పదో రోజూ నిరాశే
* తెలియని హిమాచల్ బాధితుల జాడ
* 700 మంది గాలించినా దక్కని ఫలితం
సాక్షి, హైదరాబాద్: హిమాచల్‌ప్రదేశ్‌లో బియాస్ దుర్ఘటనలో ఇంకా ఆచూకీ చిక్కని 17 మంది జాడ కోసం చేస్తున్న ప్రయత్నాలు పదో రోజు కూడా ఏమాత్రమూ ఫలించలేదు. నదిలో ప్రమాదస్థలికి ఎగువనున్న లార్జి, దిగువనున్న పండో డ్యాముల మధ్య మంగళవారం ఏకంగా 700 మంది సిబ్బంది జల్లెడ పట్టినా ఒక్క విద్యార్థి ఆచూకీ కూడా లభించలేదు. లైడర్ రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ, సైడ స్కాన్ సోనార్ వంటి అత్యాధునిక పద్ధతులతో గాలింపు జరిపినా లాభం లేకపోరుుంది. రుతుపవనాల ప్రభావంతో హిమాచల్‌లో అతి త్వరలో ఎడతెరిపి లేని వర్షాలు ప్రారంభం కానుండటం మరింత ఆందోళనకు దారితీస్తోంది. హైదరాబాద్ నుంచి విహారయూత్రకు వెళ్లిన 24 మంది విజ్ఞాన్‌జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు, ఒక టూర్ ఆపరేటర్ హఠాత్తుగా ముంచెత్తిన బియూస్ ప్రవాహంలో కొట్టుకుపోవడం తెలిసిందే.
జూన్ 8న జరిగిన ఈ ఘోరానికిసంబంధించి తొలి నాలుగు రోజుల్లో 8 మంది మృతదేహాలు లభించారుు. తెలంగాణ హోం మంత్రి నారుుని నర్సింహారెడ్డి స్థానంలో రవాణా మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ఇప్పటికే హిమాచల్ వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షిస్తుండగా, మంగళవారం రాష్ట్ర డీజీపీ అనురాాగ్‌శర్మ కూడా అక్కడికి చేరుకుని గాలింపు చర్యల్లో పాలుపంచుకుంటున్నారు. విద్యార్థుల కోసం గాలింపు చర్యలను చివరికంటా చేపడతామని ఆయనన్నారు. మృతదేహాల జాడ లార్జి-పండో డ్యాముల మధ్యలో అరుుతే దొరకడం కొంత సులువే గానీ పండోను కూడా దాటి వెళ్లి ఉంటే కనిపెట్టడం చాలా కష్టమని అక్కడి అధికారులు వివరించారు.