న్యూఢిల్లీ: బెంగుళూరు చెందిన దేశంలోనే మూడవ అతిపెద్ద ఐటీసంస్థ విప్రో మరో విదేశీ కంపెనీని చేజిక్కించుకోనుంది. అమెరికాకు చెందిన క్లౌడ్ సేవల సంస్థ అప్పిరియో కొనుగోలు చేయనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అమెరికాకు చెందిన అప్పిరియో సంస్థను సుమారు రూ 3.340 కోట్లకు (500 మిలియన్ల డాలర్లు) స్వాధీనం చేసుకోనున్నట్టు చెప్పింది. పూర్తి నగదు రూపంలో ఒప్పందం జరిగిన స్వాధీనం పూర్తయితే ప్రపంచంలో అతిపెద్ద క్లౌడ్ ట్రాన్స్ఫర్మేషన్ సేవలకు, క్లౌడ్ సేవలు, డిజిటల్ ఎకానమీలో ఒక గేమ్ ఛేంజర్ అని విప్రో వెల్లడించింది. దీనికి అప్పిరియో చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్రిస్ బార్బిన్ దీనికి నేతృత్వం వహించిననట్టు అప్పిరియో ప్రకటించింది. విలియం బ్లెయిర్ అండ్ కంపెనీ ఫైనాన్షియల్ ఎడ్వైజర్ గా వ్యవహిరించిన ఈ స్వాధీనం డిశెంబర్ 31 నాటికి పూర్తికానుంది.
అభివృద్ధి చెందుతున్న సాంకేతిక ప్రపంచంలో, వినియోగదారుల అంచనాలు,అభిరుచులకు అనుగుణంగా తమ సేవలను మెరుగు పర్చాల్సిన అవసరం ఉందని విప్రో సీఈవో అబిద్ అలీ నీముచ్ వాలా తెలిపారు. ఈ విషయంలో ఆయా సంస్థలు కూడా గుర్తించిన మెలగుతున్నాయన్నారు.
కాగా అమెరికాకు చెందిన అప్పిరియో 2006 లో స్థాపించబడింది. శాన్ ఫ్రాన్సిస్కో, డబ్లిన్,లండన్, టోక్యోతో సహా దేశంలో జైపూర్ లోను కార్యాలయాలున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 1250 మంది ఉద్యోగులతో ఫేస్ బుక్, ఈ-బే, కోకో కోలా తదితర కార్పొరేట్ కంపెనీలకు క్లౌడ్ సేవలందిస్తోంది. ఇంకా రాబర్ట్ హాఫ్ జాన్సన్ కంట్రోల్స్, కార్డినల్ హెల్త్, , హోం డిపో, సోనీ ప్లేస్టేషన్ అప్పీరియో ఖాతాదారులుగా ఉన్నారు.
విప్రో చేతికి మరో విదేశీ కంపెనీ, భారీ డీల్
Published Fri, Oct 21 2016 12:13 PM | Last Updated on Wed, Apr 3 2019 8:42 PM
Advertisement
Advertisement