నల్గొండ: పెళ్లి సంబంధం కుదరడం లేదని ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది. దేవరకొండ పట్టణానికి చెందిన కిరాణ వ్యాపారి శీలా యాదయ్యకు నలుగురు కుమారులు. అందులో మూడో కుమారుడైన శీలా రాజు (32)కు చాలా కాలంగా పెళ్లి సంబంధాలు చూస్తున్నా ఎక్కడా కుదరడం లేదు. దీంతో తనకు ఇక పెళ్లి కాదని మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి ఇంట్లో అందరూ పడుకున్న సమయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.
మంటలకు తాళలేక కేకలు వేయడంతో గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శరీరం తీవ్రంగా కాలిపోవడంతో వైద్యులు హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని సూచించారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా రాజు అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. కేసు దర్యాప్తులో ఉంది.
పెళ్లి సంబంధం కుదరడం లేదని.. వ్యక్తి ఆత్మహత్య
Published Fri, May 15 2015 12:25 AM | Last Updated on Sun, Sep 3 2017 2:02 AM
Advertisement
Advertisement