‘ఉపాధి’లో అంబుడ్స్‌మెన్ల పురోగతేంటి? | What is the progress of the Ambudsmen in 'employment'? | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’లో అంబుడ్స్‌మెన్ల పురోగతేంటి?

Published Wed, May 3 2017 1:03 AM | Last Updated on Tue, Sep 5 2017 10:13 AM

What is the progress of the Ambudsmen in 'employment'?

సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ ఉపాధి హామీ పథకం మార్గదర్శకాలకు లోబడి అంబుడ్స్‌మెన్ల నియామకాలకు సంబంధించిన పురోగతి వివరాలను తెలపాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది. ఈ నియామకాలపై స్వరాజ్‌ అభియాన్‌ వేసిన కేసు సుప్రీంకోర్టులో వాదనకు వచ్చిన నేపథ్యంలో పురోగతి వివరాలను కోర్టుకు ఇవ్వాల్సి ఉందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్రాల కార్యదర్శులకు రాసిన లేఖలో పేర్కొంది.

వివరాలను ఈ నెల 12లోగా తెలియజేయాలని కోరింది. గ్రామీణాబివృద్ధి శాఖ గణాంకాల ప్రకారం దేశంలోని 672 జిల్లాలలో ఉపాధి హామీ పథకం అమలవుతుండగా కేవలం 216 జిల్లాలకు అంబుడ్స్‌మెన్‌ల నియామకం పూర్తయింది. తెలుగు రాష్ట్రాలలోని 44 జిల్లాల్లో అంబుడ్స్‌మెన్లS నియామకం ఇంకా జరగాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement