Rs. 3
-
ప్రధాని వరాల విలువ ఎంతో తెలుసా?
ముంబై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నూతన సంవత్సరం రోజు దేశ ప్రజలకు అందించిన వరాల విలువ ఏంతో తెలుసా? డీమానిటైజేషన్ తరువాత దేశ ప్రజలనుద్దేశించిన చేసిన ప్రసంగంలో ప్రధాని ప్రకటించిన పథకాల భారం సుమారు రూ.3,500 కోట్లని ఓ నివేదిక ద్వారా వెల్లడైంది. ఈ మేరకు ప్రభుత్వం అదనపు బడ్జెటరీ కేటాయింపులు చేయాల్సి ఉంటుందని తెలిపింది. నూతన సంవత్సరం సందర్భంగా ప్రకటించినమోదీ ప్రకటించిన పలు సంక్షేమ పథకాల్లో ముఖ్యంగా వ్యవసాయ రుణాలపై రూ.1,300 కోట్లు, ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు రూ.1,000కోట్లు, గర్భిణిల పథకానికి రూ.1,200 కోట్ల ఆర్ధిక భారం పడనున్నట్టు లెక్కలు వేసింది. న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్31 న బహుళ లబ్దిదారుల పథకాలను, సంక్షేమ చర్యల్ని మోదీ ప్రకటించారు. గ్రామీణులు గృహ రుణ సదుపాయం, పేద, గర్భిణీ స్త్రీలు మరియు రైతులు, వృద్ధులకు అందించిన ఈ ప్రథకాల కోసం ఆర్థిక సంవత్సరానికి రూ.3,500 కోట్లుఖర్చు కానుందని ప్రభుత్వరంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ఆఫ్ ఇండియా రీసెర్చ్ మంగళవారం నివేదించింది. చిన్నపాటి బడ్జెట్ ప్రసంగంలా సాగిన మోదీ తాజా ప్రసంగంలో గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజల కోసం నిర్మించిన ఇళ్ళు సంఖ్యను 33 శాతం పెంచారు. నూతన గృహ రుణాలు లేదా విస్తరణ కోసం రూ.2 లక్షల రుణంపై 3 శాతం వడ్డీ రాయితీ అందుకుంటారు. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద రెండు కొత్త పథకాలు ప్రకటించారు. కొత్త సంవత్సరంలో తీసుకున్న రూ.9 లక్షల రుణ శాతం 4 వడ్డీ రాయితీ,రూ. 12 లక్షల 3 శాతం వడ్డీ మాఫీ, వైద్య అవసరాల నిమిత్తం గర్భిణీలు నెలకు రూ. 6 వేలు సహాయం పొందుతారని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
జెన్ కొత్త స్మార్ట్ఫోన్ లాంచ్..ధర ఎంత?
న్యూడిల్లీ: భారత మొబైల్ తయారీదారు జెన్ మొబైల్స్ తన కొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లో విడుదల చేసింది. సినిమాక్స్ పోర్ట్ఫోలియో లో సినిమాక్స్ 2 ప్లస్ పేరుతో మరో కొత్త స్మార్ట్ ఫోను జోడించింది. దీని ధరను రూ. 3,777 గా నిర్ణయించింది. ఎస్ ఓ ఎస్ కాలింగ్ తో అత్యవసరం సమమయంలో అయిదు నెంబర్లకు లొకేషన్ డీటెయిల్స్ అందింజే ఫీచర్ తో దీన్ని లాంచ్ చేసింది. ఇది ప్రత్యేకంగా ఇ-కామర్స్ వెబ్సైట్ షాప్ క్లూస్ లో అందుబాటులో ఉంచినట్టు తెలిపింది. జెన్ మొబైల్ పరిధిని విస్తరించడం సంతోషంగా ఉందని జెన్ సినిమాక్స్ 2 ప్లస్ ప్రారంభంపై జెన్ మొబైల్స్ సీఈఓ సంజయ్ కాలిరోనా వ్యాఖ్యానించారు. షాప్ క్లూస్ తో భాగస్వామ్యం ద్వారా మరింత వినియోగదారులను సాధించనున్నట్టుతెలిపారు. ఇది కచ్చితంగా విజయవంతమవుతందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. జెన్ సినిమాక్స్ 2 ప్లస్ ఫీచర్లు డ్యూయల్ సిమ్ 5.1 లాలిపాప్ 5.5ఇంచెస్ డిస్ ప్లే 1.3 క్వాడ్ కోర్ ప్రాసెసర్ 480x854 పిక్సెల్ రిజల్యూషన్ 5 ఎంపీ రియల్ కెమెరా ఫ్లాష్ విత్ ఆటో ఫోకస్ 3.2 ఎంపీఫ్రంట్ కెమెరా 1జీబీ ర్యామ్, 8జీబీ స్టోరేజ్ 32జీబీ ఎక్స్ పాండబుల్ మొమర 2900ఎంఏహెచ్ బ్యాటరీ -
విప్రో చేతికి మరో విదేశీ కంపెనీ, భారీ డీల్
న్యూఢిల్లీ: బెంగుళూరు చెందిన దేశంలోనే మూడవ అతిపెద్ద ఐటీసంస్థ విప్రో మరో విదేశీ కంపెనీని చేజిక్కించుకోనుంది. అమెరికాకు చెందిన క్లౌడ్ సేవల సంస్థ అప్పిరియో కొనుగోలు చేయనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అమెరికాకు చెందిన అప్పిరియో సంస్థను సుమారు రూ 3.340 కోట్లకు (500 మిలియన్ల డాలర్లు) స్వాధీనం చేసుకోనున్నట్టు చెప్పింది. పూర్తి నగదు రూపంలో ఒప్పందం జరిగిన స్వాధీనం పూర్తయితే ప్రపంచంలో అతిపెద్ద క్లౌడ్ ట్రాన్స్ఫర్మేషన్ సేవలకు, క్లౌడ్ సేవలు, డిజిటల్ ఎకానమీలో ఒక గేమ్ ఛేంజర్ అని విప్రో వెల్లడించింది. దీనికి అప్పిరియో చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్రిస్ బార్బిన్ దీనికి నేతృత్వం వహించిననట్టు అప్పిరియో ప్రకటించింది. విలియం బ్లెయిర్ అండ్ కంపెనీ ఫైనాన్షియల్ ఎడ్వైజర్ గా వ్యవహిరించిన ఈ స్వాధీనం డిశెంబర్ 31 నాటికి పూర్తికానుంది. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక ప్రపంచంలో, వినియోగదారుల అంచనాలు,అభిరుచులకు అనుగుణంగా తమ సేవలను మెరుగు పర్చాల్సిన అవసరం ఉందని విప్రో సీఈవో అబిద్ అలీ నీముచ్ వాలా తెలిపారు. ఈ విషయంలో ఆయా సంస్థలు కూడా గుర్తించిన మెలగుతున్నాయన్నారు. కాగా అమెరికాకు చెందిన అప్పిరియో 2006 లో స్థాపించబడింది. శాన్ ఫ్రాన్సిస్కో, డబ్లిన్,లండన్, టోక్యోతో సహా దేశంలో జైపూర్ లోను కార్యాలయాలున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 1250 మంది ఉద్యోగులతో ఫేస్ బుక్, ఈ-బే, కోకో కోలా తదితర కార్పొరేట్ కంపెనీలకు క్లౌడ్ సేవలందిస్తోంది. ఇంకా రాబర్ట్ హాఫ్ జాన్సన్ కంట్రోల్స్, కార్డినల్ హెల్త్, , హోం డిపో, సోనీ ప్లేస్టేషన్ అప్పీరియో ఖాతాదారులుగా ఉన్నారు. -
సెల్కాన్ కొత్త మిలీనియా స్మార్ట్ఫోన్
మిలీనియా సిరీస్ పేరుతో స్మార్ట్ఫోన్లను అందుబాటులోకి తెస్తున్న సెల్కాన్ ఇపుడు మరో కొత్త బడ్జెట్ ఫోన్ ను భారత్ లో లాంచ్ చేసింది. 'మిలీనియం యూ ఫీల్' పేరుతో విడుదలైన ఈ మొబైల్ ధరను రూ. 3,299గా కంపెనీ నిర్ణయించింది. గ్యాడ్జెట్ 360 వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఆగస్టు24న అమ్మకాలు ప్రారంభమవుతాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. మిలీనియా యూ ఫీల్ ఫీచర్లు 1.2గిగా హెడ్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 1జీబీ రామ్, 8జీవీ ఇంటర్నల్ స్టోరేజ్, 32జీబీ ఎక్స్ పాండబుల్ మొమరీ 5 మెగాపిక్సెల్ ఆటో ఫోకస్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 3.2 మెగాపిక్సెల్ ముందు కెమెరా 2000ఎంఎహెచ్ బ్యాటరీ డ్యూయల్ సిమ్ తో వస్తున్న ఈ కొత్త స్మార్ట్ ఫోన్ బ్లాక్, గోల్డెన్, సిల్వర్ రంగుల్లో అందుబాటులో ఉంది. లోకాస్ట్ ఫోన్ల తయారీలో దేశీయ మొబైల్ మార్కెట్ ప్రపంచంలో కొత్త చరిత్ర సృష్టించిన సంస్థ సెల్ కాన్ స్వదేశీ పరిజ్ఞానం తో స్మార్ట్ ఫోన్ లను రూపొందిస్తోంది. ఈ కోవలోనే మిలీనియం స్మార్ట్ ఫోన్ లైన్ పవర్ క్యూ 3000, మిలీనియం ఎలైట్ క్యూ 470 రెండు రకాల మోడళ్లను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.