ప్రధాని వరాల విలువ ఎంతో తెలుసా?
ముంబై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నూతన సంవత్సరం రోజు దేశ ప్రజలకు అందించిన వరాల విలువ ఏంతో తెలుసా? డీమానిటైజేషన్ తరువాత దేశ ప్రజలనుద్దేశించిన చేసిన ప్రసంగంలో ప్రధాని ప్రకటించిన పథకాల భారం సుమారు రూ.3,500 కోట్లని ఓ నివేదిక ద్వారా వెల్లడైంది. ఈ మేరకు ప్రభుత్వం అదనపు బడ్జెటరీ కేటాయింపులు చేయాల్సి ఉంటుందని తెలిపింది. నూతన సంవత్సరం సందర్భంగా ప్రకటించినమోదీ ప్రకటించిన పలు సంక్షేమ పథకాల్లో ముఖ్యంగా వ్యవసాయ రుణాలపై రూ.1,300 కోట్లు, ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు రూ.1,000కోట్లు, గర్భిణిల పథకానికి రూ.1,200 కోట్ల ఆర్ధిక భారం పడనున్నట్టు లెక్కలు వేసింది.
న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్31 న బహుళ లబ్దిదారుల పథకాలను, సంక్షేమ చర్యల్ని మోదీ ప్రకటించారు. గ్రామీణులు గృహ రుణ సదుపాయం, పేద, గర్భిణీ స్త్రీలు మరియు రైతులు, వృద్ధులకు అందించిన ఈ ప్రథకాల కోసం ఆర్థిక సంవత్సరానికి రూ.3,500 కోట్లుఖర్చు కానుందని ప్రభుత్వరంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ఆఫ్ ఇండియా రీసెర్చ్ మంగళవారం నివేదించింది.
చిన్నపాటి బడ్జెట్ ప్రసంగంలా సాగిన మోదీ తాజా ప్రసంగంలో గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజల కోసం నిర్మించిన ఇళ్ళు సంఖ్యను 33 శాతం పెంచారు. నూతన గృహ రుణాలు లేదా విస్తరణ కోసం రూ.2 లక్షల రుణంపై 3 శాతం వడ్డీ రాయితీ అందుకుంటారు. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద రెండు కొత్త పథకాలు ప్రకటించారు. కొత్త సంవత్సరంలో తీసుకున్న రూ.9 లక్షల రుణ శాతం 4 వడ్డీ రాయితీ,రూ. 12 లక్షల 3 శాతం వడ్డీ మాఫీ, వైద్య అవసరాల నిమిత్తం గర్భిణీలు నెలకు రూ. 6 వేలు సహాయం పొందుతారని ప్రకటించిన సంగతి తెలిసిందే.