pancayuti
-
కొన్ని ఉద్యోగాలు.. ఎన్నో దరఖాస్తులు
=ఇదీ... పంచాయతీ కార్యదర్శుల పోస్టుల పరిస్థితి =ఏజెన్సీలో మాత్రమే 21ఖాళీలు =20 వేలకు పైగా అందిన దరఖాస్తులు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : పంచాయతీ కార్యదర్శుల భర్తీ విషయమై ఆశలు పెట్టుకున్న నిరుద్యోగులకు పెద్దగా ఒనగూరే ప్రయోజనం కనిపించడం లేదు. అధికారులు ప్రకటించిన ఖాళీలే కాకుండా పొందుపర్చిన నిబంధనలు దీనిని స్పష్టం చేస్తున్నాయి. ముందు నుంచి చెబుతున్నట్లుగానే ఇది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేసేందుకు చేపట్టిన ప్రక్రియగానే తెలుస్తోంది. అయితే ప్రభుత్వం ముందుచూపు లేకుండా తీసుకున్న చర్యల వల్ల కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా పూర్తిస్థాయిలో న్యాయం జరిగే అవకాశం కనిపించడం లేదు. ఏజెన్సీ ప్రాంతం, రిజర్వేషన్, రోస్టల్ విధానం, వెయిటేజీ ఇవ్వడం వంటి విషయంలో ప్రత్యేకంగా నిబంధనలు రూపొందించక పోవడం దీనికి కారణంగా కనిపిస్తోంది. ఖాళీల కంటే కాంట్రాక్టు ఉద్యోగులే ఎక్కువ ప్రభుత్వం చెబుతున్న ప్రకారం కాంట్రాక్టు కార్యదర్శులందరూ 25మార్కుల వెయిటేజీతో రెగ్యులర్ అవుతారనుకుంటే... నాన్ ఏజెన్సీ ప్రాంతంలో అధికారులు చూపిస్తున్న ఖాళీల కన్నా కాంట్రాక్టు కార్యదర్శులు పది మంది ఎక్కువగా ఉన్నారు. జిల్లాలో మొత్తం 962పంచాయతీలు ఉండగా, వీటిలో గతంలో రెండుసార్లు కాంట్రాక్టు ద్వారా కార్యదర్శులను తీసుకున్నారు. మొత్తం 135 మందిని నియమించగా, మధ్యలో 11మంది ఉద్యోగాలు వదిలేశారు. దీంతో ప్రస్తుతం 124మందే కొనసాగుతున్నారు. కాగా, కాంట్రాక్టు ఉద్యోగులను నేరుగా రెగ్యులర్ చేసేందుకు నిబంధనలు అడ్డొస్తాయనే భావనతో ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్ అధికారులు వారికి 25మార్కులు వెయిటేజీ ఇస్తామని ప్రకటించారు. ఇక ఖాళీల విషయం పరిశీలిస్తే... మొత్తం 135 పోస్టులకు 29పోస్టులు ఏజెన్సీ ప్రాంత పంచాయతీల్లో ఉన్నాయి. ఈ పోస్టులకు ఏజెన్సీ ప్రాంతంలోని 80 గ్రామపంచాయితీల్లో ఉండేవారే అర్హులవుతుండగా, ఇప్పటికే ఎనిమిది మంది కాంట్రాక్టు కార్యదర్శులు పనిచేస్తున్నారు. వీరికి వెయిటేజీ కలిసొచ్చి రెగ్యులర్ అయితే 21 పోస్టులు మాత్రమే ఏజెన్సీ ప్రాంతంలో ఖాళీగా ఉన్నట్లు భావించాలి. ఇక నాన్ ఏజెన్సీ ప్రాంతంలో 882పంచాయతీలు ఉండగా, 106పోస్టులు ఖాళీలు ఉన్నట్లు అధికారులు చూపారు. ఇక్కడ కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న వారు 116 ఉండగా, వెయిటేజీ ఎలా ఉన్న ఉన్న పోస్టులన్నీ వీరితోనే భర్తీ చేసినా పది మందికి తక్కువ పడతాయి. దీంతో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా కనిపించడం లేదు. కొత్త వారికి మెరిట్‌తో అవకాశం పంచాయతీ కార్యదర్శుల పోస్టులు 135 భర్తీ చేస్తామని అధికారులు చెప్పగా అభ్యర్థులు ఆశగా దరఖాస్తు చేసుకున్నారు. అయితే, డిగ్రీ మెరిట్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నందున 80శాతానికి పైగా మార్కులు సాధించిన వారు కొంత ఆశ పెట్టుకోవచ్చు. కానీ ప్రస్తుతం 90శాతానికి పైగా మార్కులు వచ్చిన వారు కూడా దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో కాంట్రాక్టు ఉద్యోగులు కలవరానికి గురవుతున్నారు. దీంతో నాన్ఏజెన్సీలో ఉన్న 106 పోస్టుల్లో ఎక్కువ మార్కులు ఉన్న వారు కాంట్రాక్టు ఉద్యోగుల కన్నా ముందుగానే సీటు ఖరారు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. కాగా, ఉన్న 135 పోస్టుల్లో రోస్టర్ విధానం అమలు చేయడం వల్ల మరికొందరు కాంట్రాక్టు ఉద్యోగులకు నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. అయితే, వారి కాంట్రాక్టు కాలపరిమితి మరో ఐదు నెలలు ఉన్నందున, మరికొంత కాలం ఖాళీ పోస్టుల్లో వారిని కొనసాగించే అవకాశముంది. ఐదు గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ కలెక్టరేట్లోని డీపీఓ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఐదు గంటల వరకు అభ్యర్థులు దరఖాస్తులు అందజేశారు. ఆన్లైన్లో 30వేల మంది వరకు దరఖాస్తు చేసుకున్నా డీడీలతో నేరుగా కార్యాలయంలో 20వేల మంది మాత్రమే అందజేశారని అధికారులు తెలిపా రు. దీంతో వీరి దరఖాస్తులనే పరిగణనలోకి తీసుకుంటారు. త్వరలో దర ఖాస్తుల పరిశీలన పూర్తిచేసి మెరిట్ ఆధారంగా ఒక్కో పోస్టుకు ఇద్దరు అభ్యర్థుల చొప్పున జాబితా రూపొంది స్తామని డీపీఓ ఈఎస్.నాయక్ తెలిపారు. అ భ్యర్థుల పత్రాలు పూర్తిస్థాయిలో పరిశీలించి ని ర్ధారణ అనంతరం అర్హులైన వారికి నియామక పత్రాలు అందజేస్తామని వివరించారు. కాగా, ఏజెన్సీ సర్టిఫికెట్ల విషయంలో మరింత జాగ్రత్త గా వ్యవహరిస్తామని ఆయన తెలిపారు. -
పంచాయతీ నిధులపై ఆంక్షలు లేవు
=హెల్త్ కార్డులకు ఆన్లైన్లోనే దరఖాస్తు =జిల్లాలో ఎనిమిది కొత్త భవనాలకు ప్రతిపాదనలు =ఇకపై అన్ని బిల్లులూ ఆన్లైన్లోనే =ట్రెజరీస్ డెప్యూటీ డెరైక్టర్ పాళేశ్వరరావ్ పలమనేరు, న్యూస్‌లైన్ : జిల్లాలోని పంచాయతీలకు విడుదలైన నిధులపై ఎలాంటి ఆంక్షలు, పరిమితులు లేవని ట్రెజరీస్ డెప్యూటీ డెరైక్టర్ పాళేశ్వరరావ్ తెలిపారు. గురువారం పలమనేరులోని సబ్‌ట్రెజరీ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి వచ్చిన నిధులను అందుబాటులో ఉంచామన్నారు. గ్రీన్‌చానెల్ అమలు లో ఉన్నందున జిల్లాలోని సంక్షేమ రంగానికి ముందస్తు బడ్జెట్ సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. హెల్త్‌కా ర్డులకు సంబంధించి సంబంధిత శాఖల్లోని డ్రాయింగ్ అథారిటీల ద్వారా ధ్రువీకరణ పూర్తయ్యాక ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. వివరాలన్నీ సక్రమంగా ఉంటే తొలుత తాత్కాలిక కార్డు, ఆపై శాశ్వత ఐడీ కార్డులను మంజూరు చేస్తామని తెలిపారు. పెన్షనర్లకు మాత్రం డ్రాయింగ్ అథారిటీగా సంబంధిత ఎస్టీవోలే వ్యవహరిస్తారని చెప్పారు. హెల్త్‌కార్డులకు నిర్ణీత గడువేదీ లేదని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన ప్రీమియం, కేటగిరిల వివరాలు జనవరిలోపు ప్రభుత్వం నిర్ణయిస్తుందన్నారు. జిల్లాలోని పాకాల, పీలేరు, నగిరి, బంగారుపాళ్యం, తంబళ్లపల్లె, తొట్టంబేడుల్లో ఎస్టీవో కార్యాలయాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయని, పలమనేరు, కుప్పంలలో ప్రభుత్వ భవనాలున్నా అవి కాలం చెల్లిపోయాయని తెలిపారు. మొత్తం మీద ఎనిమిది చోట్ల నూతన భవనాలకు ప్రతిపాదనలు పంపామన్నారు. అన్ని బిల్లులూ ఈ నెల నుంచి ఆన్లైన్లోనే పెడతామని తెలిపారు. ప్రతి నెలా 20 నుంచి 25 తేదీల్లోపు బిల్లులను ఆన్లైన్లో పెట్టుకోవాలని ఆయన సూచించారు. -
‘రెగ్యులర్’పై అయోమయం
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో కాంట్రాక్టు పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేసేందుకు ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శుల నియామకాన్ని చేపడుతోంది. రెగ్యులర్ కార్యదర్శులుగా అర్హత సాధించలేకపోతే తమ పరిస్థితి ఏమిటన్నది కాంట్రాక్టు కార్యదర్శులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం డిగ్రీ పూర్తిచేసిన వారందరూ కాంట్రాక్టు కార్యదర్శుల పోస్టులకు దర ఖాస్తు చేసుకునేందుకు అర్హులని ప్రభుత్వం ప్రకటిం చింది. డిగ్రీ మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తామని చెబుతున్న నేపథ్యం లో ఉన్నవారికి వెయిటే జీ ఇచ్చినా మెరిట్ రాకపోతే ఎలా అన్న ప్రశ్నలు అయోమయానికి గురిచేస్తున్నాయి. డిగ్రీలో 100 శాతం మార్కులు ఉంటే నియామకాల్లో 75 శాతం వెయిటేజీగా లెక్కిస్తారు. ఇప్పటికే కార్యదర్శులుగా కొనసాగుతున్న వారికి 25 శాతం అదనపు వెయిటేజీ ఇస్తారు. ఉదాహర ణకు ప్రస్తుతం కాంట్రాక్టు పద్ధతి లో పనిచేస్తున్న కార్యదర్శి 50 శాతం మార్కుల తో డిగ్రీ పాసై ఉన్నాడనుకుందాం. సాధారణ వెయిటేజీ కింద అందరితోపాటు 37 మార్కు లు వరకు వస్తాయి. ఇన్‌సర్వీస్ వెయిటేజీ కింద ప్రభుత్వం మరో 25 మార్కులు కలుపుతుంది. దీంతో అతడికి మొత్తం 62 మార్కులు వ స్తాయి. తనతో పోటీ పడే అభ్యర్థి డిగ్రీలో 90 శా తం మార్కులు సాధిస్తే అతడికి మార్కుల ద్వా రా వచ్చే వెయిటేజీ 67 శాతం వరకు ఉంటుం ది. దీంతో కాంట్రాక్టు వారిని పక్కన పెట్టి మా ర్కుల ఆధారంగా వెయిటేజీ ఉన్నవారికి ఉద్యో గం ఇవ్వాల్సిందే. ఈ లెక్కన కాంట్రాక్టు కార్యదర్శులను రెగ్యులర్ చేయడం అనేది అంత సుల భం కాదని స్పష్టమవుతోంది. అంతేకాకుండా ప్రస్తుతం చేపడుతున్న రెగ్యులర్ కార్యదర్శుల నియామకాల్లో రిజర్వేషన్, రోస్టర్ విధానం తప్పక పాటించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఉన్నవారందరికీ పోస్టులు సరిపోతే రోస్టర్ ప్రకారం ఖాళీలు ఉంటాయా లేవా అన్న విషయంపై ఇంకా అధికారులకు స్పష్టత రాలేదు. 124 మంది కార్యదర్శులు.. జిల్లాలో కాంట్రాక్టు పద్ధతిలో 124 మంది పనిచేస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం వీరి కి సరిపడా విద్యార్హతలు లేవు. కనీసం 20 మం ది వరకు డిగ్రీలో అత్తెసరు మార్కులతో పాసై ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రకటించిన 135 పోస్టుల్లో పోటీపడటం అంటే అంత ఆషామాషీ కాదు. ఒకవేళ వెయిటేజీ సరిపోక రెగ్యుల ర్ పోస్టుల్లో నియామకం కానివారి సంగతి ఇం కా తేలలేదు. కాంట్రాక్టు కార్యదర్శుల కాలం పొడిగింపు.. ప్రస్తుతం జిల్లాలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్యదర్శుల కాలాన్ని ప్రభుత్వం గత నెలలో పొడిగించింది. ఈసారి ఆరు నెలలకే రెన్యూవల్ చేసింది. ఆ తర్వాతనే అసలు సమస్య ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే అప్పటికీ రెగ్యులర్ పోస్టుల్లో భర్తీ కాకుండా మిగిలిన వారికి మళ్లీ రెన్యూవల్ చేసి కాంట్రాక్టు కొనసాగిస్తారా... లేదా అన్నది తేలాల్సి ఉంది. జిల్లాలో 962 గ్రామ పంచాయతీలకు 350 మంది మాత్రమే కార్యదర్శులు ఉన్నారు. ఇప్పుడు 135 మంది రెగ్యులర్ ఉద్యోగులు వచ్చినా ఇంకా ఖాళీలుం టాయి. కాబట్టి ప్రభుత్వ నిర్ణయం కూడా వీరికి అనుకూలంగా ఉండొచ్చని ఆశిస్తున్నారు. నిబంధనల కారణంగా కాంట్రాక్టు వారు రెగ్యులర్ కార్యదర్శులుగా మారే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. త్వరలో కార్యదర్శుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని అధికారులు ప్రకటించిన నేపథ్యంలో వచ్చే దరఖాస్తులు, అభ్యర్థుల మెరిట్‌పై ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టు కార్యదర్శుల భవితవ్యం ఆధారపడి ఉంది. -
పండ్ల తోటలపై.. ఇసుక గద్దలు
=సజేఎస్ఎఫ్ భూముల లీజు =మామిడి చెట్ల నరికివేత =8 మీటర్ల లోతు తవ్వి ఇసుక తరలింపు =మామూళ్ల మత్తులో మైన్స్, రెవెన్యూ తిరుపతి రూరల్ (చంద్రగిరి), న్యూస్‌లైన్: మూడు దశాబ్దాల క్రితం దళితులను ఆదుకోవడం కోసం ప్రభుత్వం సీజేఎస్‌ఎఫ్ పథకాన్ని ప్రవే శపెట్టింది. పది కుటుంబాలను ఒక సొసైటీగా ఏర్పాటు చేసి 30 ఎకరాల భూమిని కేటాయించింది. ఇందులో మామిడిచెట్లు పెంచుకుని ఫలసాయంతో బతకమని చెప్పింది. వారికి పంటపైన తప్ప భూమిపైన హక్కు ఉండదు. 30 ఎకరాల భూమి ఆర్డీవో పేరుపైన ఉంటుంది. ఈ పథకంతో దళితులు సంతోషించారు. 1979లో సొసైటీలుగా ఏర్ప డి భూములను పొందారు. మామిడిచెట్లను నాటుకున్నారు. ఫలసాయం అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి రూరల్ మండలం చిగురువాడ పంచాయతీలో సీజేఎస్‌ఎఫ్ (కమ్యూనిటీ జాయింట్ ఫార్మింగ్ సొసైటీ) కింద స్వర్ణముఖినది పక్కన 10 కుటుంబాలకు 30 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఈ భూమిలో మామిడి తోట ఉంది. ఇందులో ఇసుక కూడా బాగుంది. దీనిపై ఇసుకాసురుల కన్ను పడింది. దళితులకు ఎర వేశారు. ఇసుకాసురుల మాయలో పడిన దళితులను ఆర్డీవో పేరుపైన ఉన్న ఆ భూమిని ఎకరం 12 లక్షల చొప్పున అనధికారికంగా లీజుకు ఇచ్చేశారు. దీంతో 20 అడుగుల ఎత్తున్న మామిడి చెట్లు, 50 అడుగుల ఎత్తున్న తాటి చెట్లు, వేత, మర్రి తదితర చెట్లను నేలమట్టం చేసి ఇసుకను లోడేస్తున్నారు. ఈ భూముల్లో 5 నుంచి 8 మీటర్ల లోతువరకు ఇసుకను తవ్వేశారు. వాల్టా చట్టం కింద వీరిపై చర్యలు తీసుకునే వీలున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. పస్తుతం ఇక్కడ 20 ఎకరాల్లో మామిడి చెట్లు మాయమై గుంతలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇక్కడ రోజుకు 500 ట్రిప్పుల ఇసుకను తరలిస్తున్నారని సమాచారం. ట్రాక్టర్ ఇసుక వెయ్యి, రెండు వేలు దళితుల నుంచి అక్రమంగా కొనుగోలు చేసిన భూముల్లోంచి తవ్విన ఇసుకను మూడు రకాలుగా విక్రయిస్తున్నారు. ట్రాక్టర్ ఇసుక రకాన్నిబట్టి వెయ్యి నుంచి రెండు వేల రూపాయల వరకు అమ్ముకొంటున్నారు. ఎకరం రూ.12 లక్షలకు కొని అందులోంచి 20 లక్షల నుంచి 25 లక్షలు వరకు ఇసుక అమ్మకంద్వారా లబ్ధిపొందుతున్నారు. ముందు ఇసుకను అమ్మిన తరువాతే డబ్బు ఇస్తున్నారని సమాచారం. మామూళ్ల మత్తులో అధికారులు ఆర్డీవో పేరిట దళితులకు కేటాయించిన ప్రభు త్వ భూముల్లో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా మైనింగ్, రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవడం లేదు. వీరంతా మా మూళ్ల మత్తులో జోగుతున్నానే విమర్శలున్నాయి. అధికారులు, కాంగ్రెస్ పెద్దల అండ ఉండడంతో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. ఈ భూమిలోని భారీ వృక్షాలను జేసీబీల సాయంలో కులదోస్తున్నా అధికారులెవ్వరూ పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. తప్పుడు నివేదికలు ఇసుక అక్రమాలపై జిల్లా అధికారులు నివేది కలు కోరినప్పుడు స్థానిక అధికారులు తప్పు డు నివేదికలు ఇస్తున్నారని రెవెన్యూలోని కొం దరు ఆరోపిస్తున్నారు. కలెక్టర్ వచ్చి నేరుగా పరిశీలిస్తే తప్ప అక్రమాలపై చర్యలు తీసుకునే పరిస్థితి కనిపించడంలేదు. త్వరలో క్రిమినల్ కేసులు ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వారిపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు చర్యలు చేపట్టాం. సీజేఎఫ్ఎస్ కింద ఇచ్చిన భూముల్లో ఇసుకను అమ్ముకునే అధికారం ఎవ్వరికీ లేదు. ఆర్డీవో పేరుమీద పట్టాలు ఉంటాయి. వీరు కేవలం పంటను అమ్ముకునేందుకే అర్హులు. మిగిలి ఉన్న 10 ఎకరాల్లో ఇసుక తరలింపును అడ్డుకునేందుకు చర్యలు చేపట్టాం. కలెక్టర్, ఇతర అధికారులకు ఇచ్చే నివేదికలో నిజాలు ఉండవనడం అవాస్తవం. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడమొక్కటే మా పనికాదు కదా. అన్నీ చూసుకోవాలి. - వెంకటరమణ, తహశీల్దార్, తిరుపతి రూరల్ మండలం -
ఉపాధి నిధులు కొల్లగొట్టేశారు
=జరగని పనులకు చెల్లింపులు =జేసీబీతో పనులు =లంచమిస్తే బిల్లులు సిద్ధం రికవరీకి అధికారులు చర్యలు = రావుకుప్పం వుండలంలో ఇదీ పరిస్థితి కుప్పం, న్యూస్‌లైన్: వుహాత్మాగాంధీ జాతీయు ఉపాధి హా మీ పథకం నిధుల్ని రావుకుప్పం వుండల అధికారులు కొల్లగొట్టేశారు. ఇప్పటికే అనేక గ్రావూల్లో పనులపై వివుర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో బళ్ల పంచాయుతీలో జరిగిన అక్రవూలపై స్థానికులు గురువారం జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. బళ్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద భూమి చదును కోసం మొదటి విడతగా కూలీల పేరుతో రూ.21, 564లకు, ట్రాక్టరుకు వురో రూ.15,207 బి ల్లులు పెట్టారు. కానీ పనులు జేసీబీతో చేసినట్టు గ్రావుస్తులు చెబుతున్నారు. ఈనెల 9న ఫీల్డు అసిస్టెంట్ బంధువుకు చెందిన జేసీబీతో పనులు చేశారని వారంటున్నారు. చదునుగా ఉన్న పాఠశాల ప్రాంగణంలో ఉపాధి బిల్లుల కోసం అడ్డదిడ్దంగా వుట్టి పోయుడంతో వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయే పరిస్థితి తలెత్తింది. అయినా ఇక్కడ మొత్తం రూ.20 వేల లోపు ఖర్చుతో చదును చేయువచ్చని స్థాని కులు అంచనా వేస్తున్నారు. అయితే అధికారులు ఉదారంగా రూ.1,63,266 వ్యయుం అ వుతుందని లెక్కగట్టారు. గురువారం సాయుం త్రం ఈ పనిని పరిశీలించిన ఉపాధి హామీ ఏపీడీ యూస్మిన్ యుంత్రాలతో పనులు చేసినట్టు అభిప్రాయుపడ్డారు. లేని పనికి బిల్లు బళ్ల పంచాయుతీ, లక్ష్మీపురం ప్రాథమిక పాఠశాలలో వుట్టితోలి చదును చేసే పనులకు కూలీలకు రూ.21,564, ట్రాక్టరుకు రూ.17,417 బిల్లులు పెట్టారు. ఈ నెల 3 నుంచి 9 వరకు 24 వుంది కూలీలు పనులు చేసినట్టు రికార్డు సృష్టించారు. కానీ ఈ పాఠశాల వద్దకు ఒక్కపార వుట్టినీ తోలలేదు. ఈ విషయూన్ని ఆ గ్రావుస్తులు ధ్రువీకరిస్తున్నారు. గోవిందపల్లి-ఆరివూనిపెంట ప్రధాన రహదారికి దూరంగా అడవిలోని తవు ప్రాంతాన్ని ఎవ రూ పట్టించుకోరన్న ధీవూతో బిల్లులు పెట్టుకున్నారని చెబుతున్నారు. ఈ రెండు పనుల బిల్లులనూ ఈ నెల 11న విడుదల చేయుడంతో అవి పోస్టాఫీసుల నుంచి ఇంకా డ్రా కాలేదు. కూలీల పేరుతో దర్జాగా ‘ఉపాధి’లో అక్రవూల నివారణకు ఈ-వుస్టర్, బయోమెట్రిక్ విధానాలు అవులులో ఉ న్నా దర్జాగా అక్రవూలు కొనసాగుతున్నాయి. పనులకు రాని కూలీల పేరుతో వేలకు వేలు బిల్లులు పెట్టడం, బిల్లుకు వంద చొప్పున యిట్టజెప్పి మొత్తం సొయిమను కాజేయుడం ఉపాధి పనుల్లో సర్వసాధారణంగా వూరింది. తవుకు అనువుగా ఉన్న కూలీల పేరుతోనే ఈ తతంగాన్ని ఫీల్డు అసిస్టెంట్లు సాగిస్తున్నారు. అధికారులు విచారించినా ఇబ్బంది రాకుండా చూసుకుంటున్నారు. బళ్ల పంచాయతీ విషయుంలోనూ ఇలాంటి తతంగమే జరిగింది. పనులే లేకపోవడంతో అడ్డంగా దొరికిపోయూరు. పనులు చేయిచలేదని ఉన్నతాధికారులు ఒత్తిడి చేయుడంతోనే ఈ బిల్లులు పెట్టావుని, ఆయూ పనులను త్వరలోనే పూర్తి చేయిస్తావుని రావుకుప్పం వుండల ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ రవికువూర్, బళ్ల ఫీల్డు అసిస్టెంట్ శంకర్ చెప్పారు. కఠిన చర్యలు తీసుకుంటాం బళ్ల పాఠశాలకు వుట్టి తోలేందుకు జేసీ బీ వాడినట్టు పరిస్థితిని చూస్తే స్పష్టమవుతోం ది. లక్ష్మీపురంలో లేని పనులకు బిల్లులు పె ట్టడంపై విచారణ జరుపుతున్నాం. ఈ విషయూలను ఉన్నతాధికారులకు నివేధించి కఠిన చర్యలు తీసుకొంటాం. పోస్టాఫీసు ల్లో బిల్లులు చెల్లించకుండా కట్టడి చేసి, మొత్తం సొయిమను రికవరీ చేస్తాం. -యూస్మిన్, ఉపాధిహామీ ఏపీడీ, కుప్పం