Apparel Park
-
సిరిసిల్లలో రెడీమేడ్ దుస్తుల పరిశ్రమ
సాక్షి, హైదరాబాద్: సిరిసిల్లలోని పెద్దూరు గ్రామ శివారులో 63 ఎకరాల విస్తీర్ణంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న తెలంగాణ అపారెల్ పార్కులో దుస్తుల తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు ప్రముఖ జౌళి సంస్థ టెక్స్‌పోర్ట్ ముందుకు వచ్చింది. ఈ మేరకు హైదరాబాద్‌లో శుక్రవారం మంత్రి కేటీఆర్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వేలాది మందికి ఉపాధి కల్పించడం లక్ష్యంగా వస్త్రోత్పత్తి, ఎగుమతుల కోసం బిల్ట్ టు సూట్ పద్ధతిలో దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ అపారెల్ పార్కు’ను అభివృద్ధి చేస్తోంది. కాగా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న టెక్స్‌పోర్ట్ కంపెనీ 1978 నుంచి అపారెల్ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, విదేశీ ఎగుమతులు లక్ష్యంగా రెడీమేడ్ దుస్తులను తయారు చేస్తోంది. దేశ వ్యాప్తంగా ఈ సంస్థకు 19 చోట్ల రెడీమేడ్ తయారీ ఫ్యాక్టరీలు ఉన్నాయి. రూ.620 కోట్ల వార్షికాదాయంతో ఈ సంస్థ దేశ వ్యాప్తంగా 15 వేల మందికి పైగా కార్మికులకు ఉపాధి కల్పిస్తోంది. రెండు వేల మందికి ఉపాధి ప్రస్తుత ఒప్పందం మేరకు సిరిసిల్లలోని తెలంగాణ అపారెల్ పార్కులో 7.42 ఎకరాల విస్తీర్ణంలో రూ.60 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే ఫ్యాక్టరీ ద్వారా సుమారు రెండు వేల మందికి ఉపాధి లభిస్తుంది. మంత్రి కేటీఆర్ సమక్షంలో కుదిరిన ఈ ఒప్పందంపై రాష్ట్ర చేనేత, జౌళి శాఖ కమిషనర్ శైలజ రామయ్యర్, టెక్స్‌పోర్ట్ ఎండీ నరేంద్ర డి.గోయెంకా సంతకాలు చేశారు. రాష్ట్రంలో టెక్స్టైల్ పరిశ్రమ అభివృద్ధికి, టెక్స్టైల్ రంగంలో పనిచేస్తున్న నేతన్నల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. సిరిసిల్లలోని నేతన్నల నైపుణ్యం, ఇక్కడి అవకాశాలను దృష్టిలో ఉంచుకొని అపారెల్ పార్కులో ఫ్యాక్టరీ పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నామని టెక్స్‌పోర్ట్ కంపెనీ ఎండీ గోయెంకా తెలిపారు. -
కొత్తగా ఏడు మెగా టెక్స్టైల్ పార్కులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కొత్తగా ఏడు మెగా సమీకృత టెక్స్టైల్ రీజియన్, అపెరల్ (పీఎం మిత్రా) పార్కుల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వస్త్ర రంగంలో అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పడేవిధంగా రూ.4,445 కోట్లతో వీటిని నెలకొల్పాలని నిర్ణయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ) విధానంలో ఈ పార్కులను అభివృద్ధి చేస్తాయి. ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ బుధవారం సమావేశమైంది. మెగా టెక్స్టైల్ పార్కులతో 7 లక్షల మందికి ప్రత్యక్షంగా, మరో 14 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని కేంద్రం తెలిపింది. ఆర్థిక వ్యవస్థలో వస్త్ర రంగం వాటాను మరింత పెంచడానికే మెగా సమీకృత టెక్స్టైల్ రీజియన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆసక్తి చూపిన రాష్ట్రాల్లో గ్రీన్ ఫీల్డ్/బ్రౌన్‌ఫీల్డ్ ప్రాంతాల్లో ఈ పార్కులు ఏర్పాటు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, పంజాబ్, రాజస్తాన్, గుజరాత్, అస్సాం, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు టెక్స్టైల్ పార్కుల పట్ల ఆసక్తి వ్యక్తం చేసినట్లు కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఎలాంటి వివాదాలు లేని 1,000 ఎకరాలకు పైగా భూమితోపాటు మెరుగైన మౌలిక వసతులు, పర్యావరణ వ్యవస్థ సిద్ధంగా ఉన్న రాష్ట్రాలు ప్రతిపాదనలు అందించాలని సూచించింది. అభివృద్ధి ఆధారిత పెట్టుబడి మద్దతు కింద గ్రీన్‌ఫీల్డ్‌కు గరిష్టంగా రూ.500 కోట్లు, బ్రౌన్ ఫీల్డ్‌కు గరిష్టంగా రూ.200 కోట్లు ఇవ్వనున్నారు. ప్రాజెక్టు వ్యయంలో 30 శాతాన్ని ‘పీఎం మిత్రా’ అందిస్తుంది. రూ.300 కోట్ల ప్రోత్సాహక మద్దతు ఇవ్వనుంది. ప్రైవేట్ రంగం భాగస్వామ్యంతో ప్రాజెక్టును ఆకర్షణీయంగా రూపొందించడానికి గ్యాప్ ఫండ్ సైతం అందజేయనుంది. టెక్స్టైల్ పార్కులో వర్కర్స్ హాస్టళ్లు, హౌసింగ్, లాజిస్టిక్ పార్క్, గిడ్డంగులు, వైద్య, శిక్షణ, నైపుణ్య అభివృద్ధి తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. తయారీ కార్యకలాపాల కోసం 50 శాతం భూమి, యుటిలిటీల కోసం 20 శాతం, వాణిజ్యాభివృది్ధకి 10 శాతం భూమిని వినియోగిస్తారు. నాన్–గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు బోనస్‌గా 78 రోజుల వేతనం రైల్వే ఉద్యోగులకు 2020–21 ఆర్థిక సంవత్సరంలో 78 రోజుల వేతనానికి సమానమైన ఉత్పాదకత ఆధారిత బోనస్ (పీఎల్బీ) ఇవ్వడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. దీంతో సుమారు 11.56 లక్షల మంది నాన్–గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. ఈ బోనస్‌తో ఖజానాపై రూ.1,984.73 కోట్ల మేర భారం పడనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అర్హులకు బోనస్ కింద గరిష్టంగా రూ.17,951 దక్కనుంది. -
సిరిసిల్లలో ఆపరెల్ పార్కు ఉండాలనేది ఈ ప్రాంత ప్రజల కల : కేటీఆర్
-
అపెరల్‌కు ఎసరు
చేనేతల అభ్యున్నతి కోసం అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రొద్దుటూరు సమీపంలో అపెరల్‌పార్కును ఏర్పాటు చేశారు. ఇప్పటిదాకా రూ. 5.58 కోట్ల రూపాయల మేర ఖర్చు చేశారు. అయితే ఇప్పుడు ఈ స్థలాన్ని ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణం కోసం తీసుకోవాలని భావిస్తోంది. ఇదే జరిగితే ఈ ప్రాంతంలో గార్మెంట్స్, హ్యాండ్లూమ్ పరిశ్రమల ఏర్పాటుతో చేనేతలను ఆదుకోవాలన్న వైఎస్ సంకల్పం నెరవేరకుండా పోతుంది. సాక్షి ప్రతినిధి, కడప : ప్రొద్దుటూరు పట్టణంలోని కొర్రపాడు రోడ్డులో ఏర్పాటు చేసిన అపెరల్ పార్కులో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేయకపోగా.. ఇప్పుడా స్థలంలో కొంత భాగం పేదల ఇళ్ల నిర్మాణాల కోసం కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. పవర్లూమ్, డైయింగ్, హ్యాండ్లూమ్ పరిశ్రమలతోపాటు గార్మెంట్స్ తయారీ యూనిట్ల కోసం ఈ స్థలాన్ని 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కేటాయించారు. ఆ మేరకు ఏపీఐఐసీకి బాధ్యతలు అప్పగించారు. 76.17 ఎకరాల స్థలంలో అపెరల్ పార్కు ఏర్పాటుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. 15 నుంచి 20 సెంట్ల విస్తీర్ణంలో ప్లాట్లను ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు 47 ప్లాట్లను ఏర్పాటు చేశారు. పార్కు స్థలం చుట్టూ కంచె ఏర్పాటు చేసి.. అంతర్గత రోడ్ల నిర్మాణం పూర్తి చేశారు. మరిన్ని మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది. పార్కు స్థలంపై పలువురి కన్ను... అపెరల్ పార్కు స్థలంపై పలువురు కన్నేశారు. దశాబ్ద కాలంగా పనులు ముందుకు సాగకపోవడం.. అత్యంత విలువైంది కావడంతో దానిని హస్తగతం చేసుకోవాలని బడాబాబులు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఇదివరకే ఆ స్థలాన్ని కొంతమంది ఆక్రమించడం.. ఆ ఆక్రమణలను తొలగించడానికి అధికారుల పడిన హైరానా అందరికీ తెలిసిందే. ఇప్పటికే అందులో 5 ఎకరాల స్థలాన్ని రవాణా శాఖ కార్యాలయానికి విక్రయించడం జరిగింది. అప్పుడు 71.17 ఎకరాల స్థలం మాత్రమే అపెరల్‌పార్కుకు ఉంది. ప్రణాళిక ప్రకారమే పక్కన పెట్టారు.. వాస్తవానికి అపెరల్ పార్కులో పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహికులైన పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానించాల్సిన ప్రభుత్వం దశాబ్దకాలం గడిచినా ఆ దిశగా చర్యలు చేపట్టలేదనే చెప్పాలి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించకముందు వరకు అక్కడ పరిశ్రమల ఏర్పాటుకు చకచకా పనులు జరిగాయి. ఆయన మరణించాక.. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు దీనిపై దృష్టి సారించకపోవడంతో అపెరల్ పార్కు అభివృద్ధికి నోచుకోలేదు. పైగా కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఈ స్థలం నుంచి 5 ఎకరాలను రవాణాశాఖకు కేటాయించారు. అనంతరం చంద్రబాబు ప్రభుత్వం ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకునే విషయంలో నిర్లప్తత చూపింది. ఇప్పుడు ఎన్టీఆర్ అర్బన్ పేరిట ఇళ్ల నిర్మాణం కోసం ఈ స్థలాన్ని సేకరించాలని భావిస్తోంది. ప్రతిపాదించిన మంత్రి నారాయణ.. పురపాలకశాఖ మంత్రి నారాయణ అపెరల్ పార్కు స్థలంలోని 35 ఎకరాలను ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించాలని ఏపీఐఐసీ చైర్మన్‌కు ప్రతిపాదించారు. అందుకుగాను మరోప్రాంతంలో చేనేతలకు స్థలం కేటాయిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఎకరా రూ. 69 లక్షల చొప్పున ఏపీఐఐసీ ధర నిర్ణయించింది. అయితే దీనిపై చేనేత వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చేనేతల అభ్యున్నతి కోసం కేటాయించిన పార్కు స్థలాలను పూర్తిగా వారికి కేటాయించాలంటున్నారు. అపెరల్పార్కులో ఏర్పాటు చేసే పరిశ్రమల్లో తయారయ్యే వస్త్రాలకు మార్కెటింగ్ కల్పించడంతోపాటు పెట్టుబడికి రుణసాయం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ ప్రతిపాదనలు మా దృష్టికి రాలేదు.. చేనేతలను ఆదుకునేందుకే అపెరల్ పార్కును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ స్థలానికి సంబంధించిన వ్యవహారాలన్నీ మొదటి నుంచి ఏపీఐఐసీనే చూస్తోంది. ఇప్పుడా స్థలంలో ఇంటి నిర్మాణాలకు కేటాయించాలనే ప్రతిపాదనలు మా దృష్టికి రాలేదు. అయితే చేనేతల కోసం కేటాయించిన స్థలాన్ని వారికే కేటాయిస్తాం. అయితే ఏపీఐఐసీకి మా శాఖ నుంచి రూ. 2.50 కోట్లు చెల్లించాల్సి ఉంది. అందుకోసం అక్కడ ప్లాట్లు ఏర్పాటు చేసి వాటిని విక్రయించి చెల్లించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. – జయరామయ్య, ఏడీ, చేనేత జౌళి శాఖ అభివృద్ధి కోసమే వినియోగించాలి అపెరల్ పార్కు స్థలాన్ని చేనేతల అభివృద్ధి కోసమే వినియోగించాలి. ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేనేతల దుస్థితిని చూసి 90 ఎకరాలు కేటాయించారు. ఈ ప్రభుత్వం ఆస్థలాన్ని ఇళ్ల కోసం కేటాయిస్తామని చెప్పడం చేనేతలను అవమానించినట్లే. ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఉన్నాడంటే అది చేనేతల పుణ్యమేనని టీడీపీ గుర్తు పెట్టుకోవాలి. మెండిగా ముందుకెళితే మా సత్తా ఏంటో చూపిస్తాం. – దశరథరామయ్య, చేనేత సంఘ రాష్ట్ర నాయకులు చేనేతల అభ్యున్నతికి కృషిచేయాలి చేనేత పరిశ్రమలకే అపెరల్ పార్కు స్థలం వాడాలి. కడప జిల్లాలో చిన్నతరహా, భారీ పరిశ్రమలు లేవు. ప్రధానంగా అపెరల్‌పార్కును గార్మెంట్స్ సంబంధిత పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే అనుభవజ్ఞులైన కళాకారులు అందుబాటులో లేక పోవడం, పెట్టుబడీ దారులు ముందుకు రాక పోవడంతో చేనేతల అభ్యున్నతి కోసమే 2005లో ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ కేటాయించిన స్థలంలో ఎలాంటి అభివృద్ది జరగలేదు. చేనేతల అభివృద్ధికి కృషి చేయాలి – అవ్వారు ప్రసాద్, చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ ప్రభుత్వ నిర్ణయం సరికాదు చేనేతలను అభివృద్ది చేస్తామని చెబుతున్న ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అపెరల్ పార్కు స్థలాన్ని 13 ఏళ్ల కిందట కేటాయించినా ఒక్క పరిశ్రమను కూడా నెలకొల్పలేదు. చేనేతలు పనులు లేక ఎన్నో అవస్థలు పడుతున్నారు. ఈ రోజు ఆ స్థలాన్ని ఇళ్లకు ఇస్తామంటూ ప్రకటనలు చేస్తుండటం దారుణం. – నాగరాజు, చేనేత కార్మికుడు -
మగ్గుతున్న మగ్గం బతుకులు
ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: తరాలు మారినా చేనేత కార్మికుల జీవనంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. మగ్గం గుంతల్లోనే మగ్గుతూ జీవనం సాగిస్తున్నారు. ప్రతి చేనేత కార్మికునితోపాటు ఆ ఇంటిలోని కుటుంబ సభ్యులంతా పనిచేసినా జీవనం సాగించడం దుర్భరంగా ఉంది. ప్రభుత్వాలు ఎన్ని రకాల పథకాలు అమలు చేసినా వీరిని మాత్రం ఆదుకోవడం లేదు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని చేనేత కార్మికుల కుటుంబాలకు ఉపాధిని కల్పించే నిమిత్తం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2005-06 సంవత్సరంలో అపెరల్ పార్కు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గోపవరం పంచాయతీ పరిధిలో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో 71.17 ఎకరాల భూమిని కొనుగోలు చేయడంతోపాటు రోడ్ల నిర్మాణం చేపట్టారు. ఆ తర్వాత యూనిట్ల ఏర్పాటులో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో అపెరల్ పార్కు ఏమాత్రం చేనేత కార్మికులకు ఉపయోగపడటం లేదు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో సుమారు 50వేల మంది చేనేత వర్గానికి చెందిన ఓటర్లు ఉన్నారు. దాదా పు 20వేల కుటుంబాలు ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి. చేనేత కార్మికుడు నివాసం ఉండని ప్రాంతం లేదు. ప్రతి కార్మికునిదీ రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. భార్యాభర్తలతోపాటు వారి సంతానం కూడా చేనేత కార్మికులకు చేదోడు వాదోడుగా నిలవాల్సి వస్తోం ది. ఇంత చేసినా కడుపు నిండటం గగనంగా మారింది. ఈ నేపథ్యంలో చేనేత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రొద్దుటూరులో అపెరల్ పార్కు నిర్మాణం చేపట్టాలని నిర్ణయిం చారు. ఈ ప్రాజెక్టును ఏపీఐఐసీ అధికారులకు అప్పగించడంతో వారు భూసేకరణ చేయడంతోపాటు రోడ్ల నిర్మా ణం పూర్తి చేశారు. దీనికోసం రూ.5కోట్లు ఖర్చు చేశారు. అయితే ఇంతటితోనే ప్రాజెక్టు నిర్మాణం ఆగిపోయింది. నిబంధనల ప్రకారం రోడ్లు నిర్మించిన తర్వాత రంగుల అద్దకం, శిల్క్ యూనిట్లు, టెస్టింగ్ యూనిట్లు, వస్త్రాల తయారీ, పవర్ లూమ్స్ తదితర చేనేత రంగానికి సంబంధించిన అనుబంధ యూనిట్లను ఏర్పాటు చేయాల్సి ఉం ది. అయితే వైఎస్ మరణానంతరం ఈ ప్రాజెక్టు పూర్తిగా నీరుగారిపోయింది. 2005-06లో ప్రాజెక్టు మంజూరైనా ఇంతవరకు యూనిట్ల ఏర్పాట్లు జరగలేదు. నిధుల లేమి సమస్యల కారణంగా మరింత జాప్యం జరుగుతోంది. దీంతో స్థలంలో పిచ్చిమొక్కలు మొలిచాయి. వేసిన రోడ్లు దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో అపెరల్ పార్కు నిర్మాణం పూర్తయ్యేదెప్పుడు.. తమకు ఉపాధి లభించేదెప్పుడు అని చేనేత కార్మికులు నిట్టూరుస్తున్నారు.