ID card
-
మెగాస్టార్ చిరంజీవికి కొత్త ఐడీ కార్డు జారీ చేసిన కాంగ్రెస్ పార్టీ
-
గోవింద గోవింద!
బస్సు సడన్ బ్రేకు వేయగా ముందరున్న కమ్మీకి గుద్దుకున్నాడు గురుమూర్తి. ‘స్.... అబ్బా‘ అంటూ డ్రైవేరుకేసి నాలుక మడిచి ఉరిమాడు. ఇతనికి మించి శబ్దం చేసింది అప్పుడే నిలిచిన బస్సు, ‘స్ స్ స్....‘ అంటూ. చప్పుడు విన్న డ్రైవర్ తిరిగి చూసి, మొరుస్తున్న గురుమూర్తిని చూసి చటుక్కున తిరుక్కున్నాడు, ఎక్కడ తిడతాడేమో అని. కోపాన్ని దిగమింగేసి గురుమూర్తి తన గుడ్డసంచి తీసుకొని సీటునుంచి లేసినాడు. పైన ఉన్న లగేజి వరుసకు ధబీల్మని తల కొట్టుకున్నాడు. ‘దీనె...‘ అంటూ బిగ్గరగా అరవాలనుకున్నవాడు. కళ్ళు గట్టిగా మూసి పిడికిలి బిగించి నొప్పి భరించుకొని నోరు అదుపు చేసుకున్నాడు. ‘ఏంది రా కొండకు రావడం రావడమే రెండుసార్లు పెట్టినాడు దేముడు మనకు?‘ అనుకుంటూ బస్సు దిగినాడు. తిరుమలకొండకు డ్యూటీకి వచ్చినా మొక్కుగా వచ్చినా చెప్పులు వేసుకోవడం అలవాటు లేదు గురుమూర్తికి. తెల్లారి మంచుకు తడిసిన రాతినేల మీద పాదం మోపగానే ఐసుగడ్డ మీద పెట్టినట్లు సుర్రుమని నెత్తికి కొట్టింది. ‘గోవింద‘ అనుకుంటూ కల్యాణకట్ట వైపు తన గుడ్డసంచి చంకలో పెట్టుకొని పంచ సర్దుకుంటూ నడిచినాడు. కల్యాణకట్ట లో క్షౌరవృత్తి చేసేవారందరికి ఒక ఐడి కార్డు ఉంటుంది. తన కార్డు సరిచూసుకుంటూ వేగంగా నడవసాగినాడు. టిటిడి ఆడియో విభాగం వారు వేసిన ‘శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశ గోవిందా‘ పాట ముగిసేసరికి కల్యాణకట్ట చేరుకున్నాడు. అదో బృహత్తరమైన భవన సముదాయం. ఒకప్పుడు చిన్నదిగా ఉన్న కల్యాణకట్ట, పెరుగుతున్న భక్తుల సంఖ్యతో కిక్కిరిసిపోవడంతో దాన్ని కొన్నేళ్ల ముందే తిరుమల తిరుపతి దేవస్థానంవారు విస్తరించారు. అప్పటికే జనం నిండుగా ఉన్నారు. గుండుకు మొండికేసే చిన్నారులు, దండిగా జుట్టు పెంచిన అపరభక్తులు, భక్తిభావంతో కురులు సమర్పించడానికి వచ్చిన గ్రామీణ మహిళలు, మూడు కత్తెర్లకే పరిమితం అయిన మోడరన్ సిటీ వనితలు...ఇలా నానారకాలు. కురులను చివరిసారిగా తడిమి చూసుకుంటున్న బాలికలు, మొక్కు పవిత్రత తెలియక ఎందుకు ఎవరు మొక్కుకున్నారో, తన జుట్టుమీదకు తెచ్చిపెట్టారే అనే అక్కసుతో తిట్టుకుంటున్న పిల్లలు ఎక్కువ మందే అక్కడ. గుండు కొట్టించుకున్నాక దాన్ని అపురూపంగా చూసుకోడానికి అద్దం ముందు వాలిపోయే పిల్లలతో పాటు, జుట్టులేని తమ తలలను చూడగానే బాధ ఆపుకోలేక భోరున ఏడ్చేసే పిల్లలూ ఉంటారు. సరదాగా ఒకరిని చూసి ఒకరు నవ్వుకొని వెక్కిరించుకుంటూ కొందరు ఉంటే, ఏడ్చే పిల్లలు మాత్రం ఒకరికి ఒకరు ఓదార్పు చెప్పి, ధైర్యం తెచ్చుకుంటారు. ‘ఒక్క రెండ్రోజుల్లో నల్లబడుతుంది, పదిరోజుల్లో పూర్తిగా మొలిచేస్తుందిరా. ఊరుకో‘ అని ఉత్తుత్తి ధైర్యం చెప్పే తండ్రిని కాల్చుకుతినేలా చూసే మగపిల్లలు, రేపు మా గర్ల్ ఫ్రెండ్ ముందు ఎలా తలెత్తుకోవాలంటూ కుమిలిపోయే అర్బన్ బాయ్స్ ఇంకో పక్క. దర్శనం అవ్వగానే టోపీ కొనియ్యాలంటూ పేచీ పెట్టే పిల్లలు, ’అలాగే లేరా’ అంటూ హామీలు గుప్పించే తల్లితండ్రులతో కల్యాణకట్టంటేనే ఓ రచ్చబండ. ఎన్నో అంతస్తులో ఉన్నామో, బయటకు ఎలా వెళ్ళాలో తెలియక తికమకపడేవారు, స్నానానికి వేన్నీళ్ళు ఎక్కడ ఉంటాయో తెలియని వృద్ధులు, భాష రాక, ఎవరిని అడగాలో బోధపడక, అటూఇటూ తిరుగాడే పొరుగు రాష్ట్రాల భక్తులు, వీళ్లందరితో కల్యాణకట్టంటేనే ఓ పెద్ద మయసభ. తన స్థానం వద్దకు వచ్చి, వంగి నేలను తాకేసి, పైకి చూసి ఓసారి కళ్ళు మూసుకొని ’గోవిందా’ అనుకుంటూ కూర్చున్నాడు. పక్కనున్న సుబ్రమణ్యంకేసి చూస్తూ ‘ఏమియా, ఎంత సేపయ్యింది వచ్చి?‘ అన్నాడు. ‘ఇప్పుడే గురూ‘ అన్నాడు అతను. గురుమూర్తికి చాలా రోజులనుంచి ఒక సందేహం. ‘వయస్సులో పెద్ద కాబట్టి మర్యాదపూర్వకంగా నన్ను ’గురూ’ అంటున్నాడా లేక నా పేరు పెట్టి పిలస్తా ఉండాడా వీడు‘ అని. అయినా పట్టించుకోకుండా అక్కడున్న భక్తులకేసి చూసినాడు. గురుమూర్తికి వాళ్ళను భక్తులుగా కాకుండా, కస్టమర్లుగా చూడటం అలవాటు. ఎవరైనా ‘రిచ్‘ గా కనిపిస్తే, కనీసం ఒక రెండొందలయినా ఇచ్చుకుంటారు అనిపిస్తే, వాళ్ళకేసి సైగచేసి చప్పట్లుకొట్టి మరీ పిలుస్తాడు. మిగిలినవాళ్ళకి ఇది ఏ మాత్రం నచ్చదు. వాళ్ళంతట ఎదురు వరుసకు వచ్చినవారిని కూడా పిలిచి మరీ తన్నుకుపొయ్యే తత్వం మనోడిది. ఇతని గ్రద్ద చూపు పిచ్చుకలాగ ఉండే ఓ సన్నటి తమిళ భక్తునిపై పడింది. చాంతాడంత గొలుసు, బ్రాస్లెట్ సహితంగా చూడముచ్చటగా ‘కామధేనువు‘లాగా కనిపించాడు అతను. అతనొక్కడే వచ్చాడో లేక కుటుంబసమేతంగా వచ్చాడో ఆరా తీయసాగాడు. కుటుంబసమేతం అయితే గంపగుత్తగా ఓ ’ఫామిలీ ప్యాక్’ కింద లాగేయొచ్చు అని వీడి అంచనా, కాదు ఎదవ ఆలోచన. పక్కనోడి ముందర వాలే భక్తుణ్ణి డైవర్ట్ చెయ్యడమంటే వాడి నోటికాడ తిండి లాగేసుకోడమే. ’వాడు ఏమైపోతే మనకేమి, నాకు చిల్లర ముట్టిందా లేదా’ అన్న టైపు. అందుకే అక్కడ గురుమూర్తి అంటే తెగ కడుపుమంట. కల్యాణకట్టలో అతనికి పదుల సంఖ్యలో సహచరులు ఉన్నారు, కానీ మిత్రులు ఒక్కరు కూడా లేరు. ‘ఇదో సామి, ఇంగ వాంగే‘ అన్నాడు బిగ్గరగా. అటువైపు వరుసలో క్షురకుని వైపు వెళ్తున్న ఆ భక్తుడు తిరిగి చూసి ఓ క్షణం ఆగినాడు. ఏమనుకున్నాడో ఏమో, గురుమూర్తి దగ్గరకు వచ్చాడు. ‘ఉక్కారుంగ‘ అంటూ తన ముందున్న పీట చూపించి కూర్చోమన్నాడు. ఆ భక్తుడు చొక్కా బనియను విప్పి పక్కనపెట్టి, నేలను ఓ మారు తాకి కూర్చున్నాడు, ’గోవిందా గోవింద‘ అని గొణుక్కుంటూ. మిలమిల మెరిసే కళ్ళతో అతనిని ఆవురుఆవురుమంటూ ఓసారి సంతృప్తిగా చూసుకున్న గురుమూర్తి, అంతే స్థాయిలో మెరుస్తున్న ఓ కొత్త బ్లేడు తీసుకొని సగానికి తుంచి, పని మొదలుపెట్టసాగినాడు. ఆ భక్తుని తలను వేన్నీళ్ళతో తడుపుతూ ‘ఎంద ఊరు నమ్మల్దు?‘ అంటూ విచారించాడు. ఇతని తమిళానికి ఒకింత ఆశ్చర్యంతో ఆ భక్తుడు ‘మదురై పక్కత్తుల ఆండిపట్టి‘ అన్నాడు. ‘పేరు ఎన్న‘ అని మళ్ళీ తగులుకున్నాడు. ‘పళని సామి‘ అన్నాడు అతను, వంచిన తలను పైకెత్తలేక ఓరచూపు చూస్తూ. రెండు నిమిషాలు గడిచాయి మౌనంగా. గురుమూర్తి కత్తి తన పనితనం చూపిస్తోంది. తలపై వెన్నలా జారుకుంటూ బుల్డోజర్ లెక్కన వెంట్రుకలను తొలగిస్తా ఉంది. వెంకన్నకు సిరులు కురిపించే కురులను తితిదే వ్యావహారిక భాషలో ’నల్లబంగారం’గా అభివర్ణిస్తారు. ఒక్క రూపాయి కూడా ఇచ్చుకోలేని పేద భక్తుడు సైతం సగర్వంగా మొక్కుకింద ఇచ్చుకోగలిగిన సొత్తు ఈ కురులే. వీటిని వేలంపాటలో అమ్మితే తితిదే ఖజానాకు చేరే కోట్లాది రూపాయల్లో పళనిసామి లాంటి కోట్లాది భక్తుల కురులరూపంలో చేరే రూపాయి రూపాయి ఉందన్నమాట. టైమింగ్ తెలిసిన గురుమూర్తి ఇదే అదునుగా అతన్ని మళ్ళీ మాటల్లో పెట్టాడు. ‘మాకు అంతంత జీతాలే. పెద్దగా రాబడి ఇల్లే. ఏదో మీ సంతోషం, మా ప్రాప్తం‘, అంటూ పళ్ళు ఇకిలించాడు. ఓరకంటితో చూడగలిగినా చూపు కలపకుండా కళ్ళు మూసుకొని మౌనంగా ఉన్నాడు పళనిసామి. ‘మీ సంతోషం, మా ప్రాప్తం‘ అన్నది దేవస్థానంలో కొన్ని తరాలు గా ఊతపదం. చెప్పుల స్టాండు నుంచి క్షౌరశాల దాకా, దేవుని వాహనం మోసేవారి నుంచి టీ కప్పు మోసే అటెండర్ దాకా, అర్చకుని నుంచి అధికారి దాకా ఇది చాలా పాపులర్. మామూలుగా ఈ మాటకు ఊకొట్టడమో, తలూపడమో చేస్తారు భక్తులు. నెత్తిన కత్తి పెట్టి మరీ అడిగితే ఇవ్వక చస్తారా? పైగా తల అప్పగించి, సగం గొరిగించుకున్నాక.. దీన్ని సానుకూల స్పందనగా గుర్తించి గురుమూర్తి డెటాల్ బాటిల్ కానీ, చందనం డబ్బా కానీ తెరుస్తాడు, తాయిలంలా. అన్నీ తెలిసిన పళనిసామి, గురుమూర్తి ’ఎదురుచూస్తున్న’ సంతోషం అర్థమైనా కిమ్మనక ఉన్నాడు. ఇతని మౌనం గురుమూర్తిని కలవరపెట్టింది, చికాకు తెప్పించింది. ‘ఇదేంరా బోణినే బెడిసికొట్టేట్టు ఉంది‘ అనుకున్నాడు. ‘మేము తెల్లారి కొండకు వచ్చినామంటే కిందికి దిగేటప్పుడు సాయంకాలం పొద్దు పోయుంటుంది. ఏదో మా కుటుంబాల కష్టాలు మర్చిపోయి దేవుడిచ్చిన వరం, తరతరాలుగా చేస్తున్న ఉద్యోగం కాబట్టి చేస్తా వుండాము. లేకపోతే ఏమి గిట్టుబాటు అవుతుంది చెప్పు సామి, ఈ తక్కువ జీతాలకి పెరిగిన కర్సులకి‘, అన్నాడు. పళనిసామి విననట్లే ఉన్నాడు. అనుకున్నది జరగకపోతే ఇంకొంచం గట్టిగా ప్రయత్నించే మనస్తత్వం ఉన్న గురుమూర్తి ఈసారి ఇంకా బాగా తగులుకునే ప్రయత్నమే చేసాడు. ‘చూస్తానే ఉండారు కదా, ముందర మీ ఊరికాడ నుంచి ఈడకి రావాలంటే ఎంత అయ్యేది, ఇప్పుడు ఎంతగా పెరిగింది? ఏదో అట్లా చూస్కోండి మమ్మల్ని కూడా‘, అని విశదీకరించారు, కాస్త సిగ్గును పక్కనపెట్టి. అయినా చలనం లేదు పళనిసామిలో. ఏ ఆకు రాలినా ఈతాకు రాలదు అన్నట్టు ఈ అరమోడు ఏందిరా బాబు ఏమి మాటాడడు, అని మనసులో అనుకున్నాడు. పళని తలూపుతాడని ఎదురుచూసిన గురుమూర్తికి నిరాశ మాత్రమే మిగిలింది. అతని పెదాలపై చిరునవ్వు మెల్లగా మాయమవడం కళ్ళుమూసుకున్నా కూడా కనిపించింది పళనిసామికి. కొన్ని క్షణాల ముందు మెత్తగా జారుకున్న కత్తిలో కరుకుదనం పెరిగింది, అతని వేలిపట్టు బిగిసింది. ముందున్న జాగ్రత్త ఇప్పుడు కనపడలేదు. పళనిసామికి మార్పు తెలియవచ్చింది. పళనికి అర్థమైందని గురుమూర్తికి కూడా అర్థమయింది. ‘ఒక్కసారి కూడా పలకట్లేదు ఏమిరా వీడు?‘ అనుకుంటూ కత్తిని కాస్త విసురుగా లాగినాడు. చప్పని చెవిపక్కన లేతచర్మం కోసుకుపోయింది. నొప్పికి ‘అప్పా‘ అంటూ గట్టిగా కళ్ళు మూసుకున్నాడు పళని. ‘వీడికి బాగా కావాల‘ అని మనసులో అనుకున్నాడు. పక్కనున్న సుబ్రమణ్యం చటుక్కున తిరిగి, చందనం రుద్దమని సలహా ఇచ్చాడు. ‘నువ్వు మూసుకొని నీ పని చూడు‘, అన్నట్టు మనోడు సైగ చేయడం కూడా తల ఒంచి గమనిస్తున్నాడు పళనిసామి. చెవిపక్కన గాటుపడి, రక్తపుచుక్క మెల్లగా తొంగిచూసింది. కోసుకుపోయిన చోట కత్తిరించకపోవడంతో అలాగే నిలిచిపోయిన పొడవాటి వెంట్రుకల సంగతి గురుమూర్తి అస్సలు పట్టించుకోలేదు. తల మెల్లిగా పైకి ఎత్తి చూసిన పళనిసామి కళ్ళల్లో అసహనం కానీ, చికాకు కానీ కనపడలేదు. ఒకింత నిండుతనం, జాలి, క్షమాగుణం చూసి ఆశ్చర్యపోయాడు గురుమూర్తి. పళనిసామి చూపుడువేలితో తలపైన గాటును నిమురుతూ, ‘ఎన్న సామి, దుడ్డు కావాలని నువ్వు అడగాలనా? మేము నీకు ఇచ్చుకునే దక్షిణ కూడా హుండీలో వేసినంత పవిత్రంగా చూసుకుంటాము. అదుకుపోయి గాటు వేసేసినావే‘, అన్నాడు. అతని మాటలు కటువుగా లేవు, కనువిప్పు కలిగించేలా ఉన్నాయి. ఈసడించకుండానే ఈడ్చితన్నట్లు ఉన్నాయి. గొడవ పెట్టుకునేటట్లు కాకుండా గోడువినిపించినట్లు ఉంది. తిరగబడి తిమురుగా మాట్లాడే భక్తుల్ని టీముగా ఎదుర్కోవడం తిరుపతి టెక్నీకు. అది కొండపైనన్నా సరే, కింద బస్సు స్టాండ్ లో టీ కొట్టైనా సరే, గోవిందరాజస్వామి గుడి ముందర బొమ్మల అంగడైనా సరే. కలిసికట్టుగా అంగళ్ల వాళ్ళందరూ చేరుకొని ’ఏయ్.. ఏయ్’ అని అరుచుకుంటూ చుట్టుముట్టేస్తే బెదిరిపోయి పారిపోతారు అని ఒక స్ట్రాటజీ. ఇది ’మాబ్ మెంటాలిటీ’. ఎదురుతిరిగి మొరుచుకుంటే తిరిగి అరుద్దామని గొంతు సవరించుకున్న గురుమూర్తికి అలాంటిది ఏమి జరగకపోవడం ఆశ్చర్యం కలిగించింది. అరమోడు అరిస్తే తిరిగి గట్టిగా ఇవ్వాలని తీర్మానించుకున్నాడు కానీ పరిస్థితి అలా లేదు. ఆ భక్తుని సున్నితమైన బిహేవియర్ అర్థంకాక చూస్తుండిపోయాడు గురుమూర్తి. తీక్షణంతో నేరుగా చూస్తున్న పళనిని అంతే స్థాయిలో చూడలేకపోయాడు గురుమూర్తి. అవమానం అగుపించినా, మొదటిసారి గురుమూర్తిని ఆలోచింపచేసింది పళని మాటలు. కత్తి ఉన్న చేతితోపాటు, తన చూపు కూడా పళని కళ్ళను దాటుకుంటూ నేలపైకి వాలింది, సిగ్గుతో. పని మానేసి తిరిగి చూసినాడు సుబ్రమణ్యం, ఇంకా ఇద్దరు ముగ్గురు. గురుమూర్తికి ఒక అవమానం జరుగుతోంది అంటే చెప్పలేని ఆనందంతో చూడసాగారు తోటి క్షురకులు. ఒకరినొకరు ’స్.. స్’ అని పిలుచుకుంటూ ’ఇది గమనించండి’ అంటూ సైగలు చేసుకున్నారు అతనితో స్నేహం లేని సహచరులు. ఒక్కసారిగా ఓ ముప్పై జతల కళ్ళు తనపై వాలడంతో ఆ ఉష్ణాన్ని గ్రహించాడు గురుమూర్తి. పళని కొనసాగించాడు: ‘నాంగ తిరపతి ఒస్తే ఒక్క దేవుడు కాదు. సవరం చేసే మీనుంచి, పూసారి అయ్యా (అర్చకుడు) వరకు, మా మొక్కు తీర్చడంలో సహాయపడే ఎల్లారుమ్ మాకు వెంకటాచలపతి దాన్. నాంగ ఎంగ ఊర్లో బయల్దేరిన నాటినుంచి, సామి దర్శనం సేసి ఉంగ ఊరు దాటే వరికుం మీ మీదనే కదయ్యా ఆధారపడేది. అంటే మాకు దగ్గరుండి దారి సూపించే తిరపతిలో ప్రతి ఒక్కరూ దైవం దానే. మేము అట్లానే అనుకుంటాము, నిన్ను కూడా అట్లనే అనుకున్నాము. మీరు మాలాంటి కస్టమర్లను రోజుకు ఎంతో మందిని చూస్తారు, కానీ మీ అందరిలో మేము చూసేది ఆ దేవుణ్ణే సామి‘. ఆ ఒక్క మాట అతని గుండెలో గడ్డపార దింపినంత పని చేసింది. తదేకంగా చెయ్యి డెటాల్ బాటిల్ వైపు వెళ్ళింది, తీసి చెవికాడ గాయంపై రుద్దినాడు, మళ్ళీ అతని కళ్ళను దాటుకుంటూ. సర్దుకున్న పళని లేచి నిలబడి చొక్కా జేబులో చెయ్యి పెట్టబోతే, అతని చేతిని పట్టుకున్నాడు గురుమూర్తి, తల అడ్డంగా ఊపుతూ, తనకేమీ ఒద్దు అన్న సంకేతమిస్తూ. ‘ఇది నీకు కాదు సామి, నీలో నేను చూసుకున్న వెంకటేశ్వరస్వామికి‘, అంటూ రెండు పెద్ద నోట్లు అందించాడు. ఆ పెద్ద నోట్లను కళ్ళతో చూడకుండానే దాని విలువను గ్రహించాడు. అతను ’ఎదురుచూసిన’ సంతోషం కన్నా ఈ బేరంలో చిక్కిన ప్రాప్తం ఎక్కువే, కానీ ఇప్పుడు అతను చెయ్యి చాపలేక పోయాడు. అర్థం చేసుకున్న పళని, డబ్బుని పీట కింద పెట్టి లేసి, ’గోవిందా గొవింద’ అంటూ బయల్దేరాడు. మొక్కుచెల్లించడంలో దక్షిణకు ఓ స్థానం ఉంది. గుడికి వస్తే పళ్ళు టెంకాయలు పూలు తేవడం, అర్చనకు హారతికి హుండీలోనే కాక అర్చకుని పళ్లెంలో కూడా డబ్బులు వేయడం, ప్రసాదానికి చందా కట్టడం, పుట్టినరోజుకి శ్రార్ధాలకు అన్నసంతర్పణ చేయడం సామాన్యులు సైతం చేస్తారు. ఉన్నవాళ్లు ఉన్నతస్థాయి దానధర్మాలు చేయడం, ఇంకా బాగా ఉన్నోళ్లు గుళ్ళు గోపురాలు కట్టించడం పరిపాటి. ఒకరు అడిగితే ఇవ్వడం కాక స్వచ్ఛందంగా ధర్మ సంస్థాపనకు ఎవరివంతు వారు కృషిచేయడం ఏనాటినుంచో వస్తున్న సంప్రదాయం. అడిగితేనే సాధించుకోగలం అన్న ఆలోచన గలిగిన మన గురుమూర్తికి ఇది తెలియకేం కాదు. ఇంత సూటిగా ఎవరూ చెప్పడం జరగలేదు, అంతే. పళని ఆ కొనదాకా వెళ్లి తిరిగే వరకు చూస్తుండిపోయాడు గురుమూర్తి. అతని మనసు పీట మీద కానీ, దాని కిందున్న డబ్బు మీద కానీ లయించలేదు. ఒక్కసారి తలతిప్పి చుట్టూ ఉన్న వారందరిని చూసాడు. అదేమి మాయో కానీ, అతనికి ఒక్క కస్టమర్ కూడా కనపడలేదు. భక్తులే కనిపించారు. ప్రతి భక్తుడిలో దేవుడు కనిపించాడు. పీటకింద డబ్బు తీసి, గబగబా బయటకు నడిచాడు. ఆ డబ్బు ఎందుకో నిప్పులాగా దహిస్తా ఉండింది అతనికి. గది బయట రాగానే మెయిన్ హాలులో భక్తుల కోసం ఉంచిన హుండీ వైపు వెళ్ళినాడు. ఎంచనైనా ఎంచకుండా మొత్తాన్ని అందులో వేసేశాడు. ఉద్వేగంతో ఒక్కసారి బిగ్గరగా ’గోవిందా గోవింద’ అన్నాడు. ఎవరు ఎందుకోసం అన్నారో తెలియకపోయినా, అక్కడ గుండు గీయించుకోవడంకోసం వేచియున్న భక్తులు కూడా అందుకున్నారు ’గోవిందా గొవింద, గోవిందా గోవింద’ అంటూ వరుసగా. తెల్లారి బస్సులో తగిలిన రెండు దెబ్బలు గుర్తుకొచ్చాయి గురుమూర్తికి. అప్పుడే అనుకున్నాడు ’ఏందిరా కొండకు రావడంతోనే రెండుసార్లు దెబ్బతగిలిందే. మనం అనుకున్నది కాకుండా దేముడు వేరే ఏదో రాసిపెట్టినాడు ఈరోజు మనకు’, అని. కానీ రెండునిమిషాల ముందు కల్యాణకట్టలో పడ్డ మూడో దెబ్బతో పోల్చేంత కావు అవి..! - ఏ. డి. రంగరాజన్ -
శరీరాన్నే ఐడీ కార్డులుగా..!
ఎక్కడికి వెళ్లినా సరే మన గుర్తింపును తెలిపే ఏదో ఒక ఐడీ కార్డు కచ్చితంగా వెంట ఉండాల్సిందే. ఇక ఉద్యోగులకు, విద్యార్థులకైతే ఐడీకార్డు లేనిదే లోపలి ప్రవేశించే అనుమతి ఉండదు. ఇంతలా ప్రాధాన్యం ఉన్న ఐడీ కార్డును తరచుగా మర్చిపోయి ఇబ్బందుల పాలవడం సహజంగా జరిగేదే. మరి ఆ ఇబ్బందులను అధిగమించాలంటే స్వీడిష్ ప్రజలు అనుసరిస్తున్న విధానాన్ని మనమూ ఫాలో అయిపోతే సరిపోతుంది. రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా ప్రతీచోటా ఐడీ కార్డు చూపించాల్సిన అవసరం లేకుండా తమ శరీరాన్నే మైక్రోచిప్‌లతో నింపేస్తున్నారు స్వీడిష్ ప్రజలు. బియ్యపు గింజ పరిమాణంలో ఉండే మైక్రోచిప్‌ను చేతిలో లేదా శరీరంలోని ఇతర భాగాల్లో అమర్చుకోవడం ద్వారా జిమ్ కార్డు, ఆఫీసు కీ కార్డులను రీప్లేస్ చేసేస్తున్నారు. 2015 నుంచే సుమారు 3 వేల మంది స్వీడిష్ ప్రజలు ఈ విధానాన్ని అనుసరిస్తున్నారని ఏజెన్సీ ఫ్రాన్స్ ప్రెస్ తెలిపింది. గతేడాది స్వీడన్ రైల్వే శాఖ బయోమెట్రిక్ చిప్స్ కలిగి ఉన్న తమ ప్రయాణికుల చేతిని స్కాన్ చేయడం ద్వారా ప్రయాణంలోనే టికెట్లు అందించే సరికొత్త విధానానికి తెరలేపింది. మైక్రోచిప్ అమర్చుకోవడం సులువే.. కానీ.. ఇంజక్షన్ చేయించుకున్నంత తేలికగా శరీరంలో మైక్రోచిప్‌ను అమర్చుకోవచ్చు. స్వీడన్‌లోని పని ప్రదేశాల వద్ద ఇలా మైక్రోచిప్‌లను అమర్చే వారు అందుబాటులో ఉంటారు. కానీ ఈ ప్రక్రియ వల్ల ఇన్ఫెక్షన్లతో పాటు, జీవక్రియలపై చెడు ప్రభావం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందని మైక్రోబయాలిస్టులు హెచ్చరిస్తున్నారు. హ్యాకింగ్ ప్రమాదం తక్కువే... స్వీడన్‌కు చెందిన బయోహ్యాకింగ్ గ్రూప్ బియానిఫికెన్ ఈ విధానాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చింది. స్వీడన్‌తో పాటు యూఎస్, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, మెక్సికో దేశాల్లో ప్రజలు తమ చేతుల్లో మైక్రోచిప్‌లను అమర్చుకునేందుకు ఆసక్తి కనబరినట్లు తెలిపింది. స్నాక్స్ కొనేందుకు, కంప్యూటర్ లాగిన్, ఫొటోకాపియర్ ఇలా చిన్న చిన్న పనులకు కూడా మైక్రోచిప్‌లు అమర్చుకోవడం చూస్తుంటే టెక్నాలజీ పట్ల యువత ఎంతగా ఆకర్షితులవుతున్నారో అర్థమవుతోందని బయోఫికెన్ పేర్కొంది. శరీరాన్నే ఒక ప్రయోగశాలగా మార్చిన నేటి తరంలో స్మార్ట్‌ఫోన్, స్మార్ట్‌వాచ్‌లంటూ అనేక రకాల గాడ్జెట్లను వెంట తీసుకెళ్లే బదులు చేతి వేళ్లను ఆడించడం ద్వారా మీ పనులను సులభతరం చేసుకోవచ్చని బయోఫికెన్ స్థాపకుడు హాన్స్ సోబ్లాడ్ సలహా కూడా ఇస్తున్నారు. హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశాలు తక్కువగా ఉండటం వల్ల సుమారు 10 మిలియన్ల మంది మైక్రోచిప్‌లను అమర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. -
నకిలీ ఐపీఎస్ అధికారి అరెస్టు
గిద్దలూరు: తాను ఐపీఎస్ అధికారినని చెప్పుకుంటూ తిరుగున్న యువకుడిని గురువారం గిద్దలూరు పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పోలీసుస్టేషన్లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ శ్రీరామ్ నిందితుడి వివరాలు వెల్లడించారు. వైఎస్సార్ జిల్లా కాశినాయన మండలంలోని వడ్డెమానుకు చెందిన కర్నాటి గురువినోద్‌కుమార్‌రెడ్డి గిద్దలూరు మండలంలోని క్రిష్ణంశెట్టిపల్లెలో అవ్వ, తాతల వద్ద ఉంటున్నాడు. గిద్దలూరులోని ఓ కళాశాలలో ఇంటర్, డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఇతనికి డిఫెన్స్ సర్వీసెస్, పోలీసు అధికారిని కావాలన్న ఆశ బలంగా ఉండేది. ఈ నేపథ్యంలో ఐపీఎస్, డిఫెన్స్ సర్వీస్‌లకు సంబంధించిన కోచింగ్‌లు తీసుకున్నాడు. ఇతనితో పాటు కోచింగ్ తీసుకున్న వారంతా వివిధ డిపార్ట్మెంట్లలో ఉద్యోగాలు సంపాదించుకున్నారు. వినోద్‌కు మాత్రం ఉద్యోగం రాలేదు. దీంతో తనలో ఉన్న కోర్కెను తీర్చుకోవాలని, అందరితో ఐపీఎస్ అనిపించుకోవాలని అనుకున్నాడు. ఇందుకు యూనియన్ పబ్లిక్ సర్వీసెస్‌కు చెందిన నకిలీ ఐడీ కార్డు, వాయుసేనకు సంబంధించి ఫైలెట్‌గా ఐడీ కార్డు, యూనియన్ పబ్లిక్ సర్వీసెస్‌లో ఐపీఎస్‌కు సెలక్ట్ అయినట్లు అపాయింట్మెంట్ లెటర్ తయారు చేసుకున్నాడు. తాను ఐపీఎస్ అని ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నాడు. గిద్దలూరు పోలీసుస్టేషన్‌కు సైతం వచ్చిన ఇతడు తాను ఐపీఎస్ అధికారినంటూ హడావిడి చేయగా అనుమానం వచ్చిన ఎస్ఐ కొమరం మల్లికార్జున అతని ఐడీ కార్డులపై విచారణ చేపట్టారు. కాగా ఇతను ఐపీఎస్ అధికారిగా చెప్పుకుంటున్నాడే తప్ప ఎవరినీ బెదిరిం చడం, నగదు వసూళ్లు చేయడం వంటి చర్యలకు పాల్పడినట్లు తమ దృష్టికి రాలేదని సీఐ శ్రీరామ్ పేర్కొన్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీసెస్‌కు సంబంధించిన ఐడీ కార్డు, అపాయింట్మెంట్ లెటర్‌ను పోర్జరీ చేసినందుకు కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సీఐ వివరించారు. -
‘మామూలే కదా..!
పంచాయతీరాజ్ శాఖలో అక్రమాల పర్వం గుర్తింపుకార్డు కావాలంటే రూ.500 కొట్టాల్సిందే..! ఉద్యోగ నియామక ధ్రువీకరణపత్రంపై సంతకం చేస్తే మరో రూ.500 చెల్లించాల్సిందే!.. ట్రెజరీ కార్యాలయంలో మరో రూ.వెయ్యి ముట్టజెప్పాల్సిందే..! ఇదీ ఇటీవల కొత్తగా నియమితులైన పంచాయతీ కార్యదర్శుల నుంచి వసూలుచేస్తున్న తీరు. కాదు.. లేదు! అంటే చిన్నపనికి చెప్పులరిగేలా తిప్పుకుంటున్నారు. ఇటీవల ఓ పంచాయతీ కార్యదర్శికి ట్రెజరీ కార్యాలయంలో ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఇదేంది.. సార్! అని ప్రశ్నించిన ఆ ఉద్యోగికి పై అధికారి ఇది ‘మాములే’ కదా..! అని బదులివ్వడం శోచనీయం. సర్కారు కొలువు వచ్చిందనే సంతోషమే లేదని బాధిత ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సాక్షి, మహబూబ్‌నగర్: దేశానికి పట్టుగొమ్మలైన గ్రామాలను బలోపేతం చేస్తాం. అందుకోసం ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని పారదర్శంగా ఉండేలా ఈ-కంప్యూటరీకరణ అమలుచేస్తాం. ప్రతి పనిని ఆన్లైన్లో వీక్షించేలా చర్యలు తీసుకుంటామని ఓ వైపు రాష్ట్రప్రభుత్వం ఊదరగొడుతుంటే.. మరోవైపు ఆశాఖలో పనిచేస్తున్న కొందరు అధికారుల తీరు మరోవిధంగా ఉంది. పంచాయతీరాజ్‌శాఖలో మాముళ్లు లేనిదే పని జరగదని ఖరాకండిగా చెప్పేస్తున్నారు. పైగా ఇదీ ఆనవాయితీ అంటూ కొత్తభాష్యం చెబుతున్నారు. జిల్లాలో ఇటీవల పంచాయతీరాజ్ కార్యదర్శులుగా 330 మంది విధుల్లో చేరారు. కొత్తవారికి పోస్టింగ్‌లతో మొదలుకుని గుర్తింపుకార్డులు, యాక్టు-2ఫాం తదితర వాటికి విచ్చలవిడిగా డబ్బులు లాగుతున్నారు. కొత్త పంచాయతీ కార్యదర్శులు మొదటినెల జీతం అందుకోవాలంటే ఒక్కొక్కరు రూ.మూడువేలు చెల్లించుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు. మరీ మొదటి నెల జీతం రావాలంటే ఈ ఖర్చులు మామూలేనని సర్దిచెబుతున్నారు. ఈ శాఖలో ఇది ‘మామూలే’ కదా..! అని ఓ అధికారి చెప్పడంతో పీఆర్ కార్యదర్శులు విస్తుపోయారు. గ్రామస్థాయిలో జరిగే పనులకు మీకు మున్ముందు పర్సెంటేజీలు తీసుకుంటారు కదా..! అంటూ ఉచిత సలహా ఇస్తున్నారు. ఎవరికి ఫిర్యాదుచేస్తే ఏమవుతుందోనని ఈ కొత్త ఉద్యోగులు భయపడుతున్నారు. వసూళ్ల పర్వం ఇలా... పంచాయతీ కార్యదర్శుల నుంచి మొదటగా గుర్తిం పుకార్డు కోసం రూ.500 వసూలు చేస్తున్నారు. ఇందుకోసం ఎంపీడీఓ కార్యాలయంలోని ఓ సెక్షన్ అధికారి వసూలు చేస్తున్నాడు. వారిని కాకుండా నేరుగా ప్రయత్నిస్తే పనిచేయకుండా తిప్పుకుంటున్నారు. ఉద్యోగి నియామకాన్ని అంగీకారం కోసం ఇచ్చే ధ్రువీకరణ పత్రం కోసం(యాక్టు-2) ఒక్కొక్కరి నుంచి రూ.వెయ్యి నుంచి రూ.రెండువేల వరకు లాగుతున్నారు. దీనిని జిల్లా డీపీఓ కార్యాలయంలోని ఓ విభాగం అధికారులు వసూలు చేస్తున్నారు. ఇందుకోసం పంచాయతీరాజ్ కార్యదర్శుల నుంచి నేరుగా కాకుండా కొందరు నేతలుగా చలామణి అవుతున్నవారు, సీనియర్లు మధ్యేమార్గంగా పని కానిచ్చేస్తున్నారు. ట్రెజరీ కార్యాలయంలో చేతులు తడపనిదే పనికాదని వారే తెగేసి చెబుతున్నారు. ఇక్కడ ఎస్టీఓ స్థాయి అధికారులకు ఒక్కొక్కరు రూ.500, ఫైలు పూర్తిచేసే వారికి మరో మరో రూ.500 సమర్పించుకోవాల్సి వస్తుందని కొందరు బాధిత కార్యదర్శులు తెలిపారు. జిల్లాలో ఇటీవల విధుల్లో చేరిన ఒక్కో పంచాయతీ కార్యదర్శి నుంచి రూ.2500 నుంచి రూ.3వేల చొప్పున 330 మంది నుండి సుమారు రూ.9లక్షలకు పైగా వసూలుచేసినట్లు సమాచారం. ఇదిలాఉండగా, గతనెల 150 మంది, ఇటీవల మరో 100 మంది, మంగళవారం మిగితావారు కూడా చెల్లింపు పూర్తిచేసినట్లు తెలిసింది. -
పంచాయతీ నిధులపై ఆంక్షలు లేవు
=హెల్త్ కార్డులకు ఆన్లైన్లోనే దరఖాస్తు =జిల్లాలో ఎనిమిది కొత్త భవనాలకు ప్రతిపాదనలు =ఇకపై అన్ని బిల్లులూ ఆన్లైన్లోనే =ట్రెజరీస్ డెప్యూటీ డెరైక్టర్ పాళేశ్వరరావ్ పలమనేరు, న్యూస్‌లైన్ : జిల్లాలోని పంచాయతీలకు విడుదలైన నిధులపై ఎలాంటి ఆంక్షలు, పరిమితులు లేవని ట్రెజరీస్ డెప్యూటీ డెరైక్టర్ పాళేశ్వరరావ్ తెలిపారు. గురువారం పలమనేరులోని సబ్‌ట్రెజరీ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి వచ్చిన నిధులను అందుబాటులో ఉంచామన్నారు. గ్రీన్‌చానెల్ అమలు లో ఉన్నందున జిల్లాలోని సంక్షేమ రంగానికి ముందస్తు బడ్జెట్ సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. హెల్త్‌కా ర్డులకు సంబంధించి సంబంధిత శాఖల్లోని డ్రాయింగ్ అథారిటీల ద్వారా ధ్రువీకరణ పూర్తయ్యాక ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. వివరాలన్నీ సక్రమంగా ఉంటే తొలుత తాత్కాలిక కార్డు, ఆపై శాశ్వత ఐడీ కార్డులను మంజూరు చేస్తామని తెలిపారు. పెన్షనర్లకు మాత్రం డ్రాయింగ్ అథారిటీగా సంబంధిత ఎస్టీవోలే వ్యవహరిస్తారని చెప్పారు. హెల్త్‌కార్డులకు నిర్ణీత గడువేదీ లేదని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన ప్రీమియం, కేటగిరిల వివరాలు జనవరిలోపు ప్రభుత్వం నిర్ణయిస్తుందన్నారు. జిల్లాలోని పాకాల, పీలేరు, నగిరి, బంగారుపాళ్యం, తంబళ్లపల్లె, తొట్టంబేడుల్లో ఎస్టీవో కార్యాలయాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయని, పలమనేరు, కుప్పంలలో ప్రభుత్వ భవనాలున్నా అవి కాలం చెల్లిపోయాయని తెలిపారు. మొత్తం మీద ఎనిమిది చోట్ల నూతన భవనాలకు ప్రతిపాదనలు పంపామన్నారు. అన్ని బిల్లులూ ఈ నెల నుంచి ఆన్లైన్లోనే పెడతామని తెలిపారు. ప్రతి నెలా 20 నుంచి 25 తేదీల్లోపు బిల్లులను ఆన్లైన్లో పెట్టుకోవాలని ఆయన సూచించారు. -
భాగ్యనగరంలో చెస్ పండుగ
25 నుంచి గ్రాండ్ మాస్టర్స్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: మీ పిల్లలను చెస్ ప్లేయర్‌ను చేయాలనుకుంటున్నారా..? అయితే ఈ వార్త మీకు చాలా ముఖ్యం. ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ భారత్‌లో జరుగుతున్నందున... దేశంలో నాలుగు చెస్ టోర్నీలు నిర్వహిస్తున్నారు. ఇందులో ఒకటి హైదరాబాద్‌లో ఈ నెల 25 నుంచి ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న చెస్ క్రీడాకారులందరికీ ఉపయోగపడేలా ఈ టోర్నీని ఒక పండుగలా నిర్వహించబోతున్నారు. ఇంటర్నేషనల్ మాస్టర్ లంక రవి, ఆంధ్రప్రదేశ్ చెస్ సంఘం కార్యదర్శి కన్నారెడ్డి ఈ వివరాలు తెలిపారు. ఈ నెల 24న జార్జియా గ్రాండ్ మాస్టర్ సనికెడ్జె... పిల్లలకుచెస్లో మెళకువలు నేర్పుతారు. పదో తరగతి, ఇంటర్ చదువుకునే పిల్లలెవరైనా... తమ ఐడీ కార్డ్ తీసుకుని హైదరాబాద్ శివార్లలోని బహదూర్‌పల్లిలో ఉన్న టెక్ మహీంద్ర ఆఫీస్‌కు వెళితే చాలు. ప్రవేశం ఉచితం. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 11 గంటల నుంచి సాయంత్రం వరకు క్లాస్ ఉంటుంది. 25న గ్రాండ్ మాస్టర్స్ చెస్ టోర్నీ ప్రారంభమవుతుంది. ఇందులో 15 దేశాల నుంచి సుమారు 90 మంది క్రీడాకారులు పాల్గొంటారు. 1900 రేటింగ్ కంటే ఎక్కువ ఉన్నవారు ఇందులో పాల్గొంటారు. ఈ టోర్నీ డిసెంబరు 3 వరకు జరుగుతుంది. లలిత్‌బాబు, దీప్‌సేన్ గుప్తా తదితర గ్రాండ్ మాస్టర్లు ఇందులో ఆడతారు. టోర్నీ జరిగే కోట్ల విజయభాస్కర రెడ్డి ఇండోర్ స్టేడియంలో 25న సైబర్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ర్యాపిడ్ చెస్ టోర్నీ నిర్వహిస్తారు. వయసుతో సంబంధం లేకుండా ఔత్సాహికులంతా పాల్గొనవచ్చు. ఈ టోర్నీలో పాల్గొనాలనుకుంటే 24న సాయంత్రం 6 గంటల్లోగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. వివరాలకు 9959988766 ఫోన్ నంబర్లో సంప్రదించాలి. 25న ఇంటర్ స్కూల్ చెస్ టోర్నమెంట్ ‘చార్మినార్ చాలెంజ్’ కోట్ల విజయభాస్కర రెడ్డి స్టేడియంలో నిర్వహిస్తారు. ఇందులో పాల్గొనాలంటే 24న రాత్రి 8 గంటల్లోగా రూ.200 చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. స్కూల్ ఐడీ, యూనిఫామ్, చెస్ బోర్డు తప్పనిసరిగా తెచ్చుకోవాలి. వివరాలకు 9247188018, 9032455655 ఫోన్ నంబర్లలో సంప్రదించాలి. 26 నుంచి 2100 రేటింగ్ కంటే తక్కువ ఉన్న ఆటగాళ్ల కోసం టోర్నీ ప్రారంభమవుతుంది. రేటింగ్ పాయింట్లు లేని రాష్ట్ర క్రీడాకారులు పలువురు పాల్గొంటున్నారు. -
తొలియత్నం: రవితేజ లేకపోతే నేను లేను!
రవితేజ... ఈ పేరుకో స్టైలుంది. రామ్‌గోపాల్‌వర్మ... ఈ పేరుకో బ్రాండ్ ఉంది. టబు, జ్యోతిక... వీళ్లకో రేంజ్ ఉంది. బట్, హరీష్ శంకర్... ఈ పేరుకు అప్పటికి ఏ ఐడెంటిటీ లేదు. పరిచయానికి ఎలాంటి ఐడీ కార్డూ లేదు. ఈ యువకుడు తన కెరీర్లో లైట్ కోసం స్విచ్ వెతుకుతుంటే, అనుకోకుండా ట్రాన్స్ఫార్మర్ తగిలింది. అది కొట్టిన ‘షాక్’ నుంచి తేరుకోవడానికి అతనికి నాలుగేళ్లు పట్టింది. ఆ షాక్ తాలూకు ప్రకంపనాలు, పర్యవసానాల గురించి హరీష్ శంకర్ మాటల్లోనే... బైక్ స్పీడ్‌గా వెళుతున్నప్పుడు బ్రేక్ వేస్తే చాలా పెద్ద కుదుపు వస్తుంది. నా మొదటి సినిమా విషయంలోనూ అదే జరిగింది. దుర్గా ఆర్ట్స్‌లో అసోసియేట్ డెరైక్టర్‌గా పనిచేసేవాణ్ని. డెరైక్టర్ ఎవరైనా నేను మాత్రం కంపెనీ తరఫున అసోసియేట్‌గా చేసేవాణ్ని. నేను, నారాయణగారు, గోపాల్‌రెడ్డిగారు కలిసి కొత్త కథలు వినేవాళ్లం. దుర్గా ఆర్ట్స్‌లో ఎన్టీఆర్‌తో సినిమా చేద్దామనుకుని ఎన్ని కథలు విన్నా నచ్చలేదు. అదే సమయంలో కోన వెంకట్ ద్వారా రవిరాజా పినిశెట్టి దగ్గర ‘వీడే’ సినిమాకు అసోసియేట్‌గా చేరాను. ఆయన దగ్గరే డెరైక్షన్‌లో ఓనమాలు నేర్చుకున్నాను. ఆ సమయంలో రవితేజతో మంచి పరిచయం ఏర్పడింది. తరువాత మళ్లీ గోపాల్‌రెడ్డిగారు చెప్పగానే ఆటోగ్రాఫ్ సినిమాకు కో-డెరైక్టర్‌గా వెళ్లాను. అప్పుడు నాకు, రవితేజకు మధ్య స్నేహం బాగా పెరిగింది. నేను తనతో ఎప్పుడూ ఒక కో-డెరైక్టర్‌గా ఉండలేదు. తను నన్నెప్పుడూ ఒక తమ్ముడిగా, ఫ్రెండ్‌గానే చూశాడు. ‘నా ఆటోగ్రాఫ్’ చిత్రం కోసం కేరళలో గోపిక ఎపిసోడ్ షూట్ చేసేటప్పుడు నేను, రవి రోజూ గంటన్నరపాటు పడవలో ప్రయాణించేవాళ్లం. ఎన్నో విషయాలు మాట్లాడుకునేవాళ్లం. మా ఇద్దరికీ కిషోర్‌కుమార్, అమితాబ్ బచ్చన్, చిరంజీవి కామన్ ఫ్యాక్టర్స్. నేనోసారి ఒక క్యారెక్టరైజేషన్ చెప్పాను. తనకు బాగా నచ్చింది. దాంతో ఆటోగ్రాఫ్ పోస్ట్ ప్రొడక్షన్ అయ్యాక నేను స్క్రిప్ట్ రెడీ చేసుకునే పనిలో పడ్డాను. ఒకసారి జ్యోతిక బర్త్‌డే రోజు తనకో సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామనుకున్నాం. అప్పటికి సూర్య, జ్యోతిక ప్రేమలో ఉన్నారు. సూర్యతో కోన వెంకట్ ముందే మాట్లాడి షూటింగ్‌కు వచ్చేట్టు ప్లాన్ చేశారు. ఆ రోజు మేం మొదట బొకే ఇచ్చి తరువాత సూర్యని ఎంటర్ చేశాం. తను చాలా సర్ప్రైజ్ అయ్యింది. అదే సమయంలో ప్రవాల్ రామన్ డెరైక్షన్‌లో వర్మగారు ఓ సినిమా చేద్దామనుకుంటున్నారని న్యూస్ వచ్చింది. తెలుగులో రవితేజ హీరో. తెలుగు వెర్షన్‌కు హిందీ తెలిసిన ఓ కో-డెరైక్టర్ సెట్లో ఉండాలనుకుని, రవితేజ నన్ను రికమెండ్ చేశారు. మన కథ కూడా ఆ సెట్స్‌మీద డిస్కస్ చేసుకోవచ్చని రవి చెప్పడంతో నేను ఓకే అన్నాను. కథ వింటానికి నేను, కోన వెంకట్ బాంబే వెళ్లాం. అక్కడ మొదటిసారి వర్మని కలిశాను. ఆయన గంటన్నర సేపు ‘షాక్’ కథ చెప్పారు. వింటుంటే ఒక హాలీవుడ్ స్క్రిప్ట్ చదువుతున్నట్టు, మారియోఫ్యుజో నవల చదువుతున్నట్టు కళ్లముందు సినిమా కనిపించింది. నేను మంత్రముగ్ధుడిలా ఉండిపోయాను. తేరుకోవడానికి చాలా టైమ్ పట్టింది. అంత పర్ఫెక్ట్ నేరేషన్ ఇచ్చారు. తరువాత ఎలా ఉందని అడిగారు. స్క్రిప్ట్ ఎక్స్ట్రార్డినరీ, కానీ రవితేజకు సూటవదని చెప్పాను. ఆయన వెంటనే ‘నువ్వు బాంబే వచ్చి నా కథ విని, సినిమా వర్కవుటవదు అంటే నేను డెసిషన్ తీసుకోను. ఏం చేస్తే వర్కవుట్ అవుద్దో ఆలోచించు. ఈ సినిమాకు నువ్వే దర్శకుడివి’ అన్నారు. చాలా షాకయ్యా. ‘నీ లైఫ్‌లో కీలకమైన నిర్ణయం తీసుకోవడానికి నీకు అరగంట టైమిస్తున్నా’ అని ఫోన్ మాట్లాడుతూ వెళ్లిపోయారు. నేను సందిగ్ధంలో ఉండిపోయాను. నాకు సినిమా చేయాలని ఉంది కానీ, ఇదేమో డార్క్ కంటెంట్. ఏం చేయాలి? కోన వెంకట్ నా ఆలోచనలకు తెరదించుతూ నాకు గీతోపదేశం చేశారు. ‘అందరూ అవకాశాల కోసం నానా పాట్లూ పడుతుంటే నువ్విలా వెనుకాడటం కరెక్ట్ కాదు. అందులో రామ్‌గోపాల్‌వర్మ లాంటి డెరైక్టర్ తనంతట తాను అడిగినప్పుడు ఆ అవకాశాన్ని వదులుకోవద్దు’ అని చెప్పారు. నేను సినిమా ఒప్పుకోవడానికి మానసికంగా సంసిద్ధమైపోయాను. ఇరవై నిమిషాల్లో ఆయనకు నా నిర్ణయం చెప్పేశాను. ఆ రోజు నుంచి ఫస్ట్ కాపీ వచ్చే వరకు ఆయన జోక్యం చేసుకోలేదు. కానీ వర్మగారు అనుకున్నదానిలో మేం చిన్న చిన్న మార్పులు చేశాం. ఆయన స్టైల్‌గా, క్రిస్ప్‌గా ఒక గంటన్నర సినిమా తీయమన్నారు. పాటలు లేకుంటే బాగుంటుందన్నారు. కానీ పాటలు లేకుండా తీయడానికి చాలా మెచ్యూరిటీ కావాలి. ‘మేం రంగీలానే తీయలేదు. అప్పుడే కంపెనీ, సర్కార్లు తీయమంటే ఎలా’ అంటే ఆయన నవ్వారు. అజయ్ అతుల్ ‘మధురం మధురం’ అని భగవంతునికి సంబంధించిన మధురాష్టకం పాటను కంపోజ్ చేసిన తీరు చూసి ఆ పాట పెట్టడానికి కన్విన్స్ అయ్యారు. షూటింగ్ మొదలైంది. మొదటిరోజు జ్యోతికతో షూట్. తను మరుసటిరోజు వేరే షూట్‌కు వెళ్లాలి. ఉదయం తొమ్మిదికి మొదలుపెట్టి రాత్రి పదకొండు దాకా చేశాం. దాంతో మొదటిరోజు అంతా హడావుడిగా జరిగిపోయింది. నిజానికి అనుకున్నదాని ప్రకారం జ్యోతికది చాలా చిన్న క్యారెక్టర్. మేం చేసిన మార్పుల్లో భాగంగా తన క్యారెక్టర్ నిడివి పెరిగింది. తను చాలా బిజీగా ఉన్నా... అటు గౌతమ్ మీనన్ సినిమా చేస్తూనే మాకు డేట్స్ అడ్జస్ట్ చేసింది. ఇదంతా కలా నిజమా అని తేరుకోవడానికి నాకు ఫస్ట్ షెడ్యూల్ పట్టింది. షూటింగ్లో పెద్దగా ప్రాబ్లెమ్స్ రాలేదు కానీ ఒకరోజు నా కో-డెరైక్టర్ వచ్చి తర్వాతి రోజు టబు, జ్యోతికల సీన్ అని చెప్పాడు. అంత పెద్ద యాక్టర్స్‌ని నేను డెరైక్ట్ చేయాలా అని భయపడిపోయాను. ఆ రాత్రి నిద్ర పట్టలేదు. జైల్ సీన్స్ తీస్తున్నప్పుడు కూడా కొంచెం ఇబ్బందిగా ఫీలయ్యాను. ఒక్కోసారి అసిస్టెంట్స్ మీద అరిచేసేవాణ్ని. హీరో ఒంటరిగా కూర్చుని ఏడ్చే సీన్ తీసేటప్పుడు రవితేజ ‘ఇలా కరెక్ట్ కాదేమో హరీష్, అయినా నీకోసం చేస్తున్నాను’ అన్నాడు. తను కేవలం నన్ను నమ్మి చేశాడు. షాక్ షూటింగ్లో ఎన్నో మరపురాని అనుభవాలు. ఒకసారి జ్యోతిక బర్త్‌డే రోజు తనకో సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామనుకున్నాం. అప్పటికి సూర్య, జ్యోతిక ప్రేమలో ఉన్నారు. సూర్యతో కోన వెంకట్ ముందే మాట్లాడి షూటింగ్‌కు వచ్చేట్టు ప్లాన్ చేశారు. ఆ రోజు మేం మొదట బొకే ఇచ్చి తరువాత సూర్యని ఎంటర్ చేశాం. తను చాలా సర్ప్రైజ్ అయ్యింది. సినిమా తీస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్డ్ డెరైక్టర్లా చేస్తున్నానని నన్నందరూ ఎంకరేజ్ చేశారు. కెమెరామెన్ సర్వేష్ మురారి సహకారంతో ఒక్కోరోజు 3, 4 సీన్స్ తీశాం. మొత్తం 72 రోజుల్లో సినిమా పూర్తయింది. షాక్ సినిమా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు దాదాపు రాముగారు మొత్తంగా మాతోనే ఉన్నారు. సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎంత ఇంపార్టెంటో అప్పుడు నేర్చుకున్నాను. పోస్ట్ ప్రొడక్షన్లో ఒకే ఒక సీన్ తీసేశాం. హీరోయిన్ మీద జైలర్ జోకులేస్తుంటే హీరో తిట్టే సీన్ ఉంటుంది. అప్పటికే సినిమా అంతా ఏడుపుతో నిండి ఉంది. మళ్లీ ఇది ఎందుకులే అని తీసేశాం. ఇదొక్కటే ఆ సినిమాలో మేం తీసేసిన సీన్. ఫైనల్‌గా సినిమా చాలా రియలిస్టిక్‌గా వచ్చింది. జ్యోతిక, రవితేజ క్యారెక్టరైజేషన్ చాలా న్యాచురల్ ఉంది. వాళ్ల మధ్య తీసిన లవ్ ట్రాక్ రొమాంటిక్ సీన్స్ బాగా వచ్చాయి. సినిమా చూశాక రవితేజ ‘చాలా బాగుందబ్బాయ్, రిజల్ట్ గురించి నువ్వేం వర్రీ అవకు. మనం ఒక సినిమా డిఫరెంట్‌గా ట్రై చేద్దాం అనుకుని చేశాం. సో... కూల్’ అన్నాడు. 2006 ఫిబ్రవరి 8న రిలీజ్. ఏడో తారీఖు పి.వి.ఆర్.లో ప్రివ్యూ వేశాం. ఫస్ట్ హాఫ్ సెలైంట్‌గా చూశారు. సెకెండాఫ్ అవగానే అందరూ మాట్లాడకుండా వెళ్లిపోయారు. విషయం అర్థమైంది. రిజల్ట్ విషయంలో తప్ప అన్ని రకాలుగా నాకు సంతృప్తినిచ్చిన సినిమా షాక్. అది ఫెయిలవడానికి కారణం నేనే తప్ప మరెవరూ కాదు. షాక్ రామూగారి బ్రెయిన్ చైల్డ్. నేను ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ ఇష్టపడటం వల్లనో, నా ఆలోచనా విధానం భిన్నంగా ఉండటం వల్లనో ఆయన అనుకున్న భావాన్ని నేను కరెక్ట్‌గా తెర మీదకు తీసుకురాలేదని ఈ రోజుకూ ఫీలవుతుంటాను. నిజంగా ఆయన ఇన్వాల్వ్ అయి ఉంటే షాక్ సినిమా బెటర్‌గా వచ్చి ఉండేదేమో! చివరకు నాకు అర్థమైందేంటంటే, మనకి ఏది వచ్చో అదే చేయాలి. మనకు రాని దాన్ని మనం ముట్టుకోకూడదు. అలా చేస్తే దానికి న్యాయం చేయలేం అని ఈ సినిమా ద్వారా నేర్చుకున్నాను. షాక్ ఫ్లాపయినా రవితేజ నన్నెప్పుడూ ఫ్లాప్ డెరైక్టర్‌గా చూడలేదు. ‘మిరపకాయ్’ చేసే అవకాశం ఇచ్చి నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. అందుకే రవితేజ లేని నా ఫిలిం కెరీర్ లేదు. - కె.క్రాంతికుమార్‌రెడ్డి