APM
-
ఐకేపీ ఏపీఎం తొలగింపు
సీతంపేట, న్యూస్‌లైన్: నిధుల దుర్వినియోగం ఆరోపణలు రుజువు కావడంతో ఇందిర క్రాంతి పథం(ఐకేపీ) ఏపీఎంను ఉన్నతాధికారులు విధుల నుంచి తొలగించారు. ఈ మేరకు రెండు రోజుల క్రితమే ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఐటీడీ ఏ పరిధిలో మందస మండల ఏపీఎంగా పని చేస్తున్న తురక పార్వతిని విధుల నుంచి తొలగిస్తూ రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో బి.రాజశేఖర్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో కొత్తూరు మండలం దిమిలిలో పనిచేసిన పార్వతి అక్కడ సుమారు రూ.2 లక్షల మేరకు ఆరోగ్య పోషకాహర నిధులు దుర్వినియోగం చేసినట్టు విచారణలో తేలడంతో ఆమెపై వేటు వేశారు. ఈ విషయాన్ని సీతంపేట టీపీఎంయూ విభాగం ఇన్చార్జి ఏరియా కోఆర్డినేటర్ జమాన శ్రీనివాసరావు ధ్రువీకరించారు. దిమిలిలో పని చేస్తున్నప్పుడు పార్వతి అక్కడి మండల మహిళా సమాఖ్యకు చెందిన రూ.2.50 లక్షల వర కు ఆరోగ్య పోషకాహార నిధులు స్వాహాకు పా ల్పడినట్లు ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చాయి. వీటిపై అప్పటి ఐటీడీఏ పీవో సునీల్‌రాజ్‌కుమార్ విచారణకు ఆదేశిస్తూ, ఆమెను సస్పెండ్ చేశా రు. విచారణ అనంతరం సస్పెన్షన్‌ను ఎత్తివేశా రు. అప్పట్లోనే ఆమెను కొత్తూరు నుంచి మందసకు, మందసలో పనిచేస్తున్న జగదీష్‌ను కొత్తూరుకు బదిలీ చేశారు. అనంతరం స్వాహా చేసిన నిధుల్లో సు మారు రూ.50 వేల వరకు ఎం ఎంఎస్‌కు జమచేసిన పార్వతి, మిగతా రూ.2 లక్షల నిధులు మాత్రం కట్టలేదు. కాగా నిబంధనల ప్రకారం ఏపీఎంలపై చర్యలు తీసుకునే అధికారం సెర్ప్ సీఈవోకు మాత్రమే ఉంది. అయితే ఐటీడీఏ పీవో నేరుగా జోక్యం చేసుకోవడంతో ఏమీ చే యలేక సెర్ప్ అధికారులు మిన్నకుండిపోయా రు. కొద్ది రోజుల తర్వాత సెర్ప్ అధికారులే రం గంలోకి దిగి విచారణ చేయించి, నిధు లు స్వా హా నిజమేనని తేలడంతో పార్వతిని విధుల నుంచి తొలగించారు. ఈ మేరకు ఆమెకు ఉత్తర్వులు పంపించినట్టు ఇన్చార్జి ఏసీ తెలిపారు. -
ఏపీఎంపై దాడిచేసినవారి అరెస్ట్‌కు డిమాండ్
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈ నెల 25న పొందూరు ఐకేపీ ఏపీఎం సవర వెంకట్రావుపై దాడి చేసినవారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని ఐకేపీ ఉద్యోగులు బుధవారం ఆందోళనకు దిగారు. తొలుత ఎన్టీఆర్ మున్సిపల్ ఉన్నత పాఠశాల మైదానంలో సమావేశమయ్యారు.వైఎస్ఆర్ కూడలిలో మానవహారం నిర్వహించారు. అక్కడ్నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ సౌరభ్ గౌర్ అందుబాటులో లేకపోవటంతో ఏజేసీ ఆర్.ఎస్.రాజకుమార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఐకేపీ ఉద్యోగుల సంఘం ప్రనినిధులు వెంకట్రావు, వైకుంఠరావులు మాట్లాడుతూ 25న జెడ్పీ సమావేశ మందిరంలో అధికారులు, ప్రజల సమక్షంలో ఏపీఎం సవర వెంకట్రావుపై నందివాడ గ్రామ సర్పంచ్ గోపాలకృష్ణ, అతని అనుచరులు అమానుషంగా దాడి చేశారని ఆరోపించారు. పజల పక్షాన పనిచేస్తున్న ఉద్యోగులపై సర్పంచ్ రాజకీయ అండదండలతో దాడులు చేస్తున్నారన్నారు. అధికారుల సమక్షంలోనే దాడి జరిగినా రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. మండల స్థాయి ఉద్యోగులకే రక్షణ లేకపోతే గ్రామాల్లోని ఉద్యోగుల పరిస్థితేంటని ప్రశ్నించారు. గతంలో ఎచ్చెర్ల, వీరఘట్టం తదితర ప్రాంతాల్లో మండల మహిళా సమాఖ్యల ఎన్నికల్లోనూ ఐకెపీ సిబ్బందిపై దాడులు జరిగాయని గుర్తు చేశారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏసీలు, డీపీఎంలు నారాయణరావు, రాజ్‌కుమార్, జి.నారాయణరావు, రాజారావు, ఏపీఎంలు, సీసీలు, సీవీలు, వీఏవోలు, ఎన్‌పీఎం సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.