Appirio
-
విప్రో చేతికి మరో విదేశీ కంపెనీ, భారీ డీల్
న్యూఢిల్లీ: బెంగుళూరు చెందిన దేశంలోనే మూడవ అతిపెద్ద ఐటీసంస్థ విప్రో మరో విదేశీ కంపెనీని చేజిక్కించుకోనుంది. అమెరికాకు చెందిన క్లౌడ్ సేవల సంస్థ అప్పిరియో కొనుగోలు చేయనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అమెరికాకు చెందిన అప్పిరియో సంస్థను సుమారు రూ 3.340 కోట్లకు (500 మిలియన్ల డాలర్లు) స్వాధీనం చేసుకోనున్నట్టు చెప్పింది. పూర్తి నగదు రూపంలో ఒప్పందం జరిగిన స్వాధీనం పూర్తయితే ప్రపంచంలో అతిపెద్ద క్లౌడ్ ట్రాన్స్ఫర్మేషన్ సేవలకు, క్లౌడ్ సేవలు, డిజిటల్ ఎకానమీలో ఒక గేమ్ ఛేంజర్ అని విప్రో వెల్లడించింది. దీనికి అప్పిరియో చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్రిస్ బార్బిన్ దీనికి నేతృత్వం వహించిననట్టు అప్పిరియో ప్రకటించింది. విలియం బ్లెయిర్ అండ్ కంపెనీ ఫైనాన్షియల్ ఎడ్వైజర్ గా వ్యవహిరించిన ఈ స్వాధీనం డిశెంబర్ 31 నాటికి పూర్తికానుంది. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక ప్రపంచంలో, వినియోగదారుల అంచనాలు,అభిరుచులకు అనుగుణంగా తమ సేవలను మెరుగు పర్చాల్సిన అవసరం ఉందని విప్రో సీఈవో అబిద్ అలీ నీముచ్ వాలా తెలిపారు. ఈ విషయంలో ఆయా సంస్థలు కూడా గుర్తించిన మెలగుతున్నాయన్నారు. కాగా అమెరికాకు చెందిన అప్పిరియో 2006 లో స్థాపించబడింది. శాన్ ఫ్రాన్సిస్కో, డబ్లిన్,లండన్, టోక్యోతో సహా దేశంలో జైపూర్ లోను కార్యాలయాలున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 1250 మంది ఉద్యోగులతో ఫేస్ బుక్, ఈ-బే, కోకో కోలా తదితర కార్పొరేట్ కంపెనీలకు క్లౌడ్ సేవలందిస్తోంది. ఇంకా రాబర్ట్ హాఫ్ జాన్సన్ కంట్రోల్స్, కార్డినల్ హెల్త్, , హోం డిపో, సోనీ ప్లేస్టేషన్ అప్పీరియో ఖాతాదారులుగా ఉన్నారు. -
విప్రో చేతికి అమెరికా ‘అపిరియో’
• డీల్ విలువ రూ.3,340 కోట్లు • విప్రో కొనుగోళ్లలో ఇది రెండో అతిపెద్ద డీల్ న్యూఢిల్లీ: క్లౌడ్ సర్వీసులందజేసే అమెరికాకు చెందిన ‘అపిరియో’ సంస్థను దేశీ ఐటీ దిగ్గజం విప్రో రూ.3,340 కోట్లకు (50 కోట్ల డాలర్లు) కొనుగోలు చేసింది. కొత్త సర్వీసుల ద్వారా వృద్ధిని పెంచుకునేందుకు ఈ కంపెనీని కొనుగోలు చేసినట్లు విప్రో పేర్కొంది. విప్రో కొనుగోళ్లలో ఇదే రెండో అతి పెద్ద డీల్. పూర్తిగా నగదు చెల్లించే దీన్ని కొనుగోలు చేస్తున్నట్లు విప్రో పేర్కొంది. ఈ కొనుగోలు పూర్తయితే ప్రపంచంలోనే అతి పెద్ద క్లౌడ్ ట్రాన్స్ఫర్మేషనల్ కంపెనీల్లో ఒకటిగా అవతరిస్తామని విప్రో సీఈఓ అబిదాలి జడ్ నీముచ్వాలా చెప్పారు. ఈ కంపెనీ కొనుగోలుతో క్రౌడ్ సోర్సింగ్ మార్కెట్ ప్లేస్ టాప్కోడర్తో తమకు యాక్సెస్ ఉంటుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది డిజైనర్లు, డెవలపర్లు, డేటా సైంటిస్ట్‌లు, వినియోగదారులతో టాప్కోడర్ అనుసంధానమై ఉంది. తాము సేల్స్‌ఫోర్స్, వర్క్‌డే పేర్లతో అందిస్తున్న క్లౌడ్ అప్లికేషన్లను అపిరియో బ్రాండ్ కింద ఏకీకృతం చేస్తామని, ఉమ్మడి వ్యాపారానికి ఆప్రియో సీఈఓ క్రిస్ బార్బిన్ నేతృత్వం వహిస్తారని తెలిపారు. 2006లో కార్యకలాపాలు ప్రారంభించిన అపిరియోకు జైపూర్, శాన్ఫ్రాన్సిస్కో, డబ్లిన్, లండన్, టోక్యోల్లో కార్యాలయాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 1,250 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. గత ఏడాది ఈ కంపెనీ 20 కోట్ల డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఈ కంపెనీకి.. కోక-కోలా, ఈబే, ఫేస్బుక్, హోమ్ డిపో, సోనీ ప్లే స్టేషన్ స్ట్రైకర్, రాబర్ట్ హాఫ్, జాన్సన్ కంట్రోల్స్, కార్డినల్ హెల్త్ వంటి కంపెనీలు క్లయింట్లుగా ఉన్నాయి. కాగా డీల్ ఈ ఏడాది చివరికల్లా ముగుస్తుందని అంచనా.