సెల్కాన్ కొత్త మిలీనియా స్మార్ట్ఫోన్ | Celkon Millennia Ufeel With 5-Inch Display Launched at Rs. 3,299 | Sakshi
Sakshi News home page

సెల్కాన్ కొత్త మిలీనియా స్మార్ట్ఫోన్

Published Thu, Aug 18 2016 11:23 AM | Last Updated on Mon, Sep 4 2017 9:50 AM

సెల్కాన్ కొత్త మిలీనియా స్మార్ట్ఫోన్

సెల్కాన్ కొత్త మిలీనియా స్మార్ట్ఫోన్

మిలీనియా సిరీస్ పేరుతో స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తెస్తున్న సెల్‌కాన్  ఇపుడు మరో కొత్త బడ్జెట్ ఫోన్ ను  భారత్ లో లాంచ్ చేసింది. 'మిలీనియం యూ ఫీల్'  పేరుతో  విడుదలైన ఈ మొబైల్ ధరను రూ. 3,299గా కంపెనీ నిర్ణయించింది.  గ్యాడ్జెట్ 360   వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్  చేసుకోవాలని, ఆగస్టు24న అమ్మకాలు ప్రారంభమవుతాయని కంపెనీ  ఒక ప్రకటనలో తెలిపింది.

మిలీనియా యూ ఫీల్  ఫీచర్లు
1.2గిగా హెడ్జ్  క్వాడ్-కోర్ ప్రాసెసర్,
1జీబీ రామ్, 8జీవీ ఇంటర్నల్  స్టోరేజ్,
32జీబీ ఎక్స్ పాండబుల్ మొమరీ
 5 మెగాపిక్సెల్ ఆటో ఫోకస్ రియర్ కెమెరా   విత్ ఎల్ఈడీ ఫ్లాష్
 3.2 మెగాపిక్సెల్ ముందు కెమెరా
2000ఎంఎహెచ్ బ్యాటరీ
డ్యూయల్ సిమ్ తో వస్తున్న ఈ కొత్త స్మార్ట్  ఫోన్ బ్లాక్, గోల్డెన్, సిల్వర్ రంగుల్లో అందుబాటులో ఉంది.
లోకాస్ట్ ఫోన్ల తయారీలో దేశీయ మొబైల్ మార్కెట్ ప్రపంచంలో కొత్త చరిత్ర సృష్టించిన సంస్థ  సెల్ కాన్ స్వదేశీ పరిజ్ఞానం తో స్మార్ట్ ఫోన్ లను  రూపొందిస్తోంది.   ఈ కోవలోనే మిలీనియం స్మార్ట్ ఫోన్ లైన్ పవర్ క్యూ 3000, మిలీనియం ఎలైట్ క్యూ 470 రెండు రకాల మోడళ్లను  లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement