Anuragha sharma
-
ప్రెసిడెంట్ పోలీసు అవార్డు గ్రహీతలకు అభినందనలు: డీజీపీ
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోలీస్ శాఖలో విశిష్ట సేవలు అందించిన అధికారులకు ప్రతిష్టాత్మక అవార్డులను సోమవారం ప్రకటించారు. ప్రెసిడెంట్ పోలీసు అవార్డు గ్రహీతలకు డీజీపీ అనురాగ్ శర్మ అభినందనలు తెలిపారు. ప్రెసిడెంట్ అవార్డులకు ఎంపికైన వారిలో.. హైదరాబాద్ అడిషినల్ సీపీ అంజనీ కుమార్, జాయింట్ సీపీ శివ కుమార్, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి సూర్యనారాయణ ఉన్నారు. గ్యాలన్ట్రీ అవార్డుకు కోటగిరిధర్, నలుపుల రవీందర్ ఎంపిక అయ్యారు. పోలీసు సేవా పతకానికి.. గ్రేహౌండ్స్ డీఐజీ స్టీఫెన్ రవీంద్ర, అడిషినల్ ఎస్పీ పల్లా రవీందర్ రెడ్డి, కరీంనగర్ డీఎస్పీ, ఎం భీమరావు, కొట్టం శ్యాం సుందర్, కటకం మురళీధర్, కొమ్మెర శ్రీనివాసరావు, పోలు రవీందర్, వై. వల్లి బాబా, మారుతీరావు, మహ్మద్ జాఫర్, డబ్బికర్ కిషన్‌జీ, ఎ. వేంకటేశ్వర్ రెడ్డి ఎంపిక అయ్యారు. -
పోలీసులకు ఇళ్ల స్థలాలు కేటాయించనున్న ప్రభుత్వం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులకు ఇళ్ల స్థలాలు కేటాయించనుందని డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలోని పోలీసులకు అపార్ట్మెంట్ల నిర్మాణంతో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసులకు ప్రభుత్వ స్థలాలను కేటాయించనున్నట్లు తె లిపారు. ఆయన సోమవారం పోలీసు ఉద్యోగ సంఘాలతో సమావేశమయ్యారు. మరో పదిహేను రోజుల్లో వీటికి సంబంధించిన శంకుస్థాపన పనులు ప్రారంభిచనున్నట్లు ఈ సందర్భంగా ఆయన అన్నారు. -
28 మంది డీఎస్పీలకు పోస్టింగులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 28 మంది డీఎస్పీలకు కొత్తగా పోస్టింగ్‌లిస్తూ డీజీపీ అనురాగ్‌శర్మ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవలే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వీరందరికీ ఇన్స్పెక్టర్ నుంచి డీఎస్పీలుగా పదోన్నతులిచ్చారు. అనంతరం వీరిని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయమని చెప్పారు. కాగా, మంగళవారం డీజీపీ అనురాగ్‌శర్మ నేతృత్వంలోని డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ సమావేశమై వీరికి కొత్తగా పోస్టింగులిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో హైదరాబాద్‌లో 24 మందికి పోస్టింగులివ్వగా, మురళి మనోహర్‌కు సీసీఎస్ మహబూబ్‌నగర్ డీఎస్పీగా, గోవర్ధన్‌కు నాగర్‌కర్నూల్ డీఎస్పీగా, షేక్ అలీకి సంగారెడ్డి డబ్ల్యూపీఎస్గా, తిరుపతన్నకు సంగారెడ్డి డీఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. -
వారానికి ఐదు రోజులు యూనిఫాం తప్పనిసరి
* అదనపు డీజీలు మొదలుకొని ఎస్పీల వరకు.. * డీజీపీ అనురాగ్ శర్మ ఆదేశాలు సాక్షి,హైదరాబాద్: ఇకపై వారానికి ఐదు రోజుల పాటు యూనిఫాంను తప్పనిసరిగా ధరించాలని తమ హెడ్‌క్వార్టర్స్‌లోని అధికారులకు రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మ సోమవారం ఆదేశించారు. రాష్ట్ర విభజన అనంతరం డీజీపీ కార్యాలయంలోని కొందరు అధికారులు మినహా మిగతా వారు యూనిఫాం ధరిం చి రాకపోవడం డీజీపీ దృష్టికి వచ్చింది. అదనపు డీజీలు మొదలుకుని ఎస్పీ స్థాయి అధికారుల వరకు సివిల్ దుస్తుల్లోనే కా ర్యాలయానికి రావడం వలన క్రమశిక్షణ దెబ్బతింటున్నదని ఆ యన భావించినట్లు తెలిసింది. దీంతో ఇకపై సోమవారం నుంచి శుక్రవారం వరకు ఐదు రోజుల పాటు యూనిఫాంను తప్పని సరిగా ధరించి రావాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. -
పదో రోజూ నిరాశే
* తెలియని హిమాచల్ బాధితుల జాడ * 700 మంది గాలించినా దక్కని ఫలితం సాక్షి, హైదరాబాద్: హిమాచల్‌ప్రదేశ్‌లో బియాస్ దుర్ఘటనలో ఇంకా ఆచూకీ చిక్కని 17 మంది జాడ కోసం చేస్తున్న ప్రయత్నాలు పదో రోజు కూడా ఏమాత్రమూ ఫలించలేదు. నదిలో ప్రమాదస్థలికి ఎగువనున్న లార్జి, దిగువనున్న పండో డ్యాముల మధ్య మంగళవారం ఏకంగా 700 మంది సిబ్బంది జల్లెడ పట్టినా ఒక్క విద్యార్థి ఆచూకీ కూడా లభించలేదు. లైడర్ రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ, సైడ స్కాన్ సోనార్ వంటి అత్యాధునిక పద్ధతులతో గాలింపు జరిపినా లాభం లేకపోరుుంది. రుతుపవనాల ప్రభావంతో హిమాచల్‌లో అతి త్వరలో ఎడతెరిపి లేని వర్షాలు ప్రారంభం కానుండటం మరింత ఆందోళనకు దారితీస్తోంది. హైదరాబాద్ నుంచి విహారయూత్రకు వెళ్లిన 24 మంది విజ్ఞాన్‌జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు, ఒక టూర్ ఆపరేటర్ హఠాత్తుగా ముంచెత్తిన బియూస్ ప్రవాహంలో కొట్టుకుపోవడం తెలిసిందే. జూన్ 8న జరిగిన ఈ ఘోరానికిసంబంధించి తొలి నాలుగు రోజుల్లో 8 మంది మృతదేహాలు లభించారుు. తెలంగాణ హోం మంత్రి నారుుని నర్సింహారెడ్డి స్థానంలో రవాణా మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ఇప్పటికే హిమాచల్ వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షిస్తుండగా, మంగళవారం రాష్ట్ర డీజీపీ అనురాాగ్శర్మ కూడా అక్కడికి చేరుకుని గాలింపు చర్యల్లో పాలుపంచుకుంటున్నారు. విద్యార్థుల కోసం గాలింపు చర్యలను చివరికంటా చేపడతామని ఆయనన్నారు. మృతదేహాల జాడ లార్జి-పండో డ్యాముల మధ్యలో అరుుతే దొరకడం కొంత సులువే గానీ పండోను కూడా దాటి వెళ్లి ఉంటే కనిపెట్టడం చాలా కష్టమని అక్కడి అధికారులు వివరించారు. -
చిట్టీల పేరుతో టీవీ నటి దగా
400 మంది తోటి నటులకు రూ.10 కోట్ల మేర టోపీ! హైదరాబాద్ సీపీకి ఫిర్యాదు చేసిన బాధితులు సాక్షి, హైదరాబాద్: బుల్లితెర నటులను నమ్మించి చిట్టీల పేరుతో రూ.10 కోట్ల మేర నిండా ముంచిన ఓ నటి వ్యవహారం వెలుగు చూసింది. 46 మంది బాధితులు గురువారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అనురాగ్‌శర్మను కలసి తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేశారు. బత్తుల విజయరాణి(46) అనే టీవీ సీరియల్ ఆర్టిస్టు రూ. 5.35 కోట్ల రూపాయల మేర తమకు చెల్లించాల్సి ఉందని, న్యాయం చేయాలని వారు కోరారు. అయితే, బాధితుల సంఖ్య 400 మంది వరకు ఉంటుందని.. వీరందరికీ విజయరాణి చెల్లించాల్సిన మొతాన్ని లెక్కిస్తే రూ. 10కోట్ల మేర ఉంటుందని కొందరు మీడియాకు తెలిపారు. బాధితులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన బత్తుల విజయరాణి (46) టీవీ సీరియల్స్‌లో నటిస్తూ అమీర్‌పేట న్యూ శాస్త్రినగర్‌లో నివాసముంటోంది. 12 ఏళ్లుగా చిట్టీల వ్యాపారం కూడా నడుపుతోంది. రూ. 5లక్షల నుంచి రూ. 50 లక్షల విలువైన చిట్టీల్లో సుమారు 400 మంది నటులు సభ్యులుగా చేరారు. గత నాలుగైదు నెలలుగా చిట్టీలు పాడిన వారికి ఆమె ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయి. దీంతో వారు ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చారు. రేపు మాపు అంటూ విజయరాణి వాయిదా వేస్తూ వస్తోంది. ఇది తెలిసి ఆమెకు లక్షల రూపాయల్లో బదులు ఇచ్చిన మరికొందరు కూడా తమ డబ్బులు తిరిగిచ్చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో విజయరాణి ఉన్నట్లుండి బుధవారం నుంచీ కనిపించకుండా పోయింది. దీనిపై బాధితులు జూనియర్ ఆర్టిస్టుల సంఘాన్ని ఆశ్రయించగా.. వారు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. దీంతో వారు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ డీసీపీ జి.పాలరాజును ఆశ్రయించారు. ఆ తర్వాత నగర పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.