‘ఉపాధి’లో అంబుడ్స్మెన్ల పురోగతేంటి?
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ ఉపాధి హామీ పథకం మార్గదర్శకాలకు లోబడి అంబుడ్స్మెన్ల నియామకాలకు సంబంధించిన పురోగతి వివరాలను తెలపాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది. ఈ నియామకాలపై స్వరాజ్ అభియాన్ వేసిన కేసు సుప్రీంకోర్టులో వాదనకు వచ్చిన నేపథ్యంలో పురోగతి వివరాలను కోర్టుకు ఇవ్వాల్సి ఉందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్రాల కార్యదర్శులకు రాసిన లేఖలో పేర్కొంది.
వివరాలను ఈ నెల 12లోగా తెలియజేయాలని కోరింది. గ్రామీణాబివృద్ధి శాఖ గణాంకాల ప్రకారం దేశంలోని 672 జిల్లాలలో ఉపాధి హామీ పథకం అమలవుతుండగా కేవలం 216 జిల్లాలకు అంబుడ్స్మెన్ల నియామకం పూర్తయింది. తెలుగు రాష్ట్రాలలోని 44 జిల్లాల్లో అంబుడ్స్మెన్లS నియామకం ఇంకా జరగాల్సి ఉంది.