apllications
-
కోడళ్లకు అక్కడ 'నో రేషన్‌కార్డు'..
కరీంనగర్: రేషన్‌కార్డుల జారీ ఎటూతేలకపోవడం కోడళ్లకు శాపంగా మారింది. ఇంటిపేరు మారినా రేషన్‌కార్డులో పేరు చేరకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలో వేలమంది నిరీక్షిస్తుండగా అధికార యంత్రాంగం సమాధానమివ్వలేని పరిస్థితి. గత అయిదేళ్లుగా దరఖాస్తులు కుప్ప ల్లా పేరుకుపోతుండగా కార్డుల జారీ ప్రశ్నార్థకం. ఇక పేర్ల తొలగింపు ప్రక్రియ నిరంతరం సాగుతుండగా కొత్తకార్డుల జారీలో మాత్రం అలసత్వమే. కార్డుల మంజూరుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేవని యంత్రాంగం చెబుతుండగా నిరీక్షణ ఇంకెన్నాళ్లన్న అసహనం వ్యక్తమవుతోంది. ‘నగరంలోని గణేశ్‌నగర్‌కు చెందిన కత్తురోజు రమేశ్‌కు ఏడాది క్రితం వివాహమైంది. హుజూరాబాద్ నుంచి అఖిలను పెళ్లి చేసుకోగా ఆమెపేరును తల్లిగారింట తొలగించారు. ఈ క్రమంలో కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోగా ఇప్పటికీ మంజూరు కాలేదు. ఇది ఒక అఖిల పరిస్థితే కాదు జిల్లావ్యాప్తంగా వేలల్లో ఉన్న కోడళ్లది.' దరఖాస్తు చేసి ఏళ్లు.. మంజూరుకు ఎన్నేళ్లు కొత్తకార్డుకు దరఖాస్తు చేసి ఏళ్లు గడుస్తుండగా స్పష్టమైన ప్రకటన లేదని వాపోతున్నారు. తనకు అయిదేళ్ల క్రితం వివాహమైందని, పిల్లలు పుట్టారని అయినా కార్డు మంజూరు కాలేదని చొప్పదండికి చెందిన రాజు వివరించారు. జిల్లాలో 512 రేషన్‌దుకాణాల ద్వారా రేషన్ బియ్యం పంపిణీ చేస్తుండగా 2.70లక్షల కార్డుదారులున్నారు. పెళ్లికాగానే తమ పేరును తొలగించాలని కొందరు యువతులు స్వచ్ఛందంగా దరఖాస్తు చేసుకుంటున్నారు. వారి పేరు మీద ఉన్న యూనిట్‌ను అధికారులు తొలగిస్తున్నారు. అత్తారింటి కార్డులో పేరు చేర్చే ఆప్షన్ లేకపోవడంతో కొందరు తొలగింపునకు ఒప్పుకోవడం లేదు. సదరు కార్డులు అలాగే కొనసాగుతుండగా పలు గ్రామాల్లో పేర్లు తొలగించాలని తహసీల్దార్లకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ మేరకు విచారణ చేసి తొలగిస్తున్నారు. ఈ మూడేళ్లలో జిల్లావ్యాప్తంగా అత్తింటి కార్డులో ఒక్కపేరు చేర్చలేదని తెలుస్తోంది. ఒక్కో కార్డుకు రూ.25 వసూలు రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇప్పటివరకు రేషన్‌కార్డులు పంపిణీ చేయలేదు. గతంలో ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు కొత్త కార్డులు ముద్రించగా జిల్లాల విభజనతో సదరు కార్డులను మూలనపడేశారు. దీంతో డీలర్లే కార్డులు ముద్రించి లబ్ధిదారుల పేర్లు రాసిస్తున్నారు. ఒక్కోకార్డుకు రూ.25వరకు వసూలు చేస్తున్నారు. కొత్తకార్డులు, పేర్లు చేర్పించేందుకు మీసేవ కేంద్రాల్లో వేలల్లో దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. అధికారులు విచారణచేసి అర్హులకు అనుమతిచ్చి కమిషనరేట్ లాగిన్‌కు పంపించారు. ప్రభుత్వ నిర్ణయం వెలువడక మూడేళ్ల నుంచి ముందుకు సాగడం లేదు. అయితే కొత్తకార్డుల జారీపై ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు లేవని, కోడళ్లు తమ పేరును అత్తారింటి కార్డులో చేర్చేందుకు మీసేవలో నమోదు చేసుకోవచ్చని పౌరసరఫరాల అధికారులు చెబుతున్నారు. ఇవి చదవండి: ఇకపై ఈ ప్రాంతాలకు 'ఆర్ ఆర్ ఆర్' (RRR) -
రుణ యాప్‌లను బ్లాక్ చేసేందుకు చర్యలు
సాక్షి, హైదరాబాద్: రుణ యాప్‌లను బ్లాక్ చేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ హైకోర్డు రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదేశించింది. ఆ యాప్‌లను తొలగించేందుకు వెంటనే ప్లేస్టోర్‌ను సంప్రదించాలని, రుణ యాప్‌ల నిర్వాహకులను కట్టడి చేసేలా కఠిన చర్యలు తీసుకోవాలంది. న్యాయవాది కళ్యాణ్దీప్ వేసిన పిల్‌పై హైకోర్టు ప్రధాన న్యాయముర్తి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా చైనా రుణ యాప్‌ల వల్ల బాధితులు ఆత్మహత్య పాల్పడుతున్నారని పిటిషనర్ తెలిపారు. ఈ క్రమంలో రుణ యాప్‌ల వేధింపులపై నివేదిక సమర్పించాలని హైకోర్టు డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు కూడా నివేదికలు ఇవ్వాలని పేర్కొంది. రుణ యాప్‌లకు సంబంధించిన విచారణను హైకోర్టు మార్చి 18కి వాయిదా వేసింది. -
నేటి నుంచి డీఈఈసెట్ దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్ : డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) కోర్సుల్లో ప్రవేశాల కోసం శనివారం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు డీఈఈసెట్ కన్వీనర్ రమణకుమార్ తెలిపారు. వచ్చే నెల 10 వరకు విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆన్లైన్ దరఖాస్తుల లింకు శనివారం ఉదయం నుంచి అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. గత ఏడాది పరీక్ష ఫీజు రూ. 350 ఉండగా, ఈసారి జీఎస్టీ కలుపుకొని రూ. 413గా కమిటీ నిర్ణయించింది. -
ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం
తోట్లవల్లూరు: కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్టు(గుంటూరు) ఉపకార వేతనాల మంజూరుకు జిల్లాలోని ప్రతిభ కలిగిన పేద గౌడ, ఈడిగ, శెట్టిబలిజ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ట్రస్టు ఫౌండర్ చైర్మన్ డాక్టర్ ఈవీ నారాయణ తెలిపారు. టెన్త్, ఇంటర్, మెడికల్, ఇంజినీరింగ్, పార్మసీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులు సెప్టెంబర్ తొమ్మిదో తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 99858 56939, 99661 12939, 90328 98970 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.