జెనీవా: కరోనా వైరస్ వ్యాప్తితో పురుషులతో పోలిస్తే మహిళలు, బాలికలే ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఐక్యరాజ్యసమితి కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా.. కరోనా విస్తృతి నేపథ్యంలో మహిళలు, బాలికల అవసరాలపై దృష్టి పెట్టాలని ఐక్యరాజ్యసమితి జనాభా నిధి (యూఎన్‌ఎఫ్‌పిఏ) పిలుపునిచ్చింది. వారి ఆరోగ్యం, హక్కులను కాపాడటం ఏ సంస్థ లేదా ఏ ఒక్క దేశమో ఒంటరిగా ఏమీ చేయలేదని యూఎన్‌ఎఫ్‌పీఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ నటాలియా కనేమ్ ఓ ప్రకటనలో తెలిపారు. (‘కరోనా వ్యాక్సిన్ ముందుగా వారికే’)
మానవాళి మొత్తం ఏకధాటిపై నడిస్తేనే కరోనా నిర్మూలనలో మనం విజయం సాధించగలమని యూఎన్‌ఎఫ్‌పిఏ తెలిపింది. కరోనా వైరస్ కారణంగా మహిళలు అనేక రకాలైన ప్రమాదాలను ఎదుర్కొంటున్నారని వారికోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. కోవిడ్-19 మహమ్మారి ప్రతి ఒక్కరినీ, ప్రతిచోటా ప్రభావితం చేస్తుంది. కానీ ప్రతి ఒక్కరినీ సమానంగా ప్రభావితం చేయదని గుర్తించాలి. ఇది ఇప్పటికే మహిళలు, బాలికలపై ఉన్న అసమానతలు, దుర్బలత్వాన్ని పెంచుతోందని యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ పేర్కొన్నారు. (వ్యాక్సిన్: ముందు వరుసలో ఆ 3 కంపెనీలు!)
Comments
Please login to add a commentAdd a comment