‘రెగ్యులర్’పై అయోమయం | 'Regular' confused on | Sakshi
Sakshi News home page

‘రెగ్యులర్’పై అయోమయం

Published Sat, Nov 23 2013 3:19 AM | Last Updated on Sat, Sep 2 2017 12:52 AM

'Regular' confused on

కలెక్టరేట్, న్యూస్‌లైన్ :  జిల్లాలో కాంట్రాక్టు పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేసేందుకు ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శుల నియామకాన్ని చేపడుతోంది. రెగ్యులర్ కార్యదర్శులుగా అర్హత సాధించలేకపోతే తమ పరిస్థితి ఏమిటన్నది కాంట్రాక్టు కార్యదర్శులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం డిగ్రీ పూర్తిచేసిన వారందరూ కాంట్రాక్టు కార్యదర్శుల పోస్టులకు దర ఖాస్తు చేసుకునేందుకు అర్హులని ప్రభుత్వం ప్రకటిం చింది.

డిగ్రీ మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తామని చెబుతున్న నేపథ్యం లో ఉన్నవారికి వెయిటే జీ ఇచ్చినా మెరిట్ రాకపోతే ఎలా అన్న ప్రశ్నలు అయోమయానికి గురిచేస్తున్నాయి. డిగ్రీలో 100 శాతం మార్కులు ఉంటే నియామకాల్లో 75 శాతం వెయిటేజీగా లెక్కిస్తారు. ఇప్పటికే కార్యదర్శులుగా కొనసాగుతున్న వారికి 25 శాతం అదనపు వెయిటేజీ ఇస్తారు.
 
ఉదాహర ణకు ప్రస్తుతం కాంట్రాక్టు పద్ధతి లో పనిచేస్తున్న కార్యదర్శి 50 శాతం మార్కుల తో డిగ్రీ పాసై ఉన్నాడనుకుందాం. సాధారణ వెయిటేజీ కింద అందరితోపాటు 37 మార్కు లు వరకు వస్తాయి. ఇన్‌సర్వీస్ వెయిటేజీ కింద ప్రభుత్వం మరో 25 మార్కులు కలుపుతుంది. దీంతో అతడికి మొత్తం 62 మార్కులు వ స్తాయి.
 
తనతో పోటీ పడే అభ్యర్థి డిగ్రీలో 90 శా తం మార్కులు సాధిస్తే అతడికి మార్కుల ద్వా రా వచ్చే వెయిటేజీ 67 శాతం వరకు ఉంటుం ది. దీంతో కాంట్రాక్టు వారిని పక్కన పెట్టి మా ర్కుల ఆధారంగా వెయిటేజీ ఉన్నవారికి ఉద్యో గం ఇవ్వాల్సిందే. ఈ లెక్కన కాంట్రాక్టు కార్యదర్శులను రెగ్యులర్ చేయడం అనేది అంత సుల భం కాదని స్పష్టమవుతోంది. అంతేకాకుండా ప్రస్తుతం చేపడుతున్న రెగ్యులర్ కార్యదర్శుల నియామకాల్లో రిజర్వేషన్, రోస్టర్ విధానం తప్పక పాటించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఉన్నవారందరికీ పోస్టులు సరిపోతే రోస్టర్ ప్రకారం ఖాళీలు ఉంటాయా లేవా అన్న విషయంపై ఇంకా అధికారులకు స్పష్టత రాలేదు.
 
124 మంది కార్యదర్శులు..

జిల్లాలో కాంట్రాక్టు పద్ధతిలో 124 మంది పనిచేస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం వీరి కి సరిపడా విద్యార్హతలు లేవు. కనీసం 20 మం ది వరకు డిగ్రీలో అత్తెసరు మార్కులతో పాసై ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రకటించిన 135 పోస్టుల్లో పోటీపడటం అంటే అంత ఆషామాషీ కాదు. ఒకవేళ వెయిటేజీ సరిపోక రెగ్యుల ర్ పోస్టుల్లో నియామకం కానివారి సంగతి ఇం కా తేలలేదు.
 
కాంట్రాక్టు కార్యదర్శుల కాలం పొడిగింపు..

ప్రస్తుతం జిల్లాలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్యదర్శుల కాలాన్ని ప్రభుత్వం గత నెలలో పొడిగించింది. ఈసారి ఆరు నెలలకే రెన్యూవల్ చేసింది. ఆ తర్వాతనే అసలు సమస్య ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే అప్పటికీ రెగ్యులర్ పోస్టుల్లో భర్తీ కాకుండా మిగిలిన వారికి మళ్లీ రెన్యూవల్ చేసి కాంట్రాక్టు కొనసాగిస్తారా... లేదా అన్నది తేలాల్సి ఉంది. జిల్లాలో 962 గ్రామ పంచాయతీలకు 350 మంది మాత్రమే కార్యదర్శులు ఉన్నారు.

ఇప్పుడు 135 మంది రెగ్యులర్ ఉద్యోగులు వచ్చినా ఇంకా ఖాళీలుం టాయి. కాబట్టి ప్రభుత్వ నిర్ణయం కూడా వీరికి అనుకూలంగా ఉండొచ్చని ఆశిస్తున్నారు. నిబంధనల కారణంగా కాంట్రాక్టు వారు రెగ్యులర్ కార్యదర్శులుగా మారే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. త్వరలో కార్యదర్శుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని అధికారులు ప్రకటించిన నేపథ్యంలో వచ్చే దరఖాస్తులు, అభ్యర్థుల మెరిట్‌పై ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టు కార్యదర్శుల భవితవ్యం ఆధారపడి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement