రంప్‌కు దక్షిణాసియా దేశాల గురించి ఎటువంటి వివరాలు తెలియవని పొలిటొకో పేర్కోంది. గతేడాది భారత్‌ సమావేశం సందర్భంగా ట్రంప్‌ దక్షిణాసియా మ్యాప్‌ను తొలిసారిగా పరిశీలించారంట. ఆ సందర్భంగా ఆయన నేపాల్‌, భూటన్‌ వంటి దేశాల పేర్లను ‘నిపుల్‌’, ‘బుట్టోన్‌’గా పలికాడని పొలిటికో పేర్కొంది.

అంతేకాకా ట్రంప్‌ ఈ దేశాలన్నింటిని ఇండియాలో భాగమేనని అనుకున్నారంటా. ఆ సమయంలోనే మోదీ గురించి ప్రస్తావన రాగా ప్రస్తుతం మోదీ తన భార్యతో కలిసి ఉండటం లేదు. అందువల్ల ఈ సమావేశానికి ఆయన ఒంటరిగా వస్తున్నారని వైట్‌ హౌస్‌ అధికారులు తెలిపారంట. అందుకు ట్రంప్‌ ‘అలా అయితే మోదీ కోసం నేను సంబంధం చూస్తాన’ని జోక్‌ చేశారంట. సమావేశానికి హాజరయిన పేర్లు చెప్పడానికి ఇష్టపడని ఇద్దరు అధికారులు ఈ విషయాల గురించి తమతో చెప్పినట్లు పొలిటికా ప్రకటించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement