Antonia guteres
-
దూకుడు పెంచిన రష్యా.. పుతిన్ తీరుపై ఫుల్ ఫైర్
మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా దూకుడు క్రమంగా ప్రత్యక్ష సైనిక ఆక్రమణగా మారుతోంది. ఈ పరిణామాలపై అమెరికా, యూరప్‌తో పాటు పలు ప్రపంచ దేశాలు మండిపడ్డాయి. అంతర్జాతీయ ఒప్పందాలను రష్యా అతిక్రమిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఐరాస భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమై, రష్యా చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు ప్రకటించింది. రష్యా చర్యలపై ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. తూర్పు ఉక్రెయిన్‌లోని ఈ సమస్యను మిన్స్క్ ఒప్పందానికి లోబడి శాంతియుతంగా పరిష్కరించుకోవాలని రష్యాకు సూచించారు. తన సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునేందుకు ఉక్రెయిన్ చేసే అన్ని ప్రయత్నాలకూ ఐరాస పూర్తి మద్దతిస్తుందని చెప్పారు. బలప్రయోగం ద్వారా ఏమైనా చేయొచ్చని పుతిన్ భావిస్తున్నారని, తన దుందుడుకు చర్యల ద్వారా అంతర్జాతీయ వ్యవస్థలనే సవాలు చేస్తున్నారని ఐరాసలో అమెరికా ప్రతినిధి లిండా థామస్ గ్రీన్‌ఫీల్డ్ విమర్శించారు. ఆయనకు గట్టిగా బదులివ్వాల్సిన సమయం వచ్చిందన్నారు. జర్మనీ, ఫ్రాన్స్, టర్కీ, డెన్మార్క్, ఫిన్లాండ్, బెల్జియం, ఆస్ట్రియా తదితర దేశాలన్నీ రష్యా చర్యను తీవ్రంగా తప్పుబట్టాయి. 15 దేశాలతో కూడిన భద్రతా మండలి ఉక్రెయిన్ సంక్షోభంపై భేటీ కావడం ఇటీవలి కాలంలో ఇది మూడోసారి. కాగా, రష్యాకు దగ్గరవుతున్న చైనా మాత్రం, సంక్షోభ నివారణకు మరిన్ని చర్చలు మేలంటూ ఆచితూచి స్పందించింది. (ఇది చదవండి: రష్యాకు షాకిచ్చిన అమెరికా.. బైడెన్ కీలక నిర్ణయం) -
కరోనా వల్ల మహిళలకే ఎక్కువ రిస్క్: యూఎన్
జెనీవా: కరోనా వైరస్ వ్యాప్తితో పురుషులతో పోలిస్తే మహిళలు, బాలికలే ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఐక్యరాజ్యసమితి కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా.. కరోనా విస్తృతి నేపథ్యంలో మహిళలు, బాలికల అవసరాలపై దృష్టి పెట్టాలని ఐక్యరాజ్యసమితి జనాభా నిధి (యూఎన్‌ఎఫ్‌పిఏ) పిలుపునిచ్చింది. వారి ఆరోగ్యం, హక్కులను కాపాడటం ఏ సంస్థ లేదా ఏ ఒక్క దేశమో ఒంటరిగా ఏమీ చేయలేదని యూఎన్ఎఫ్పీఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ నటాలియా కనేమ్ ఓ ప్రకటనలో తెలిపారు. (‘కరోనా వ్యాక్సిన్ ముందుగా వారికే’) మానవాళి మొత్తం ఏకధాటిపై నడిస్తేనే కరోనా నిర్మూలనలో మనం విజయం సాధించగలమని యూఎన్‌ఎఫ్‌పిఏ తెలిపింది. కరోనా వైరస్ కారణంగా మహిళలు అనేక రకాలైన ప్రమాదాలను ఎదుర్కొంటున్నారని వారికోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. కోవిడ్-19 మహమ్మారి ప్రతి ఒక్కరినీ, ప్రతిచోటా ప్రభావితం చేస్తుంది. కానీ ప్రతి ఒక్కరినీ సమానంగా ప్రభావితం చేయదని గుర్తించాలి. ఇది ఇప్పటికే మహిళలు, బాలికలపై ఉన్న అసమానతలు, దుర్బలత్వాన్ని పెంచుతోందని యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ పేర్కొన్నారు. (వ్యాక్సిన్: ముందు వరుసలో ఆ 3 కంపెనీలు!) -
డబ్ల్యూహెచ్ఓకి అమెరికా నిధులు కట్
వాషింగ్టన్: చైనాలో పుట్టిన కరోనా మహమ్మారిపై అప్రమత్తం చేయడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) విఫలమైందని ఆరోపణలు గుప్పిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నంత పని చేశారు. డబ్ల్యూహెచ్ఓకి నిధుల్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. ప్రతీ ఏడాది అమెరికా 50 కోట్ల డాలర్ల నిధుల్ని డబ్ల్యూహెచ్ఓకి కేటాయిస్తుంది. ఆ సంస్థ చైనాకి కొమ్ముకాస్తూ ప్రపంచదేశాలను ముప్పులో పడేసిందని ట్రంప్ ఆరోపించారు. ‘ప్రపంచ ఆరోగ్య సంస్థకి విడుదల చేసే నిధుల్ని వెంటనే ఆపేయాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశిస్తున్నాను’ అని ట్రంప్ వెల్లడించారు. ‘వూహాన్లో వైరాలజీ ల్యాబ్ ఉంది. అక్కడే మాంసం, చేపల మార్కెట్లు ఉన్నాయి. వైరస్ అక్కడే పుట్టింది’ అని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో అన్నారు. కోవిడ్ సంక్షోభంలో చిక్కుకొని ప్రపంచ దేశాలు అతలాకుతలమవుతున్న తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థకి వచ్చే నిధుల్ని నిలిపివేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోవిడ్‌పై పోరాటంలో చురుకైన పాత్ర పోషిస్తున్న డబ్ల్యూహెచ్ఓకి ఇలాంటి సమయంలో నిధుల్ని ఆపేయడం సరైంది కాదని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటెరాస్ అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధుల్ని ఆపేస్తే దాని ప్రభావం అందరి మీద పడుతుందన్నారు. ప్రపంచదేశాలన్నీ ఐక్యమత్యంగా ఉంటూ రాబోయే విపత్తును ఎదుర్కోవాల్సిన తరుణంలో అమెరికా ఈ నిర్ణయం తీసుకోవడం సరైంది కాదని అన్నారు. నిధులు పెంచుతాం : చైనా ప్రపంచ ఆరోగ్య సంస్థకి అమెరికా నిధుల్ని నిలిపివేయడంపై చైనా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి సమయంలో నిధుల్ని ఆపేస్తే, ఆ దేశంతో సహా అందరిపైనా ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. తాము ఇకపై నిధులు పెంచుతామంటూ సంకేతాలు ఇచ్చింది. ఇప్పటికే 2 కోట్ల డాలర్లు ఇచ్చామని వెల్లడించింది. -
లక్ష దాటిన కోవిడ్ మరణాలు
జెనీవా/వాషింగ్టన్/రోమ్: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కరాళ నృత్యం చేస్తోంది. ఈ వ్యాధి బారిన పడి మరణించిన వారి సంఖ్య శుక్రవారం 1,01,485కు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా 16లక్షల 75వేల మందికిపైగా కరోనా వైరస్ బారినపడ్డారు. ఈస్టర్ సంబరాల వేళ ప్రపంచ జనాభాలో సగం మంది ఇంటి పట్టునే ఉండడంతో ఎక్కడా సందడి కనిపించడం లేదు. సామాజిక, ఆర్థిక ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొనడంతో మార్కెట్లన్నీ కళావిహీనంగా మారిపోయాయి. కోవిడ్ బారిన పడి విలవిలలాడుతున్న దేశాల్లో అమెరికాయే ముందు వరసలో ఉంది. 24 గంటల్లో 1,700 మంది మృతి చెందారు. వైరస్ దెబ్బకి అగ్రరాజ్యంలో ప్రతీ 10 మందిలో ఒకరు ఉద్యోగం కోల్పోతే, తమ సభ్యదేశాల్లో సహాయ కార్యక్రమాల కోసం 50 వేల కోట్ల యూరోలతో ప్రత్యేక ప్యాకేజీని అందించడానికి ఈయూ ఆర్థిక మంత్రులు అంగీకరించారు. ప్రపంచ శాంతికి భంగకరం కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల్లో శాంతి భద్రతల్ని భగ్నం చేస్తుందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి అంటోనియా గ్యుటెరాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మొండి వ్యాధిపై కొన్ని తరాల వారు పోరాడాల్సి ఉంటుందని ఆయన అంచనా వేశారు. త్వరలోనే ప్రపంచ దేశాల్లో సామాజిక అస్థిరత, హింసాత్మక పరిస్థితులు వస్తాయని భద్రతా మండలిని హెచ్చరించారు. కోలుకుంటున్న జాన్సన్ బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కోవిడ్ నుంచి కోలుకుంటున్నారు. ఆయనను ఐసీయూ నుంచి వార్డుకి మార్చారు. జాన్సన్ ఆరోగ్యాన్ని రేయింబవళ్లు వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. జాన్సన్‌తో ఆయన తండ్రి స్టాన్లీ జాన్సన్ మాట్లాడారు. ఇటలీలో మాఫియా కదలికలు కోవిడ్‌తో అతలాకుతలమైన ఇటలీపై పట్టు బిగించడానికి మాఫియా పన్నాగాలు పన్నుతోంది. వివిధ నేరగాళ్ల ముఠాలు పెద్ద ఎత్తున ఆహార పదార్థాలను కొనుగోలు చేసి, ఆకలితో అలమటిస్తున్న వారికి పంపిణీ చేస్తున్నాయి. నిరుపేదల్ని ఆదుకొని వారందరినీ తమ నియంత్రణలోకి తీసుకోవాలని కుట్రలు పన్నుతున్నాయని రచయిత రోబెర్టో సావియానో అనుమానం వ్యక్తం చేశారు. యెమన్‌లో తొలి కరోనా కేసు యుద్ధంతో అతలాకుతలమవుతున్న యెమన్‌లో మొట్టమొదటి కరోనా వైరస్ నమోదైంది. తీవ్రస్థాయిలో మానవ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న యెమన్‌లో కోవిడ్ జాడలు ఎలాంటి విధ్వంసానికి దారితీస్తుందోనని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. క్లినికల్ ట్రయల్స్ దశలో ప్లాస్మా థెరపీ న్యూఢిల్లీ: కరోనా చికిత్సకు కొత్తగా అందుబాటులోకి వచ్చిన కొన్వాలెసెంట్ ప్లాస్మా థెరపీ విధానం క్లినికల్ ట్రయల్స్ దశలో ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. కరోనా బారిన పడి కోలుకున్న వారి రక్తం నుంచి సేకరించిన యాంటీ బాడీస్‌ను కరోనా వైరస్‌తో తీవ్రంగా బాధపడుతున్న వారికి ఎక్కించడమే ప్లాస్మా థెరపీ. ఈ విధానాన్ని దేశంలోనే మొట్టమొదటిసారిగా కేరళలోని శ్రీచిత్ర పెరుమాళ్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీలోని రోగులపై ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇచ్చినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. అయితే, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) కూడా ట్రయల్స్‌కు అంగీకారం తెలపాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇటీవల కొన్ని దేశాల్లో కరోనా సోకి విషమంగా ఉన్న రోగులకు, వెంటిలేటర్‌పై ఉన్న వారికి ఈ విధానాన్ని పరిమిత సంఖ్యలో ప్రయోగాత్మకంగా పరిశీలించగా మంచి ఫలితాలు వచ్చాయని పేర్కొంది. -
కూచిభొట్లకు ‘కాన్సస్’ నివాళి!
మార్చి 16న ‘భారతీయ–అమెరికన్ ప్రశంస దినం’ వాషింగ్టన్: అమెరికాలో జాతివిద్వేష కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన శ్రీనివాస్ కూచిభొట్ల గౌరవార్ధం మార్చి 16ను ‘భారతీయ–అమెరికన్ ప్రశంస దినం’(అప్రీసియేషన్ డే)గా జరుపుకోవాలని కాన్సస్ రాష్ట్రం నిర్ణయించింది. కాన్సస్ రాజధానిలో భారతీయ అమెరికన్లు పాల్గొన్న ప్రత్యేక కార్యక్రమంలో ఆ విషయాన్ని ్సస్ గవర్నర్ బ్రౌన్‌బాక్ వెల్లడించారు. ఫిబ్రవరి 22న కాన్సస్‌లోని ఒలేతేలో అమెరికా నేవీ మాజీ ఉద్యోగి జరిపిన కాల్పుల్లో శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయారు. కాల్పులు సమాజంలో విభేదాలు సృష్టించలేవని, కాన్సస్ సంస్కృతి అది కాదని బ్రౌన్ అన్నారు. శ్రీనివాస్ మృతి పట్ల గవర్నర్ బహిరంగ క్షమాపణలు చెప్పారు. అలోక్, గ్రిలట్‌లు వేగంగా కోరుకోవాలని అభిలషించారు. భారతీయ సమాజానికి అండగా ఉండేందుకు కాన్సస్ కట్టుబడి ఉందని, హింస, హాని చేసే చర్యల్ని ఎల్లప్పుడూ తిరస్కరిస్తామని, విద్వేషం ఏ రూపంలో ఉన్న వ్యతిరేకిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాల్పుల్లో గాయపడ్డ మేడసాని అలోక్, గ్రిలట్‌లు పాల్గొన్నారు. ఏప్రిల్ నెలను ‘సిక్కు అవగాహన, స్మారక నెల’గా జరుపుకోవాలని డెలావేర్ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానించింది. ఆ మేరకు అసెంబ్లీలోని సెనేట్, ప్రతినిధుల సభలు ఒక తీర్మానాన్ని ఆమోదించాయి. ఐరాసకు నిధుల కోత సరికాదు: గుటెరస్ ఐక్యరాజ్యసమితికి అమెరికా చేస్తున్న సాయంలో అర్థాంతరంగా కోత పెట్టే నిర్ణయాన్ని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెరెస్ తప్పుపట్టారు. దీనివల్ల సమితి చేపడుతున్న దీర్ఘకాలిక సంస్కరణలు తీవ్రంగా ప్రభావితమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.