anti-national slogans
-
పాకిస్తాన్కు జై కొట్టిన అమూల్యకు బెయిల్
బెంగళూరు: "పాకిస్తాన్ జిందాబాద్" అంటూ దేశ వ్యతిరేక నినాదాలు చేసిన యువతి అమూల్య లియోనాకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మూడు నెలల పాటు జైలు జీవితం తర్వాత ఆమె బెయిల్పై విడుదల కానుంది. కాగా గురువారం నాటి విచారణలో బెంగళూరు కోర్టు ఆమె బెయిల్ అభ్యర్థనను తోసిపుచ్చిన విషయం తెలిసిందే. బెయిల్ మంజూరు చేస్తే ఆమె పారిపోవడంతో పాటు మరోసారి ఇదే తరహా నేరాలకు పాల్పడే అవకాశముందని అభిప్రాయపడింది. (ఆమె నోట పాక్ పాట) ఫిబ్రవరి 20న బెంగళూరులో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన ర్యాలీలో పాల్గొంది. ఇందులో ఏఐఎమ్ఐఎమ్ అధ్యక్షుడు అసదుద్ఈన్ ఓవైజీ కూడా పాల్గొనగా.. అతని సమక్షంలోనే 'పాకిస్తాన్ జిందాబాద్' అంటూ నినదించింది. దీంతో అమూల్య వ్యాఖ్యలపై నిరసనగా పలు చోట్ల ఆందోళనలు జరిగాయి. దేశ వ్యతిరేక కార్యకలాపాల కింద బెంగళూరు పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. (ఆ విద్యార్ధిని బెయిల్ పిటిషన్ కొట్టివేత..) -
కన్నయ్య కుమార్ పిటిషన్ విచారణ
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ)లో దేశ వ్యతిరేక నినాదాలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు కన్నయ్య కుమార్ దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టనుంది. తమపై ఆరోపణలు చేస్తూ యూనివర్సిటీ ఉన్నత స్థాయి కమిటీ చేసిన సిఫారసులను, తమకు విధించిన జరిమానాను రద్దు చేయాలని కోరుతూ కన్నయ్య కుమార్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సిద్ధార్ధ ముద్రుల్ విచారించనున్నారు. సీపీఐ విద్యార్థి విభాగానికి చెందిన కన్నయ్య కుమార్, యూనివర్సిటీ విద్యార్థులు ఉమర్ ఖలీద్, బట్టాచార్యలు 2016లో దేశ సమగ్రత దెబ్బతినే విధంగా నినాదాలు చేశారన్న ఆరోపణలపై యూనివర్సిటీ క్రమశిక్షణ ఉల్లంఘనపై వారికి జరిమానా విధించిన విషయం తెలిసిందే. దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని ఆరోపణలతో వారిని పోలీసులు అరెస్ట్ చేయగా.. బెయిల్పై బయట వచ్చారు. 1860లో రూపొందించిన చట్టాలతో యూనివర్సిటీ విద్యార్థులను వేధింపులకు గురి చేయడం సరికాదని, విద్యార్థి సంఘాల నేతలు కన్నయ్య కుమార్కు మద్దతు ప్రకటించారు. -
తలలు నరుకుతాం
కోలకతా: 'జాతి వ్యతిరేక' వ్యాఖ్యల వివాదం దేశవ్యాప్తంగా రగులుతోంది. ఈ నేపథ్యంలోనే అల్లర్లతో అట్టుడుకుతున్న బీర్భూమ్ జిల్లా సియురిలో స్థానిక బీజేపీ నేత అగ్నికి ఆజ్యం పోసే వ్యాఖ్యలతో వివాదాన్ని రగిలించారు. పశ్చిమబెంగాల్ బీజేపీ నేత దిలీప్ ఘోష్ వివాదాస్పద వ్యాఖ్యలతో దుమారం లేపారు. ఎవరైనా జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే తలలు నరుకుతామంటూ హెచ్చరించి వివాదాన్ని సృష్టించారు. ఇటీవల రగిలిన వివాదానికి నిరసనగా బీర్భూమ్లో జరుగుతున్న ర్యాలీనుద్దేశించి ప్రసంగించిన ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'పాకిస్తాన్ జిందాబాద్ ' అని ఎవరైనా నినదిస్తే పైనుంచి 6 అంగుళాలు మేర కత్తిరించి పారేస్తామని హెచ్చరించారు. సోషల్ నెట్వర్కింగ్ వెబ్ సైట్లో 'అభ్యంతరకరమైన' పోస్ట్ పెట్టడంతో మంగళవారం బీర్భూమ్లో ఘర్షణలు చెలరేగాయి. ఈ వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనకారులు పోలీస్ స్టేషన్ పై దాడిచేశారు. కొన్ని వాహనాలను ధ్వంసం చేశారు. ఫేస్బుక్ లో ఈ కామెంట్ పెట్టిన విద్యార్థి సుజన్ ముఖర్జీ ఇంటిముందు కొంతమంది ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.