=హెల్త్ కార్డులకు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు
=జిల్లాలో ఎనిమిది కొత్త భవనాలకు ప్రతిపాదనలు
=ఇకపై అన్ని బిల్లులూ ఆన్‌లైన్‌లోనే
=ట్రెజరీస్ డెప్యూటీ డెరైక్టర్ పాళేశ్వరరావ్
పలమనేరు, న్యూస్‌లైన్ : జిల్లాలోని పంచాయతీలకు విడుదలైన నిధులపై ఎలాంటి ఆంక్షలు, పరిమితులు లేవని ట్రెజరీస్ డెప్యూటీ డెరైక్టర్ పాళేశ్వరరావ్ తెలిపారు. గురువారం పలమనేరులోని సబ్‌ట్రెజరీ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి వచ్చిన నిధులను అందుబాటులో ఉంచామన్నారు. గ్రీన్‌చానెల్ అమలు లో ఉన్నందున జిల్లాలోని సంక్షేమ రంగానికి ముందస్తు బడ్జెట్ సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. హెల్త్‌కా ర్డులకు సంబంధించి సంబంధిత శాఖల్లోని డ్రాయింగ్ అథారిటీల ద్వారా ధ్రువీకరణ పూర్తయ్యాక ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు.
వివరాలన్నీ సక్రమంగా ఉంటే తొలుత తాత్కాలిక కార్డు, ఆపై శాశ్వత ఐడీ కార్డులను మంజూరు చేస్తామని తెలిపారు. పెన్షనర్లకు మాత్రం డ్రాయింగ్ అథారిటీగా సంబంధిత ఎస్టీవోలే వ్యవహరిస్తారని చెప్పారు. హెల్త్‌కార్డులకు నిర్ణీత గడువేదీ లేదని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన ప్రీమియం, కేటగిరిల వివరాలు జనవరిలోపు ప్రభుత్వం నిర్ణయిస్తుందన్నారు.
జిల్లాలోని పాకాల, పీలేరు, నగిరి, బంగారుపాళ్యం, తంబళ్లపల్లె, తొట్టంబేడుల్లో ఎస్టీవో కార్యాలయాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయని, పలమనేరు, కుప్పంలలో ప్రభుత్వ భవనాలున్నా అవి కాలం చెల్లిపోయాయని తెలిపారు. మొత్తం మీద ఎనిమిది చోట్ల నూతన భవనాలకు ప్రతిపాదనలు పంపామన్నారు. అన్ని బిల్లులూ ఈ నెల నుంచి ఆన్‌లైన్‌లోనే పెడతామని తెలిపారు. ప్రతి నెలా 20 నుంచి 25 తేదీల్లోపు బిల్లులను ఆన్‌లైన్‌లో పెట్టుకోవాలని ఆయన సూచించారు.
పంచాయతీ నిధులపై ఆంక్షలు లేవు
Published Fri, Dec 6 2013 2:21 AM | Last Updated on Sat, Sep 2 2017 1:17 AM
Advertisement