National Employment Guarantee Scheme
-
సర్పంచ్ పైశాచికం.. కూలీ డబ్బులు అడిగిన దివ్యాంగుడిపై దాడి
మహబూబ్ నగర్: తనకు రావాల్సిన ఉపాధి హామీ కూలి డబ్బులు ఇప్పించాలని అడిగిన ఓ వికలాంగుడిని సర్పంచ్ కాలితో తన్ని దుర్భాషలాడిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. హన్వాడ మండలం ఫుల్పోనీ గ్రామంలో వికలాంగుడైన కృష్ణయ్య తనకు రావాల్సిన ఉపాధి కూలీ డబ్బులు ఇంతవరకు రాలేదని, ఆ డబ్బులు ఇప్పించాలని అధికార పార్టీ సర్పంచ్ శ్రీనివాసులును అడగడంతో ఇరువురి మధ్య మాటా మాటా పెరిగింది. ఈ క్రమంలో వికలాంగుడైన కృష్ణయ్య కుటుంబ సభ్యులు, తదితరులు ఆపే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. సర్పంచ్ శ్రీనివాసులు వికలాంగుడు కృష్ణయ్యతో పాటు అధికారులను సైతం బండ బూతులు తిడుతూ.. కాలితో తన్నాడు. ఈ సంఘటన చూసిన మరికొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాలలో షేర్ చేశారు. ఇది ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు గ్రూపులలో హల్చల్ చేస్తోంది. ఇందుకు సంబంధించి అధికారులు కేసును సుమోటోగా స్వీకరించారు. సర్పంచ్‌ను సస్పెండ్ చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. చదవండి: కూసుకుంట్లకు రూ.40లక్షల చెక్కు అందజేసిన కేసీఆర్ -
ఉపాధి హామీ పథకం రద్దుకు కేంద్రం కుట్ర.. కిషన్‌రెడ్డికి హరీశ్‌రావు లేఖ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తున్న కేంద్రం, ఇప్పుడు గ్రామీణ పేద కూలీల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నంలో ఉందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆరోపించారు. గ్రామీణ పేదలకు ఉపయోగకరంగా ఉన్న జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్రం గతనెల 18న సర్క్యులర్ జారీ చేసిందని, దాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ పథకాన్ని అవినీతి పేరుతో రద్దు చేసే కుట్రలను విరమించుకోవాలని, లేని పక్షంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ మేరకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డికి హరీశ్‌రావు మంగళవారం లేఖ రాశారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.... రూ.10వేల కోట్ల వేతనాలు పెండింగ్‌లో.. కేంద్రం కుట్ర వల్ల దేశంలోని కూలీలకు, తెలంగాణలోని 1.21 కోట్ల మంది ఉపాధి హామీ కూలీల హక్కులకు భంగం కలుగబోతోంది. దేశవ్యాప్తంగా రూ. 10వేల కోట్ల వేతనాలు పెండింగ్ ఉన్నాయని స్వయాన కేంద్ర మంత్రి ఇటీవల రాజ్యసభలో చెప్పారు. 2022–23 కేంద్ర బడ్జెట్లో ఉపాధి హమీ పథకానికి రూ. 73 వేల కోట్లే కేటాయించారు. ఇందులో 18,380 కోట్లు గతేడాది బకాయి వేతనాలకే పోగా, మిగిలిన నిధులు ఏ మూలకు సరిపోతాయి. 8 గంటలు పనిచేస్తే.. రూ. 257 ఇస్తారా? కేంద్రం జారీ చేసిన సర్క్యులర్‌లో కూలీలు ఉదయం 10లోపు ఒకసారి, సాయంత్రం 5 గంటలకోసారి ఫోటోలు దిగి అప్లోడ్ చేయాలని ఉంది. ఎండాకాలంలో 8 గంటలు పని చేయడం ఎలా సాధ్యం? ఉదయం, సాయంత్రం హాజరు తప్పనిసరి చేయడం కూలీలను అవమానించడమే. రూ.257తో నిజంగా జీవనోపాధి లభిస్తుందా? 17 ఏళ్ల నుంచి పథకం అమలవుతుంటే... కొత్త బ్యాంకు అకౌంట్లు తీయాలని కూలీలను వేధిస్తూ వేతనాలు చెల్లించడంలో కేంద్రం ఆలస్యం చేస్తోంది. కూలీలు తమ శ్రమతో దేశ సంపద పెంచుతుంటే, ఆ పథకాన్ని ఎందుకు రద్దు చేయాలనుకుంటున్నారో కేంద్ర మంత్రి సమాధానం చెప్పాలి. బీజేపీ ప్రతినిధులకు అధికారం కోసమే.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిన ఫస్ట్ రన్నరప్‌ను ఈ పర్యవేక్షణలో భాగం చేయాలని కేంద్రం ఉత్తర్వుల్లో పేర్కొన్నది. రన్నరప్ అనే పదాన్ని వాడడం ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడమే. అధికారుల పనిని ఎన్నికల్లో ఓడిన వారికి అప్పగించడంలో మతలబేంటి? ఓడిన మీ పార్టీ ప్రతినిధులకు అధికారం కట్టబెట్టేందుకే ఈ నిర్ణయమని అర్థమవుతోంది. ఉపాధి హామీ ద్వారా ఒక గ్రామంలో 20 పనులే చేపట్టాలని కేంద్రం చెప్తోంది. దీనివల్ల కూలీలకు పనులు ఎంపిక చేసుకునే అవకాశం సన్నగిల్లి, ఉపాధికి దూరమవుతారు. రాష్ట్రాన్ని దెబ్బతీసే కుట్రలో భాగంగా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తెలంగాణ బిడ్డగా మీరెలా సమర్థిస్తారు? -
సూట్‌బూట్ సర్కారు అర్థం చేసుకుంటుందా?
న్యూఢిల్లీ: కరోనా కష్టకాలంలో ఆర్థిక వ్యవస్థను వృద్ధి బాట పట్టించాలంటే జాతీయ ఉపాధి హామీ పథకానికి మరింత ఊతమివ్వడం, గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన కనీస ఆదాయ గ్యారెంటీ పథకం న్యాయ్‌ను అమలు చేయడం అత్యవసరమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేశారు. కరోనా మొదలైనప్పటి నుంచి తాము ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తెస్తూనే ఉన్నామని ఆయన అన్నారు. ఉపాధి హామీ పథకం, న్యాయ్ వంటివి కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఎంతో ఉపయోగపడతాయని, దేశవ్యాప్తంగా కార్మికులకు లాభం చేకూరుస్తుందని రాహుల్ ఒక ట్వీట్ ద్వారా తెలిపారు. (సొంత గూటికి పైలట్!) ‘‘ఈ సూట్‌బూట్ సర్కారు పేదల బాధను అర్థం చేసుకుంటుందా?’’అని విమర్శించారు. జాతీయ ఉపాధి హామీ పథకానికి ఉన్న డిమాండ్‌ను సూచించే ఓ గ్రాఫ్‌ను కూడా రాహుల్ ట్వీట్ ద్వారా పంచుకున్నారు. లాక్డౌన్ సమయంలో అన్ని జన్‌ధన్ ఖాతాల్లో రూ.7500 నేరుగా వేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా.. ఫించన్‌దారులు, పీఎం –కిసాన్ అకౌంట్‌దారులకు కూడా ఇంత మొత్తం ఇవ్వాలని కాంగ్రెస్ కోరింది. -
ఉపాధి హామీ కూలీలకు న్యాయం చేయాలి
కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా కరోనా కట్టడి కోసం లాక్డౌన్ ప్రకటించి, అందరూ ఇళ్లకే పరిమితం కావాలని హెచ్చరిస్తూనే మరోవైపు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు ఏప్రిల్ నుంచి వేగవంతం చేసింది. కూలీలు 20–25 మంది బృందాలుగా ఏర్పడి ఒకేచోట పనులు చేస్తున్నారు. భౌతికదూరాన్ని పాటించేందుకు అవ కాశం లేదు. కుటుంబ పోషణకు గత్యంతరం లేకనే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొనైనా వీరు పనులకు వెళ్లక తప్పడం లేదు. దేశ వ్యాప్తంగా ఈ పథకం కింద 13.65 కోట్ల జాబ్‌కార్డులున్న కుటుంబాలున్నాయి. తెలంగాణలో 52.46 లక్షల కుటుంబాలున్నాయి. ఉపాధి హామీ కూలీలకు ఇచ్చే రోజువారీ వేతనాన్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీలో భాగంగా రూ. 211 నుంచి రూ. 237కు నామమాత్రంగా పెంచుతూ ఈ మేరకు మార్చి 26న ప్రధానమంత్రి ప్రకటన చేశారు. రోజుకు ఏడు గంటలు పని చేస్తేనే పెరిగిన కూలి వర్తిస్తోంది. ఈ పెంపు 2020 ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తున్నట్టు ఉత్తర్వులో పేర్కొన్నారు. కానీ వాస్తవంగా తమకు రోజూ రూ. 100–150 లోపే అందుతోందని కూలీలు వాపోతున్నారు. పైగా పని ప్రదేశాలకు సుమారు 5–6 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తోంది. కనీసం రూ. 500 వరకూ చెల్లించాలని వీరు కోరుతున్నారు. పైగా వీరికి పని ప్రదేశాల్లో ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదు. వేసవి కావడంతో ఎండలు అధికంగా ఉన్న నేపథ్యంలో టెంట్ సౌకర్యం కల్పించాలి. ఏదైనా ప్రమాదం జరిగితే తక్షణ వైద్యం కోసం మెడికల్ కిట్లు, మందులు అందుబాటులో ఉంచాలి. ఇవన్నీ కల్పించాలని ఉపాధి చట్టంలో పేర్కొన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. కనీసం తాగడానికి నీటి ఏర్పాటు లేకపోవడంతో ఇంటి వద్ద నుంచే కూలీలు తెచ్చుకుంటున్నారు. రైతుబంధు పథకం లాగానే కూలీబంధు పథకం ప్రవేశపెట్టాల్సిన అవసరముంది. వ్యవసాయ, ఇతర అన్ని రకాల పనులు ఎక్కువగా కష్టపడి పని చేస్తున్న శ్రామికవర్గం ఈ కూలీలే. ఎక్కువ పేదరికం అనుభ విస్తుంది కూడా వీరే. వీరికి బీమా సౌకర్యం కల్పించాలి. పని లేని సమయంలో నెలకు రూ.7500 భృతి అందించాలి. ప్రస్తుతం సంవత్సరంలో వంద రోజులు మాత్రమే పని కల్పిస్తున్నారు. కనీసం 150–200 రోజులకు పొడిగించాలి. ఇండ్లు లేని వారికి పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వాలి. వృద్ధ కూలీలకు పెన్షన్ కల్పించాలి. గ్రామీణ ప్రాంతాలకే పరిమితమైన ఈ పథకాన్ని పట్టణ ప్రాంతాలకూ వర్తింపజేయాలి. పట్టణాల్లోనూ అత్యధిక సంఖ్యలో కూలీలున్నారు. ఏడాదిలో కొన్ని మాసాలు ఎలాంటి పనుల్లేక ఇతర ప్రాంతాలకు వలసలు పోతున్నారు. వికలాంగ కూలీలకు కూడా ఉపాధి హామీలో తీరని అన్యాయమే జరుగుతోంది. వీరితో స్థానికంగా గ్రామ శివారుల్లోనే పనులు చేయించాలి. కానీ దూర ప్రాంతాల్లో రెండు, మూడు కిలోమీటర్ల దూరంలో నున్న లోతైన కాల్వ పనులు, వారు చేయలేని పనులు చేయిస్తున్నారు. పైగా వీరు చేసే పనికి అదనంగా 40 శాతం కూలి కలిపి ఇవ్వాల్సి వుండగా, చేసిన పనికి మాత్రమే ఇస్తున్నారు. వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మానవతా దృక్పథంతో న్యాయంగా రావాల్సింది అందించాలి. రాష్ట్రంలో 7,800 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. గత 14–15 ఏళ్లనుంచి నామ మాత్రపు వేత నాలతో పని చేస్తున్నారు. వీరంతా డిగ్రీ, పీజీ చదు వుకున్నా ఉద్యోగావకాశాలు లేక ఫీల్డ్ అసిస్టెంట్లుగా చేస్తున్నారు. వారి న్యాయమైన డిమాండ్లయిన నెలకు 10 వేల రూపాయల వేతనం ఇవ్వాలనీ, ఉద్యోగ భద్రత కల్పించాలనీ మార్చి 12 నుంచి 23 వరకూ సమ్మెలో ఉన్నారు. కానీ ప్రభుత్వం వారిని నిరంకుశంగా సస్పెండ్ చేయడంతో వీధిన పడ్డారు. గతంలో చేసిన పనులకు సైతం జీతాలు నిలుపుదల చేశారు. దీంతో ప్రస్తుతం గ్రామాల్లో ఉపాధి పనులు ఫీల్డ్ అసి సెంట్లు లేకుండానే జరుగుతున్నాయి. ఆ బాధ్యతను ఎలాంటి అనుభవం లేని గ్రామ కార్యదర్శులకు బల వంతంగా అప్పజెప్పారు. ఇన్నేళ్లుగా ఎంతో కష్టపడి పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల సస్పెన్షన్ ఎత్తివేసి, వారిని ప్రభుత్వం తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి కేంద్రం కేటాయించే బడ్జెట్‌తోపాటు, ప్రతి సంవ త్సరం అదనంగా రూ. వెయ్యి కోట్లు కేటాయిస్తోంది. కొలతతో సంబంధం లేకుండా గిట్టుబాటు కూలీ లను చెల్లిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా పట్టణ ప్రాంతాలలో కూడా పనులు కల్పిస్తోంది. ఈ తరహాలో తెలంగాణ ప్రభుత్వం కూడా తగు చర్యలు చేపట్టాలి. – వ్యాసకర్త: జూలకంటి రంగారెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు -
వలసబాటలో కొలాం గిరిజనులు
ఇంద్రవెల్లి(ఖానాపూర్): భారీ వర్షాలకు పంటలు నష్టపోయి.. ఆశించిన దిగుబడి రాక.. సొంత గ్రామంలో ఉపాధి అవకాశాలు కరువై కొలాం గిరిజన కుటుంబాలు వలస బాట పట్టాయి. మహారాష్ట్రలో కూలీ పనులు వెదుక్కుంటూ వెళ్లాయి. మండలంలోని సమాక గ్రామ పంచాయతీ పరిధి పాటగూడ(కే)లో 55 కొలాం గిరిజన కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. సుమారు 300 మంది జనాభా ఉండగా.. 160 మంది ఓటర్లు ఉన్నారు. అందరూ చిన్న, సన్నకారు రైతులే.. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఖరీఫ్ సీజన్ జూన్, జూలై, ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు రైతులు సాగు చేసిన పత్తి, జొన్న, సోయా ఇతర పంటలు నష్టపోయారు. మిగిలిన పంటలు ఎదుగుదల దశలో మళ్లీ వర్షాలు లేక నష్టం వాటిల్లింది. పెట్టుబడిలో సగం కూడా వచ్చే అవకాశాలు లేకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు స్వగ్రామంలో ఉపాధి అవకాశాలు లేక కొందరు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. ఉపాధి హామీ పథకం పనులు కల్పించాల్సిన అధికారులు గ్రామాన్ని సందర్శించడం లేదు. దీంతో 20 రోజుల క్రితం గ్రామానికి చెందిన ఆత్రం లేతు, కుంరం లేతు, ఆత్రం లక్షామ, టెంక సీతారాం, కొడప ముత్తు, కొడప రాము తమ పిల్లలను బంధువుల ఇళ్లలో వదిలి మహారాష్ట్రలోని నాందేడ్ గ్రామానికి వలస వెళ్లి కూలీ పనులు చేస్తున్నారు. కనిపించని ‘ఉపాధి’ పనులు.. కరువును నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం 2005లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రారంభించింది. నిరుపేద కుటుంబాలు, కూలీలకు 100 రోజల పని దినాలు కల్పించాలని ప్రకటించింది. ప్రస్తుతం 150 రోజులపాటు ఉపాధి పనులు కల్పించాలి. కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా మండలంలోని పాటగూడ(కే) కొలాం గిరిజన గ్రామంలో ఇప్పటి వరకు ఎలాంటి ఉపాధి పనులు కల్పించలేదు. మరికొన్ని కుటుంబాలు కూడా వలస వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాయని గ్రామపెద్దలు తెలిపారు. అధికారులు దృష్టి సారించి గ్రామంలో ఉపాధి పనులు కల్పించాలని కోరుతున్నారు. -
ఉపాధి కూలీల బడిబాట
కామవరపుకోట : జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న నిరక్షరాస్యులైన కూలీలను అక్షరాస్యులను చేసే కార్యక్రమం ప్రారంభమైంది. మస్తర్లలో వేలిముద్రలు నివారించడం ద్వారా బోగస్ హాజరును నివారించేందుకు ఇది దోహదపడతుందని పలువురు భావిస్తున్నారు. మస్తర్లో వారి పేర్లను వారే చదువుకునే విధంగా, జాబ్‌కార్డుల్లోని వివరాలు, పే స్లిప్పుల్లో వారి వేతన వివరాలు ఎవరికి వారు తెలుసుకునే విధంగా చదువులేని కూలీలకు చదవటం, రాయడం, సంతంకం చేసే విధంగా అక్షరాస్యతా కార్యక్రమాన్ని చేపట్టారు. ఇది ఆరునెలల కార్యక్రమం. దీనికోసం పాఠ్యపుస్తకాలను సరఫరా చేశారు. బ్రిడ్జ్ ప్రీమియర్, పార్టు–1, పార్ట్–2లు చదవడం అయ్యాక వీరికి పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లను అందజేస్తారు. ఈ అక్షరాస్యతా కార్యక్రమం రెండు దశల్లో కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు. ప్రతి ముప్ఫై మంది నిరక్షరాస్యులకు ఒక వలంటీర్‌ను నియమిస్తారు. సంఘాల్లో చదువుకున్న మేట్లు లేదా వేజ్‌సీకర్లను వలంటీర్లుగా నియమిస్తారు. వీరికి ఎటువంటి గౌరవవేతనం లభించదు. సామాజిక సేవగా భావించి పనిచెయ్యాలి. అంతే కాకుండా ప్రతి రెండు, మూడు మండలాలకు ఒక ఉపాధ్యాయుణ్ణి ఎంఎల్‌ఒగా నియమిస్తారు. గ్రామాల్లో అనువైన చోట చదువు నేర్పుతారు. ఉపాధి హామీ పథకానికి చెందిన సిబ్బంది ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తుంటారు. జిల్లాలో మొత్తం 1,92,429 మంది నిరక్షరాస్యులైన ఉపాధి కూలీలుండగా వీరిని అక్షరా>స్యులను చేసేందుకు 2,460 కేంద్రాలను ఏర్పాటు చేసి 63,108 మంది వలంటీర్లను గుర్తించారు. -
‘ఉపాధి’లో అంబుడ్స్మెన్ల పురోగతేంటి?
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ ఉపాధి హామీ పథకం మార్గదర్శకాలకు లోబడి అంబుడ్స్మెన్ల నియామకాలకు సంబంధించిన పురోగతి వివరాలను తెలపాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది. ఈ నియామకాలపై స్వరాజ్ అభియాన్ వేసిన కేసు సుప్రీంకోర్టులో వాదనకు వచ్చిన నేపథ్యంలో పురోగతి వివరాలను కోర్టుకు ఇవ్వాల్సి ఉందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్రాల కార్యదర్శులకు రాసిన లేఖలో పేర్కొంది. వివరాలను ఈ నెల 12లోగా తెలియజేయాలని కోరింది. గ్రామీణాబివృద్ధి శాఖ గణాంకాల ప్రకారం దేశంలోని 672 జిల్లాలలో ఉపాధి హామీ పథకం అమలవుతుండగా కేవలం 216 జిల్లాలకు అంబుడ్స్మెన్ల నియామకం పూర్తయింది. తెలుగు రాష్ట్రాలలోని 44 జిల్లాల్లో అంబుడ్స్మెన్లS నియామకం ఇంకా జరగాల్సి ఉంది. -
పనిసరే.. పైసలేవీ!
► బకాయిల కోసం 12 లక్షల మంది ఉపాధి కూలీల ఎదురుచూపులు ► రెండు నెలలుగా రూ. 310 కోట్ల బకాయిలు ► కరువు కాలంలో పనుల్లేక తల్లడిల్లుతున్న పేదలు ► ఉపాధి కూడా ఆదుకోకపోవడంతో అరిగోస ► గ్రామాల్లో పథకంపై సన్నగిల్లుతున్న నమ్మకం ► డబ్బులివ్వకపోవడంతో పట్టణాలకు వలసబాట ► చట్టం ప్రకారం పనిచేసిన 15 రోజుల్లో డబ్బులివ్వాలి ► సర్కారు నిర్లక్ష్యంతో ఎక్కడా అమలుకాని నిబంధన ఈమె పేరు ఒర్సు సక్కుబాయి. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం గట్టుసింగారం. రెండు నెలల క్రితం చేసిన పనికి ఇప్పటివరకు డబ్బులు రాలేదు. ఈమెకు రూ.2,260, భర్తకు రూ.2 వేల బకాయిలు రావాలి. రెక్కాడితేగానీ డొక్కాడని ఈ కుటుంబం డబ్బులందక తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ‘‘డబ్బులిస్తే బియ్యం కొనుక్కునేటోళ్లం. అప్పు చేసి ఇంటి సామాన్లు తెచ్చుకుంటున్నాం. పైసలడిగితే రేపుమాపు అంటున్నారు’’ అని ఈమె ఆవేదన వ్యక్తం చేస్తోంది! ఈమె పేరు పెంటగాని పద్మ. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్. ఉపాధి పనులు చేసినా డబ్బులు ఇవ్వకపోవడంతో మహిళా సంఘం నుంచి అప్పు తీసుకుంది. ఇప్పుడు వాళ్లు డబ్బులు కట్టాలని అడుగుతుండడంతో తలపట్టుకుంది. ‘బయట కూడా అప్పు పుట్టడం లేదు. ఇంట్ల ఎల్లుడు కష్టమైతంది. రెండ్రోజులుగా ఒక పూట తింటే ఇంకో పూట పస్తులుంటున్నం’ అంటూ గోడు వెల్లబోసుకుంది. ...ఇది ఒకరిద్దరి గోస కాదు.. చేసిన పనికి డబ్బులందక రాష్ట్రవ్యాప్తంగా 12.72 లక్షలమంది ఉపాధి కూలీలు ఇలాగే నానా అవస్థలు పడుతున్నారు! ఎనిమిది వారాల నుంచి డబ్బులు చెల్లించకపోవడంతో పేద కుటుంబాలు పస్తులుంటున్నాయి. ఉపాధి కూలీలకు రాష్ట్ర సర్కారు గత రెండు నెలలుగా దాదాపు రూ. 310 కోట్లబకాయిలు చెల్లించాల్సి ఉంది! కరువు రక్కసి కబంధ హస్తాల్లో రాష్ట్రం బందీ అయింది. ఎటు చూసినా నెర్రెలిచ్చిన పొలాలు, అడుగంటిన చెరువులు, కుంటలు, చుక్కనీరు రాని బోర్లే దర్శనమిస్తున్నాయి. అప్పుల ఊబిలో చిక్కుకున్న చిన్న, సన్నకారు రైతులంతా రోజువారీ కూలీలుగా మారిపోయారు. ఈ కరువు కాలంలోనైనా ఆధరువుగా నిలుస్తుందనుకున్న ఉపాధి హామీ పథకం ఏ మాత్రం భరోసా ఇవ్వలేకపోతోంది. పని చూపడంలో కిందిస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం, మండుటెండల్లో పని చేసినా నెలల తరబడి అందని కూలీ, క్షేత్రస్థాయిలో అంతులేని అవినీతి.. వెరసి ఈ పథకంపై కూలీలకు నమ్మకం సడలేలా చేస్తున్నాయి. ఏ జిల్లాలోనూ ఉపాధి పనులు సవ్యంగా సాగడం లేదు. ఉన్న ఊర్లో పని కరువవడంతో తల్లీపిల్లలను వదిలి ఆలితోపాటు పట్నం పోతున్నారు రైతు కూలీలు! జిల్లా స్థాయిలో కలెక్టర్లు పూర్తిస్థాయిలో ఉపాధి పనులను పట్టించుకోవడం లేదు. బాధ్యతలన్నీ పీడీల చేతుల్లో పెట్టడంతో పనులు సమగ్రంగా అమలు కావడం లేదు. గ్రామీణ స్థాయిలో పనులు కల్పించాల్సిన ఫీల్డ్ అసిస్టెంట్లు నిర్ణీత సంఖ్య కంటే తక్కువగా ఉన్నారు. మరికొన్ని చోట్ల అవినీతికి పాల్పడిన వారిని తొలగించడం, వారి స్థానాల్లో మరొకరిని నియమించకపోవడంతోనూ క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సుప్రీం ఆగ్రహం వ్యక్తంచేసినా.. ఉపాధి హామీ నిధులు విడుదల చేయకపోవడంపై ఇటీవల సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘కరువు బారిన పడిన ప్రాంతాలకు తక్షణమే సాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది. కరువు రోజుల్లో చేసిన పనికి ఏడాది తర్వాత డబ్బులు చెల్లిస్తే ఏం లాభం? మీరు నిధులివ్వకపోతే పనిచేయడానికి ఎవరూ రారు. తమ దగ్గర డబ్బుల్లేవని రాష్ట్రాలు మొత్తుకుంటున్నాయి.. జనానికి సాయం చేద్దామని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా లేదు’’ అంటూ తీవ్రంగా స్పందించింది. ఆ తర్వాతే కేంద్రం ఇటీవల తన వంతుగా బకాయిలను విడుదల చేసింది. రాష్ట్ర సర్కారు మాత్రం ఇప్పటికీ బకాయిలను విడుదల చేయలేదు. కూలీ పెంచినా ఏం ప్రయోజనం..? ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కూలిని రూ.180 నుంచి రూ.194కు పెంచింది. అయినా ఏ మాత్రం ప్రయోజనం ఉండడం లేదు. ప్రస్తుతం సగటున రోజుకూ రూ.వంద కూడా పడడం లేదని, చేసిన పనికి నెలలుగా ఎదురుచూస్తున్నామని కూలీలు గోడు వెల్లబోసుకుంటున్నారు. కూలి పెంచినా డబ్బులు సకాలంలో ఇవ్వకపోతే ఏం ప్రయోజనమని ప్రశ్నిస్తున్నారు. కరువు మండలాల్లో ప్రభుత్వం ఇటీవల పని దినాలను 100 రోజుల నుంచి 150కి పెంచింది. అయితే అది పూర్తిస్థాయిలో అమలైతేనే ప్రయోజనం ఉంటుంది. ప్రస్తుతం కరువుతో పల్లెల్లో ఏ పని దొరకడం లేదు. దీంతో జనం కూలి తక్కువైనా ఉపాధి పనికే వెళ్తున్నారు. కానీ పని చేసినా డబ్బులు ఎప్పుడు చేతికందుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. కరువు కాలంలో పట్టెడన్నం కోసం మండుటెండలో పనిచేస్తే.. ఎప్పుడో డబ్బులిస్తే ఏం ప్రయోజనమని కూలీలు వాపోతున్నారు. ఏ వారం డబ్బులు ఆ వారమే ఇవ్వాలని కోరుతున్నారు. 15 రోజుల్లో డబ్బులు ఇవ్వాల్సిందే.. ఉపాధి హామీ చట్టం ప్రకారం ప్రతి కూలీకి పనిచేసిన15 రోజుల్లోనే కూలి డబ్బులు చెల్లించాలి. లేకుంటే అందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఈ అంశాన్ని చట్టంలో స్పష్టంగా పొందుపరిచారు. కానీ ప్రభుత్వమే నిధులు మంజూరు చేయకపోవడంతో అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు. కూలీల డబ్బులు దారిమళ్లాయా? ఉపాధి హామీ పథకంలో పని చేసిన వారికి పంపిణీ చేయాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించినట్టు తెలుస్తోంది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలకు ఈ నిధులను ఉపయోగిస్తున్నట్టు అనుమానాలున్నాయి. కేంద్రం తన వాటాగా విడుదల చేస్తున్న ఉపాధి నిధులను రాష్ట్రం ఇలా ఇతర పథకాలకు మళ్లించడంపై విమర్శలు వస్తున్నాయి. వడదెబ్బతో మరణిస్తున్న కూలీలు గత పక్షం రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. సగటున 42 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూలీలు పనిచేస్తున్నారు. ఈ క్రమంలో వడదెబ్బకు గురై ప్రాణాలు విడుస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో సుమారు 40 మంది కూలీలు చనిపోయారు. గ్రామాల్లో ఏ పని దొరక్క వృద్ధులు సైతం ఉపాధి పనులకు వెళ్తున్నారు. అలాంటివారు ఎండలకు తాళలేకపోతున్నారు. వేసవి వెళ్లాక టెంట్లు వేస్తారా? పనిచేసే చోట కూలీల కోసం టెంట్లు వేయాలి. మెడికల్ కిట్లు అందుబాటు ఉంచాలి. చిన్నపిల్లల ఆలనకు ప్రత్యేక సౌకర్యం కల్పించాలి. కానీ ఇవేవీ ఎక్కడా కనిపించడం లేదు. సగం వేసవి గడిచిన తర్వాత ప్రభుత్వం నీడ కోసం టెంట్లు కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఈ ఆదేశాలు కలెక్టర్లకు అందాయి. పనిచేసే చోట ఈ టెంట్లు వేయాలంటే కనీసం నెలన్నర సమయమైనా కావాల్సిందే! టెంట్ల కొనుగోళ్లకు కమిటీలు నియమించడం, టెండర్లు, సరఫరా ప్రక్రియ పూర్తయ్యే సరికి వేసవి వెళ్లిపోవడం ఖాయంగా కన్పిస్తోంది. అంతులేని అవినీతి.. అరకొర రికవరీ ఉపాధి హామీ పనుల్లో కూలీలకు ఎంత దక్కుతుందో తెలియదు గానీ.. ఫీల్ట్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు చాలాచోట్ల అవినీతికి పాల్పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పనిచేస్తున్న వారి సంఖ్య కన్నా ఎక్కువ మంది పేర్లు రాయడం, వారి ఖాతాల్లో డబ్బులు పడ్డాక పంచుకోవడం వంటివి చేస్తున్నారని కూలీలు చెబుతున్నారు. ఇటీవల నిర్వహిస్తున్న గ్రామసభల్లో ఈ తరహా అవినీతి వెలుగు చూస్తోంది. అయితే రికవరీ ప్రక్రియ మాత్రం నత్తనడకన సాగుతోంది. పనుల్లోంచి తీసేసిన ఫీల్డ్ అసిస్టెంట్లు తిరిగి పై అధికారులను ప్రసన్నం చేసుకుని విధుల్లో కొనసాగుతున్నారు. జిల్లాల్లో ఇదీ పరిస్థితి.. ► నల్లగొండ జిల్లాలో రెండు నెలల బకాయిలు రూ.50 కోట్లకు చేరాయి. గతంలో రోజువారీ కూలీల సంఖ్య 1.70 లక్షలు ఉండేది. ఎండల నేపథ్యంలో అది 1.24 లక్షలకు చేరింది. రెండు నెలల్లోనే ఉపాధి కూలీలు 50 వేల వరకు తగ్గిపోయారు. ► ఖమ్మం జిల్లాలో 2.50 లక్షల మందికి జాబ్ కార్డులున్నాయి. కానీ క్రియాశీలక కూలీలు 90 వేల నుంచి 96 వేల మందే. ఈ జిల్లాలో కూలీలకు రూ.35 కోట్ల వేతనం చెల్లించాల్సి ఉంది. ► మహబూబ్‌నగర్ జిల్లాలో ఎనిమిది వారాలపాటు పనిచేసిన కూలీలకు రూ.29 కోట్లు చెల్లించాల్సి ఉంది. రెండు నెలలుగా డబ్బులందక పోవడంతో కూలీలు వలస బాట పడుతున్నారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 1,14,958 మంది కూలీలు ఉపాధి పనులు చేస్తున్నారు. మార్చిలో కూలీల నమోదు 1.5 లక్షలకు చేరుకోగా ప్రస్తుతం 1.14 లక్షలకు పడిపోయింది. ► నిజామాబాద్ జిల్లాలో లక్షా 80 వేల మంది ఉపాధి పనులు చేస్తున్నారు. వీరందరికీ రూ.15.95 కోట్లు చెల్లించాల్సి ఉంది. బకాయిలు వెంటనే చెల్లించాలని రోజుకో చోట కూలీలు ఆందోళనలకు దిగుతున్నారు. ► రంగారెడ్డి జిల్లాలో 33 గ్రామీణ మండలాలుండగా.. ఇందులో 24 మండలాల్లో మాత్రమే ఉపాధి హామీ పథకం అమలవుతోంది. 1,39,851 మంది కూలీలు పనిచేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రూ.42 కోట్లు బకాయిలున్నాయి. ► కరీంనగర్ జిల్లాలో రోజుకు సగటున లక్ష మంది కూలీలు పనులకు హాజరవుతున్నారు. వీరికి మూడు నెలల నుంచి వేతనాలు రావడం లేదు. జిల్లావ్యాప్తంగా సుమారు రూ.30 కోట్ల వేతనాలు కూలీలకు చెల్లించాల్సి ఉంది. ► ఆదిలాబాద్ జిల్లాలో సుమారు 1.55 లక్షల మంది కూలీలకు ఈ ఏడాది జనవరి నుంచి డబ్బులు చెల్లించడం లేదు. ఈ బకాయిలు సుమారు రూ.64 కోట్లు ఉన్నాయి. ► మెదక్ జిల్లాలో లక్షకుపైగా కూలీలు ఉండగా వారికి ప్రభుత్వం రూ.11 కోట్ల మేర బకాయి పడింది. ► వరంగల్‌లో 1..04 లక్షల మంది కూలీలున్నారు. వీరికి రూ.32 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న ఉపాధి కూలీలు, పేరుకుపోయిన బకాయిల వివరాలివీ.. (కూలీల సంఖ్య లక్షల్లో.. బకాయిలో రూ.కోట్లలో..) జిల్లా కూలీలు బకాయిలు నల్లగొండ 1.24 50 ఖమ్మం 2.50 35 మహబూబ్‌నగర్ 1.14 29 నిజామాబాద్ 1.80 15.95 రంగారెడ్డి 1.39 42 కరీంనగర్ 1 30 ఆదిలాబాద్ 1.55 64 మెదక్ 1.06 11.40 వరంగల్ 1.04 32.6 మొత్తం 12.72 310 -
27,83,00,000
జమ్మలమడుగు: వందలు..వేలు.. లక్షలు కాదు.. ఏకంగా 27 కోట్ల 83 లక్షల రుపాయలు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనిచేసిన కూలీలకు ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం ఇది. మే 24వ తేదీ నుంచి ఉపాధి కూలీలకు డబ్బు రాలేదు. ఉపాధి పనులు చేసిన వారికి ప్రతి శనివారం ఫీల్డ్ అసిస్టెంట్లద్వారా కూలి డబ్బులు అందజేస్తారు. రాష్ట్ర విభజన నేపధ్యంలో కూలి డబ్బులు నిలిచిపోయినట్లు ఆశాఖకు చెందిన అధికారులు పేర్కొంటున్నారు. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం 2006లో ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం వర్షాలు సక్రమంగా లేకపోవడంతో రైతు కూలీలకు వ్యవసాయ పనులు లేక ఉపాధి లేకుండా పోయింది. జిల్లాలోని 50 మండలాల్లో 5 లక్షలకు పైగా ఉపాధి కూలీలు రెండు నెలలుగా పనులు చేశారు. దాదాపు 50 రోజులు కావస్తున్నా వీరికి కూలి డబ్బులు అందలేదు. జిల్లాలో ఉపాధి పనులు చేసిన కూలీలకు దాదాపు 27 కోట్ల వరకు బకాయి ఉన్నట్లు తెలుస్తోంది. తాము చేసిన పనులకు కూలి డబ్బు ఎప్పుడిస్తారంటూ కూలీలు అధికారుల చుట్టూ పోస్టాఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో ఫీల్ట్ అసిస్టెంట్లు మాత్రమే ఉపాధి పనులు చేయించుకుంటున్నారు. అధికారులు గ్రామాలకు వెళ్లడం లేదు. గ్రామాలకు వెళితే కూలిడబ్బుల కోసం తమను ఎక్కడ నిలదీస్తారోననే భయం వారిలో నెలకొంది. తమకు వెంటనే ఉపాధి కూలి డబ్బులు ఇవ్వాలని కూలీలు కోరుతున్నారు. లేని పక్షంలో కుటుంబాలను పోషించుకోవడానికి వలసలు వెళ్లాల్సి వస్తుందని వారు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. -
కాంగ్రెస్‌కు ఇవే చివరి ఎన్నికలు
జూలకంటి రంగారెడ్డి మిర్యాలగూడ, న్యూస్‌లైన్ : దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఇవే చివరి ఎన్నికలు అని ఈ విషయాన్ని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, తూడి దేవెందర్‌రెడ్డిలు మర్చిపోవద్దని స్థా నిక ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీపీఎంకు చివరి ఎన్నికలు అని చెబుతున్న వారికి దేశ, రాష్ట్ర పరిస్థితులు అర్థం కావడం లేవని ఎద్దేవ చేశారు. మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలు చాలా తెలివైన వారని, నిత్యం ప్రజాసమస్యల పట్ల స్పందించి, వాటి పరిష్కారానికి పని చేసే వారిని మరిచి పోరన్నారు.జాతీయ ఉపాధి హామీ పథకం, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు మంజూరుకు తాను ఎంతో కృషి చేసినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహకారం అందించిన వారిలో రాష్ట్రం లోనే రెండవ ఎమెల్యేగా తనకు గుర్తింపు లభించిందన్నారు. సమావేశంలో వేములపల్లి మండల కార్యదర్శి రావు ఎల్లారెడ్డి పాల్గొన్నారు. -
ఉపాధి నిధులు కొల్లగొట్టేశారు
=జరగని పనులకు చెల్లింపులు =జేసీబీతో పనులు =లంచమిస్తే బిల్లులు సిద్ధం రికవరీకి అధికారులు చర్యలు = రావుకుప్పం వుండలంలో ఇదీ పరిస్థితి కుప్పం, న్యూస్‌లైన్: వుహాత్మాగాంధీ జాతీయు ఉపాధి హా మీ పథకం నిధుల్ని రావుకుప్పం వుండల అధికారులు కొల్లగొట్టేశారు. ఇప్పటికే అనేక గ్రావూల్లో పనులపై వివుర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో బళ్ల పంచాయుతీలో జరిగిన అక్రవూలపై స్థానికులు గురువారం జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. బళ్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద భూమి చదును కోసం మొదటి విడతగా కూలీల పేరుతో రూ.21, 564లకు, ట్రాక్టరుకు వురో రూ.15,207 బి ల్లులు పెట్టారు. కానీ పనులు జేసీబీతో చేసినట్టు గ్రావుస్తులు చెబుతున్నారు. ఈనెల 9న ఫీల్డు అసిస్టెంట్ బంధువుకు చెందిన జేసీబీతో పనులు చేశారని వారంటున్నారు. చదునుగా ఉన్న పాఠశాల ప్రాంగణంలో ఉపాధి బిల్లుల కోసం అడ్డదిడ్దంగా వుట్టి పోయుడంతో వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయే పరిస్థితి తలెత్తింది. అయినా ఇక్కడ మొత్తం రూ.20 వేల లోపు ఖర్చుతో చదును చేయువచ్చని స్థాని కులు అంచనా వేస్తున్నారు. అయితే అధికారులు ఉదారంగా రూ.1,63,266 వ్యయుం అ వుతుందని లెక్కగట్టారు. గురువారం సాయుం త్రం ఈ పనిని పరిశీలించిన ఉపాధి హామీ ఏపీడీ యూస్మిన్ యుంత్రాలతో పనులు చేసినట్టు అభిప్రాయుపడ్డారు. లేని పనికి బిల్లు బళ్ల పంచాయుతీ, లక్ష్మీపురం ప్రాథమిక పాఠశాలలో వుట్టితోలి చదును చేసే పనులకు కూలీలకు రూ.21,564, ట్రాక్టరుకు రూ.17,417 బిల్లులు పెట్టారు. ఈ నెల 3 నుంచి 9 వరకు 24 వుంది కూలీలు పనులు చేసినట్టు రికార్డు సృష్టించారు. కానీ ఈ పాఠశాల వద్దకు ఒక్కపార వుట్టినీ తోలలేదు. ఈ విషయూన్ని ఆ గ్రావుస్తులు ధ్రువీకరిస్తున్నారు. గోవిందపల్లి-ఆరివూనిపెంట ప్రధాన రహదారికి దూరంగా అడవిలోని తవు ప్రాంతాన్ని ఎవ రూ పట్టించుకోరన్న ధీవూతో బిల్లులు పెట్టుకున్నారని చెబుతున్నారు. ఈ రెండు పనుల బిల్లులనూ ఈ నెల 11న విడుదల చేయుడంతో అవి పోస్టాఫీసుల నుంచి ఇంకా డ్రా కాలేదు. కూలీల పేరుతో దర్జాగా ‘ఉపాధి’లో అక్రవూల నివారణకు ఈ-వుస్టర్, బయోమెట్రిక్ విధానాలు అవులులో ఉ న్నా దర్జాగా అక్రవూలు కొనసాగుతున్నాయి. పనులకు రాని కూలీల పేరుతో వేలకు వేలు బిల్లులు పెట్టడం, బిల్లుకు వంద చొప్పున యిట్టజెప్పి మొత్తం సొయిమను కాజేయుడం ఉపాధి పనుల్లో సర్వసాధారణంగా వూరింది. తవుకు అనువుగా ఉన్న కూలీల పేరుతోనే ఈ తతంగాన్ని ఫీల్డు అసిస్టెంట్లు సాగిస్తున్నారు. అధికారులు విచారించినా ఇబ్బంది రాకుండా చూసుకుంటున్నారు. బళ్ల పంచాయతీ విషయుంలోనూ ఇలాంటి తతంగమే జరిగింది. పనులే లేకపోవడంతో అడ్డంగా దొరికిపోయూరు. పనులు చేయిచలేదని ఉన్నతాధికారులు ఒత్తిడి చేయుడంతోనే ఈ బిల్లులు పెట్టావుని, ఆయూ పనులను త్వరలోనే పూర్తి చేయిస్తావుని రావుకుప్పం వుండల ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ రవికువూర్, బళ్ల ఫీల్డు అసిస్టెంట్ శంకర్ చెప్పారు. కఠిన చర్యలు తీసుకుంటాం బళ్ల పాఠశాలకు వుట్టి తోలేందుకు జేసీ బీ వాడినట్టు పరిస్థితిని చూస్తే స్పష్టమవుతోం ది. లక్ష్మీపురంలో లేని పనులకు బిల్లులు పె ట్టడంపై విచారణ జరుపుతున్నాం. ఈ విషయూలను ఉన్నతాధికారులకు నివేధించి కఠిన చర్యలు తీసుకొంటాం. పోస్టాఫీసు ల్లో బిల్లులు చెల్లించకుండా కట్టడి చేసి, మొత్తం సొయిమను రికవరీ చేస్తాం. -యూస్మిన్, ఉపాధిహామీ ఏపీడీ, కుప్పం