అమెరికా ఈమైలేజ్ కార్పొరేషన్ లో విప్రోకు వాటా | Wipro Ventures invests in US-based Emailage Corporation | Sakshi
Sakshi News home page

అమెరికా ఈమైలేజ్ కార్పొరేషన్ లో విప్రోకు వాటా

Published Tue, Mar 15 2016 1:28 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

అమెరికా ఈమైలేజ్ కార్పొరేషన్ లో విప్రోకు వాటా - Sakshi

అమెరికా ఈమైలేజ్ కార్పొరేషన్ లో విప్రోకు వాటా

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఈమైలేజ్ కార్పొరేషన్‌లో మైనారిటీ వాటాను సాఫ్ట్‌వేర్ దిగ్గజం విప్రో కొనుగోలు చేసింది. రిస్క్ అసెస్‌మెంట్ సంబంధిత, మోసాలను అరికట్టే సొల్యూషన్లనందించే ఈ కంపెనీలో వాటాను విప్రో వెంచర్స్ ద్వారా కొనుగోలు చేశామని కంపెనీ పేర్కొంది. 5 శాతం కంటే తక్కువ వాటానే కొనుగోలు చేశామని పేర్కొన్న విప్రో  ఎంత మొత్తానికి కొనుగోలు చేసినదీ  వెల్లడించలేదు. చిన్న చిన్న స్టార్టప్‌ల్లో పెట్టుబడులు పెట్టడానికి విప్రో సంస్థ విప్రో వెంచర్స్‌ను ఏర్పాటు చేసింది. ఓపెన్ సోర్స్, బిగ్ డేటా, అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సెక్యూరిటీ వంటి అంశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోన్న స్టార్టప్‌ల్లో విప్రో వెంచర్స్ పెట్టుబడులు పెడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement