ప్రెసిడెంట్‌ పోలీసు అవార్డు గ్రహీతలకు అభినందనలు: డీజీపీ | DGP congrats to president police award recipients | Sakshi
Sakshi News home page

ప్రెసిడెంట్‌ పోలీసు అవార్డు గ్రహీతలకు అభినందనలు: డీజీపీ

Jan 25 2016 7:28 PM | Updated on Aug 21 2018 8:23 PM

తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ పోలీస్‌ శాఖలో విశిష్ట సేవలు అందించిన అధికారులకు ప్రతిష్టాత్మక పతకాలు ప్రకటించారు.

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ పోలీస్‌ శాఖలో విశిష్ట సేవలు అందించిన అధికారులకు ప్రతిష్టాత్మక అవార్డులను సోమవారం ప్రకటించారు. ప్రెసిడెంట్‌ పోలీసు అవార్డు గ్రహీతలకు డీజీపీ అనురాగ్‌ శర్మ అభినందనలు తెలిపారు. ప్రెసిడెంట్‌ అవార్డులకు ఎంపికైన వారిలో.. హైదరాబాద్‌ అడిషినల్‌ సీపీ అంజనీ కుమార్‌, జాయింట్‌ సీపీ శివ కుమార్‌, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి సూర్యనారాయణ ఉన్నారు. గ్యాలన్ట్రీ అవార్డుకు కోటగిరిధర్‌, నలుపుల రవీందర్‌ ఎంపిక అయ్యారు.

పోలీసు సేవా పతకానికి.. గ్రేహౌండ్స్‌ డీఐజీ స్టీఫెన్‌ రవీంద్ర, అడిషినల్‌ ఎస్పీ పల్లా రవీందర్‌ రెడ్డి, కరీంనగర్‌ డీఎస్పీ, ఎం భీమరావు, కొట్టం శ్యాం సుందర్‌, కటకం మురళీధర్‌, కొమ్మెర  శ్రీనివాసరావు, పోలు రవీందర్‌, వై. వల్లి బాబా, మారుతీరావు, మహ్మద్‌ జాఫర్‌, డబ్బికర్‌ కిషన్‌జీ, ఎ. వేంకటేశ్వర్‌ రెడ్డి ఎంపిక అయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement