ఉపాధి నిధులు కొల్లగొట్టేశారు | Work unlike any payments | Sakshi
Sakshi News home page

ఉపాధి నిధులు కొల్లగొట్టేశారు

Published Fri, Oct 18 2013 2:36 AM | Last Updated on Fri, Sep 1 2017 11:44 PM

Work unlike any payments

 

=జరగని పనులకు చెల్లింపులు
 =జేసీబీతో పనులు
 =లంచమిస్తే బిల్లులు సిద్ధం రికవరీకి అధికారులు చర్యలు
= రావుకుప్పం వుండలంలో ఇదీ పరిస్థితి

 
కుప్పం, న్యూస్‌లైన్: వుహాత్మాగాంధీ జాతీయు ఉపాధి హా మీ పథకం నిధుల్ని రావుకుప్పం వుండల అధికారులు కొల్లగొట్టేశారు. ఇప్పటికే అనేక గ్రావూల్లో పనులపై వివుర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో బళ్ల పంచాయుతీలో జరిగిన అక్రవూలపై స్థానికులు గురువారం జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. బళ్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద భూమి చదును కోసం మొదటి విడతగా కూలీల పేరుతో రూ.21, 564లకు, ట్రాక్టరుకు వురో రూ.15,207 బి ల్లులు పెట్టారు. కానీ పనులు జేసీబీతో చేసినట్టు గ్రావుస్తులు చెబుతున్నారు.

ఈనెల 9న ఫీల్డు అసిస్టెంట్ బంధువుకు చెందిన జేసీబీతో పనులు చేశారని వారంటున్నారు. చదునుగా ఉన్న పాఠశాల ప్రాంగణంలో ఉపాధి బిల్లుల కోసం అడ్డదిడ్దంగా వుట్టి పోయుడంతో వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయే పరిస్థితి తలెత్తింది. అయినా ఇక్కడ మొత్తం రూ.20 వేల లోపు ఖర్చుతో చదును చేయువచ్చని స్థాని కులు అంచనా వేస్తున్నారు. అయితే అధికారులు ఉదారంగా రూ.1,63,266 వ్యయుం అ వుతుందని లెక్కగట్టారు. గురువారం సాయుం త్రం ఈ పనిని పరిశీలించిన ఉపాధి హామీ ఏపీడీ యూస్మిన్ యుంత్రాలతో పనులు చేసినట్టు అభిప్రాయుపడ్డారు.

 లేని పనికి బిల్లు

 బళ్ల పంచాయుతీ, లక్ష్మీపురం ప్రాథమిక పాఠశాలలో వుట్టితోలి చదును చేసే పనులకు కూలీలకు రూ.21,564, ట్రాక్టరుకు రూ.17,417 బిల్లులు పెట్టారు. ఈ నెల 3 నుంచి 9 వరకు 24 వుంది కూలీలు పనులు చేసినట్టు రికార్డు సృష్టించారు. కానీ ఈ పాఠశాల వద్దకు ఒక్కపార వుట్టినీ తోలలేదు. ఈ విషయూన్ని ఆ గ్రావుస్తులు ధ్రువీకరిస్తున్నారు. గోవిందపల్లి-ఆరివూనిపెంట ప్రధాన రహదారికి దూరంగా అడవిలోని తవు ప్రాంతాన్ని ఎవ రూ పట్టించుకోరన్న ధీవూతో బిల్లులు పెట్టుకున్నారని చెబుతున్నారు. ఈ రెండు పనుల బిల్లులనూ ఈ నెల 11న విడుదల చేయుడంతో అవి పోస్టాఫీసుల నుంచి ఇంకా డ్రా కాలేదు.
 
 కూలీల పేరుతో దర్జాగా

 ‘ఉపాధి’లో అక్రవూల నివారణకు ఈ-వుస్టర్, బయోమెట్రిక్ విధానాలు అవులులో ఉ న్నా దర్జాగా అక్రవూలు కొనసాగుతున్నాయి. పనులకు రాని కూలీల పేరుతో వేలకు వేలు బిల్లులు పెట్టడం, బిల్లుకు వంద చొప్పున యిట్టజెప్పి మొత్తం సొయిమను కాజేయుడం ఉపాధి పనుల్లో సర్వసాధారణంగా వూరింది. తవుకు అనువుగా ఉన్న కూలీల పేరుతోనే ఈ తతంగాన్ని ఫీల్డు అసిస్టెంట్లు సాగిస్తున్నారు. అధికారులు విచారించినా ఇబ్బంది రాకుండా చూసుకుంటున్నారు. బళ్ల పంచాయతీ విషయుంలోనూ ఇలాంటి తతంగమే జరిగింది. పనులే లేకపోవడంతో అడ్డంగా దొరికిపోయూరు. పనులు చేయిచలేదని ఉన్నతాధికారులు ఒత్తిడి చేయుడంతోనే ఈ బిల్లులు పెట్టావుని, ఆయూ పనులను త్వరలోనే పూర్తి చేయిస్తావుని రావుకుప్పం వుండల ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ రవికువూర్, బళ్ల ఫీల్డు అసిస్టెంట్ శంకర్ చెప్పారు.
 
 కఠిన చర్యలు తీసుకుంటాం
 బళ్ల  పాఠశాలకు వుట్టి తోలేందుకు జేసీ బీ వాడినట్టు పరిస్థితిని చూస్తే స్పష్టమవుతోం ది. లక్ష్మీపురంలో లేని పనులకు బిల్లులు పె ట్టడంపై విచారణ జరుపుతున్నాం. ఈ విషయూలను ఉన్నతాధికారులకు నివేధించి కఠిన చర్యలు తీసుకొంటాం. పోస్టాఫీసు ల్లో బిల్లులు చెల్లించకుండా కట్టడి చేసి, మొత్తం సొయిమను రికవరీ చేస్తాం.
 -యూస్మిన్, ఉపాధిహామీ ఏపీడీ, కుప్పం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement